రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్ -ఫ్రాన్స్ ద్వైపాక్షిక నావికాదళ విన్యాసం వరుణ- 2023 - 21వ ఎడిషన్
Posted On:
08 SEP 2023 7:51PM by PIB Hyderabad
భారత్, ఫ్రెంచి నావికాదళాల మధ్య జరుగుతున్న 21వ ఎడిషన్ వరుణ (వరుణ 23) విన్యాసాల రెండవ దశను అరేబియా సముద్రంలో నిర్వహించారు. ఇరు పక్షాలకు చెందిన గైడెడ్ మిస్సైల్ యుద్ధనౌకలు, ట్యాంకర్లు, సముద్ర పహారా విమానాలు, సమగ్ర హెలికాప్టర్లు ఈ విన్యాసాలలో పాలుపంచుకున్నాయి. మూడు రోజుల పాటు సాగిన ఈ విన్యాసాలలో ఉమ్మడి ఆపరేషన్లు, మార్గంలో ఇంధనం నింపుకోవడం, వివిధ వ్యూహాత్మక ప్రక్రియలు జరిగాయి. తమ యుద్ధపోరాట నైపుణ్యాలను పెంచుకోవడానికి, సానబెట్టుకోవడానికి, పరస్పరచర్యలను మెరుగుపరచుకొని, ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, సుస్థిరతను ప్రోత్సహించే తమ సామర్ధ్యాన్ని ప్రదర్శించేందుకు నావికాదళాలకు చెందిన రెండు యూనిట్లు కృషి చేశాయి. వరుణ-2023 తొలి దశను భారతదేశపు పశ్చిమ సీబోర్డులో 16 నుంచి 20 జనవరి 2023 వరకు జరిగాయి.
భారత & ఫ్రెంచి నావికాదళాల ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాలను 1993లో ప్రారంభించారు. ఈ విన్యాసాలకు 2001లో వరుణ అని నామకరణం చేశారు. అప్పటి నుంచి ఇది బలమైన భారత్ - ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలకు తార్కాణంగా నిలించింది. గడిచిన కొద్ది ఏళ్ళలో పరిధిని, సంక్లిష్టతను పెంచుకున్న ఈ విన్యాసాలు, పరస్పర ఉత్తమ కార్యాచరణ పద్ధతులను, ప్రక్రియలను పంచుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ విన్యాసాలు సముద్రంలో మంచి వాతావరణం కోసం పరస్పర సహకారాన్ని పెంచేందుకు ఇరు నావికాదళాల మధ్య కార్యాచరణ స్థాయి పరస్పరచర్యకు సౌలభ్యాన్ని కల్పించడమే కాక, సామాన్య ప్రపంచ సముద్ర స్వేచ్ఛను, భద్రతను, సురక్షతను కాపాడేందుకు ఉమ్మడి నిబద్ధతను ఉద్ఘాటిస్తుంది.
***
(Release ID: 1955686)
Visitor Counter : 174