శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఎంఎస్ఎంఈలకు సాధారణ పరిశోధన మరియు సాంకేతిక అభివృద్ధి కేంద్రాలు (CRTDH) సాధికారత కల్పించడంపై చింతన్ శిబిర్ దుర్గాపూర్‌లో సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMERI) వద్ద నిర్వహించే చింతన్ శిబిర్ మంగళవారం ప్రారంభమవుతుంది.
Posted On:
11 SEP 2023 4:25PM by PIB Hyderabad
శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన శాఖతో కలసి సాధారణ పరిశోధన మరియు సాంకేతిక అభివృద్ధి కేంద్రాలు మరియు ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, వినూత్న కల్పనల ఆవిష్కర్తల మధ్య సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో దేశవ్యాప్తంగా మొత్తం 18 CRTDHల వద్ద ఎంఎస్ఎంఈలకు సాధారణ పరిశోధన మరియు సాంకేతిక అభివృద్ధి కేంద్రాలు సాధికారత కల్పించడానికి చింతన్ శిబిర్ నిర్వహించడాన్ని ప్రారంభించింది
ఈ పరంపరలో రెండు చింతన్ శిబిరాలను శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన శాఖ మద్దతుతో దుర్గాపూర్‌లోని సాధారణ పరిశోధన మరియు సాంకేతిక అభివృద్ధి కేంద్రం(CRTDH)లో ఖరగ్‌పూర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మరియు లక్నో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ (IITR)లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. వాటికి కొనసాగింపుగా మూడవ 'చింతన్ శిబిర్' ను దుర్గాపూర్‌లోని సాధారణ పరిశోధన మరియు సాంకేతిక అభివృద్ధి కేంద్రం కలసి దుర్గాపూర్‌లో సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMERI) వద్ద నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం దుర్గాపూర్‌లోని CMERI డైరెక్టర్ డాక్టర్ నరేష్ చంద్ర ముర్ము ప్రారంభోపన్యాసంతో మొదలవుతుంది. శాస్త్రవేత్త
డాక్టర్ సుజాత చక్లనోబిస్ స్థూలదృష్టితో చేసే అవలోకనంతో ప్రారంభమవుతుంది. ఈ చింతన్ శిబిర్ సందర్బంగా దుర్గాపూర్ CMERI లో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల వీడియోను డాక్టర్ సుజాత చక్లనోబిస్, డాక్టర్ నరేష్ చంద్ర ముర్ము విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి అధికారులు, శాస్త్రవేత్తల బృందం హాజరై చర్చలు జరుపుతారు. ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, వినూత్న కల్పనల ఆవిష్కర్తలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించడానికి అలాగే CRTDH సూచించే సంభావ్య పరిష్కారాలను చర్చించడానికి
“సంవాద్” పేరిట నేపథ్య సమావేశం జరుగుతుంది. ప్రాథమికంగా ఈ సమావేశాలు ఎంఎస్ఎంఈల పరిశోధనాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి మద్దతు ఇవ్వడంలో CRTDH పాత్రపై దృష్టి సారిస్తాయి. పారిశ్రామిక సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రతినిధులు తమ పరిశోధన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో సవాళ్లు ఎదుర్కోవడానికి CRTDH తమ పరిష్కారాలను కూడా అందించడం జరుగుతుంది. CRTDHలో ఉన్న సౌకర్యాలను చూసేందుకు స్వల్ప పర్యటనతో కార్యక్రమం ముగుస్తుంది, అతిథులు మరియు ప్రతినిధులు దీనికి అగ్రభాగాన ఉంటారు.
ఈ చింతన్ శిబిర్ MSMEలు/స్టార్టప్‌లు/ఆవిష్కర్తలు, పరిశ్రమ సంఘాల ప్రతినిధులు మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యలకు సంభావ్య పరిష్కారాలను గుర్తించడానికి DSIR-CRTDH-CMERI బృందం నుండి హాజరైన వారితో పరస్పర ప్రభావశీల/అన్యోన్య సమావేశం ఉంటుంది. భారతదేశాన్ని ఒక ముఖ్యమైన పారిశ్రామిక పరిశోధనాభివృద్ధి మరియు తయారీ కేంద్రంగా మార్చే దిశలో
ఇది ఒక అడుగు.
***
(Release ID: 1956514)
Visitor Counter : 123