రక్షణ మంత్రిత్వ శాఖ
బ్రైట్ స్టార్ -23 విన్యాసాల కోసం ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఐఎన్ఎస్ సుమేధ
Posted On:
07 SEP 2023 2:24PM by PIB Hyderabad
బ్రైట్ స్టార్-23 విన్యాసాలలో పాలు పంచుకునేందుకు 06 సెప్టెంబర్ 2023న ఐఎన్ఎస్ సుమేధ ఈజిప్టులోని పోర్ట్ అలెగ్జాండ్రియాను చేరుకుంది. బహుళ జాతి త్రిదళాల సైనిక విన్యాసాల ఈ ఎడిషన్‌లో 34 దేశాలు పాల్గొననున్నాయి. మధ్య ప్రాచ్యం & ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో జరుగనున్న అతిపెద్ద ఉమ్మడి సైనిక విన్యాసమిది.
బ్రైట్ స్టార్ 23 విన్యాసాలను రెండు దశలలో నిర్వహించనున్నారు. ఓడరేవు దశలో అంతర్ నౌక సందర్శనలు, వృత్తిపరమైన అభిప్రాయాలు ఇచ్చి పుచ్చుకోవడాలు, క్రీడలు, సముద్ర దశకు ప్రణాళిక, నిర్వహణపై చర్చల వంటి విస్త్రత కార్యకలాపాలు ఉంటాయి. సముద్ర దశలో ప్రత్యక్ష ఆయుధాల కవాతు సహా క్రాస్ డెక్ ఫ్లయింగ్ ర(అంతర్ నౌకల నుంచి విమానాలు ఎగరడం), ఉపరితల వ్యతిరేక, వాయు వ్యతిరేక విన్యాసాల వంటి సంక్లిష్టమైన, అత్యంత తీవ్రమైన విన్యాసాలు ఉండనున్నాయి. భాగస్వామ్య దేశాల నుంచి సముద్ర భద్రతా ఆపరేషన్ల ఉత్తమ కార్యచారణల నుంచి లబ్ది పొందడంతో పాటు పరస్పర చర్యలను మెరుగుపరచుకోవడానికి, ప్రదర్శించడానికి ఈ విన్యాసాలు అవకాశాన్ని కల్పిస్తాయి.
బ్రైట్ స్టార్ విన్యాసాలలో భారతీయ నావికాదళం పాలుపంచుకోవడం ఇదే తొలిసారి. ఇందులో స్నేహపూర్వక విదేశీ నావికాదళాలకు చెందిన నౌకలు కూడా పాలుపంచుకుంటున్నాయి. ఈ కసరత్తులు రెండు వారాల పాటు తీవ్రమైన కార్యకలాపాలు, శిక్షణతో సాగుతాయి. ఇందులో పాల్గొనే నౌకాదళాలు ఒక సమగ్ర శక్తిగా కలిసి పని చేయగల సామర్ధ్యాన్ని పునరుద్ఘాటించడం, సహకార శిక్షణ, పరస్పర అవగాహన ద్వారా సముద్ర భద్రత, ప్రపంచ స్థిరత్వాన్ని పట్టి చూపాలన్న తమ ఉమ్మడి నిబద్ధతను పట్టి చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
కమాండర్ ఎంసి చందీప్ నేతృత్వంలోని సుమేధ, దేశీయంగా నిర్మించిన నావల్ ఆఫ్ షోర్ పాట్రోల్ వెస్సెల్స్‌లో (ఎన్ఒపివి - సముద్రతీర పహారా నౌక)లో మూడవది. ఇది సుదీర్ఘ క్షమతను కలిగి ఉండటమే కాక అవసరమైన, తగిన ఆయుధాలను, సెన్సార్లను అమర్చి ఉండటంతో పాటుగా సమగ్ర హెలికాప్టర్‌ను ఎక్కించుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.
ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను పట్టి చూపే భారతీయ నౌకా నిర్మాణ పరిశ్రమ సామర్ధ్యాలకు సాక్ష్యంగా విభిన్న కార్యాచరణ మిషన్ల కోసం వినియోగించగల అత్యంత శక్తివంతమైన వేదిక నిలుస్తుంది.
****
(Release ID: 1955525)
Visitor Counter : 146