రక్షణ మంత్రిత్వ శాఖ
రెండవ ఎసిటిసిఎం నావ, ఎల్ఎస్ఎఎం 16 (యార్డ్ 126) అప్పగింత
Posted On:
07 SEP 2023 11:21AM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ చొరవలకు అనుగుణంగా పూణెలోని ఎంఎస్ఎంఇ అయిన ఎం/ఎ స్ సూర్యదీప్త ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో పదకొండు సాయుధ నావల నిర్మాణం, సరఫరా కోసం ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఎల్ఎస్ఎఎం 16 (యార్డ్ 126) శ్రేణికి చెందిన రెండవ పెద్ద నావను 06 సెప్టెంబర్ 2023న కమడోర్ ఎంవి రాజ్ కృష్ణ, సిఒవై (ఎంబిఐ) సమక్షంలో భారతీయ నావికాదళానికి అప్పగించారు. ఈ నావను ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్) వర్గీకరణ నిబంధనలకు లోబడి 30 ఏళ్ళ జీవితకాలంతో నిర్మించారు. ప్రధాన, అనుషంగిక పరికరాలు/ వ్యవస్థలను దేశీయ ఉత్పత్తిదారుల నుంచి తీసుకున్న క్రమంలో, రక్షణ మంత్రిత్వ శాఖ చొరవ అయిన మేక్ ఇన్ ఇండియాకు పతాకధారిగా ఈ నావ సగర్వంగా నిలువనుంది.
రేవుకట్ట, రేవుల బయిట భారతీయ నావికాదళ నౌకలకు రవాణా, వస్తువులను/ మందుగుండు సామాగ్రిని ఎక్కించి, దించడంలో ఎసిటిసిఎం నావను ప్రవేశపెట్టడం అన్నది కార్యాచరణ నిబద్ధతకు ప్రేరణను ఇవ్వనుంది.
(Release ID: 1955457)
Visitor Counter : 171