కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

గ్రామీణ ప్రాంతాల్లో ఫైబర్-టు-ది-హోం (ఎఫ్‌టిటిహెచ్) కనెక్షన్లు అందించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల గుర్తింపు కోసం పథకం

Posted On: 11 SEP 2023 4:43PM by PIB Hyderabad

గ్రామీణ ప్రాంతాల్లో ఫైబర్-టు-ది-హోం  ( ఎఫ్‌టిటిహెచ్)    కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను గుర్తించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం  ఒక పథకాన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ సేవలను మరింత అందుబాటులోకి తెచ్చి సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించడం లక్ష్యంగా పథకం అమలు జరుగుతుంది.  

పథకం  ముఖ్యాంశాలు

ఈ పథకం కింద ఒక సంవత్సరం కాలంలో  గ్రామీణ ఎఫ్‌టిటిహెచ్ కనెక్షన్‌లలో గరిష్ట సంఖ్యలో నికర జోడింపులను అందించిన తొమ్మిది మంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ను టెలికమ్యూనికేషన్స్ విభాగం గుర్తిస్తుంది.   ఏ,బి,సి , కేటగిరీలలో ముగ్గురు చొప్పున గుర్తించాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం నిర్ణయించింది.

గుర్తించిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కు  ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.టెలికమ్యూనికేషన్స్ విభాగం వెబ్‌సైట్‌లో గుర్తించిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్  పేరు ప్రదర్శిస్తారు. ఏప్రిల్ నుంచి మార్చి వరకు జరిగే  నికర జోడింపులకు ఏటా గుర్తింపు ఇస్తారు. మొదటి గుర్తింపు 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉంటుంది.

ప్రతి వర్గానికి నిర్ణయించిన  కనీస నికర అదనపు ప్రమాణాలు క్రింది విధంగా ఉన్నాయి:

వర్గం ఏ : ఈ వర్గంలోకి  వచ్చే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్   గ్రామీణ ప్రాంతంలో ఎఫ్‌టిటిహెచ్ కనెక్షన్‌లను  కనీసం 50,000 ఎక్కువ చేయాలి. 

వర్గం బి : ఈ వర్గంలోకి  వచ్చే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్  గ్రామీణ ప్రాంతంలో ఎఫ్‌టిటిహెచ్ కనెక్షన్‌లను  కనీసం 10,000 ఎక్కువ చేయాలి. 

వర్గం C: ఈ వర్గంలోకి  వచ్చే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్  లు తప్పనిసరిగా  గ్రామీణ ప్రాంతంలో ఎఫ్‌టిటిహెచ్ కనెక్షన్‌లను  కనీసం 2,000 ఎక్కువ చేయాలి. 

ఈ కార్యక్రమం వల్ల  గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సౌకర్యాలు పెరిగి సేవలు అందుబాటులోకి వస్తాయి.  దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక అభివృద్ధి సమ్మిళిత వృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా పథకం అమలు జరుగుతుంది. 

పథకం గురించి అదనపు సమాచారం, వివరాల కోసం https://dot.gov.in/data-services/2574 సంప్రదించవచ్చు. 

 

***

 



(Release ID: 1956447) Visitor Counter : 112


Read this release in: English , Urdu , Hindi , Marathi