పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
వాయు కాలుష్యాన్ని అధిగమించేందుకు బలమైన భాగస్వామ్యాలతో బాధ్యతను పంచుకోవడంతో పాటు పెట్టుబడులను పెంచడం అవసరమని స్పష్టం చేసిన శ్రీ భూపేందర్ యాదవ్
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023లో ఇండోర్ మొదటి స్థానంలో నిలవగా తరువాతి స్థానాల్లో నిలిచిన ఆగ్రా, థానే
Posted On:
07 SEP 2023 2:33PM by PIB Hyderabad
కేంద్ర పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు మరియు కార్మిక, ఉపాధి మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ రోజు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023 అవార్డులను ప్రకటించారు. 1వ కేటగిరీ కింద (మిలియన్ ప్లస్ జనాభా) ఇండోర్ మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత ఆగ్రా మరియు థానేలు ఉన్నాయి. రెండవ కేటగిరీలో (3-10 లక్షల జనాభా) అమరావతి మొదటి ర్యాంక్‌ను పొందగా, మొరాదాబాద్ మరియు గుంటూరు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా మూడవ కేటగిరీకి (3 లక్షల కంటే తక్కువ జనాభా) పర్వానూ మొదటి ర్యాంక్‌ను పొందింది. తరువాత కాలా అంబ్ మరియు అంగుల్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ యాదవ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 4వ అంతర్జాతీయ స్వచ్ఛమైన వాయు దినోత్సవం (స్వచ్ఛ్ వాయు దివస్ 2023) పటిష్టమైన భాగస్వామ్యాలను సృష్టించడం, పెట్టుబడులను పెంచడం మరియు వాయు కాలుష్యాన్ని అధిగమించే బాధ్యతను పంచుకోవడం అలాగే "స్వఛ్చమైన గాలి కలిసి పనిచేయడం"అనే ప్రపంచ థీమ్‌తో జరుపుకుంటున్నట్టు తెలిపారు.
2020 ఆగస్టు 15న గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశంలోని ప్రజలందరికీ స్వచ్ఛమైన గాలిని అందించడానికి ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శిస్తూ వారికి ఆరోగ్యకరమైన మరియు ఉత్పాదక జీవితానికి భరోసా ఇస్తూ హోలిస్టిక్ విధానం ద్వారా 100 కంటే ఎక్కువ నగరాల్లో గాలిలో నాణ్యతను మెరుగుపరిచే ప్రణాళికను ప్రకటించారు. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఒఈఎఫ్&సిసి) 2019 నుండి భారతదేశంలోని నగరాలు మరియు ప్రాంతీయ ప్రమాణాలలో వాయు కాలుష్య స్థాయిలను తగ్గించే చర్యలను వివరించే జాతీయ స్థాయి వ్యూహంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సిఏపి)ని అమలు చేస్తోంది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సిఏపి) అన్నివర్గాలను నిమగ్నం చేయడం ద్వారా మరియు అవసరమైన చర్యలను నిర్ధారించడం ద్వారా వాయు కాలుష్యాన్ని వ్యవస్థాగతంగా పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం కింద నగర నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికల అమలు కోసం 131 నగరాలను గుర్తించినట్లు శ్రీ యాదవ్ తెలిపారు. లక్ష్యంగా పెట్టుకున్న 131 నగరాల జాతీయ స్థాయి కార్యాచరణ ప్రణాళిక, రాష్ట్ర స్థాయి కార్యాచరణ ప్రణాళికలు & నగర స్థాయి కార్యాచరణ ప్రణాళికల తయారీ మరియు అమలుపై ఎన్‌సిఏపి దృష్టి పెడుతుంది. ఈ ప్రణాళికల సమన్వయ అమలు లక్ష్యం 131 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆయన తెలిపారు
.
అన్ని వాటాదారుల సమన్వయం, సహకారం, భాగస్వామ్యం మరియు నిరంతర కృషితో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లక్ష్యాలను సాధించగలమని శ్రీ యాదవ్ అన్నారు.
ఎన్‌సిఏపి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్‌సిఏపి అమలును పర్యవేక్షించడానికి "ప్రాణా" పోర్టల్‌ను కూడా ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పోర్టల్‌లో, నగరాలు, రాష్ట్రాలు మరియు మంత్రిత్వ శాఖల కార్యాచరణ ప్రణాళికలు వాటి అమలు స్థితి కోసం ప్రతిబింబిస్తాయి మరియు పర్యవేక్షించబడతాయి. అదనంగా, ఇతర నగరాలు ఈ పద్ధతులను అవలంబించడం కోసం నగరాలు అవలంబించే ఉత్తమ పద్ధతులు ప్రాణా పోర్టల్‌లో భాగస్వామ్యం చేయబడ్డాయి.
2021లో గ్లాస్గోలో జరిగిన యూఎన్‌ఎఫ్‌సిసిసి,కాప్ 26 సందర్భంగా గౌరవప్రదమైన ప్రధాన మంత్రి "మిషన్ లైఫ్" అంటే పర్యావరణానికి జీవనశైలి అని అర్థం ఇచ్చారని శ్రీ యాదవ్ తెలిపారు. పర్యావరణ అనుకూల జీవనశైలిని అవలంబించడానికి మరియు ప్రోత్సహించడానికి మరియు జీవితాన్ని ఒక సామూహిక ఉద్యమం (జన్ ఆందోళన్)గా మార్చడానికి భాగస్వామ్య నిబద్ధతతో, వ్యక్తుల యొక్క గ్లోబల్ నెట్‌వర్క్‌ను సృష్టించడం మరియు పెంపొందించడం ఈ మిషన్ లక్ష్యం అని ఆయన అన్నారు.
ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇ-వ్యర్థాలు, బయో-మెడికల్ వ్యర్థాలు, బ్యాటరీ వ్యర్థాలు, నిర్మాణ & కూల్చివేత వ్యర్థాలు మరియు టైర్ మరియు ప్రమాదకర వ్యర్థాలను కవర్ చేసే వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల నోటిఫికేషన్‌ను శ్రీ యాదవ్ హైలైట్ చేశారు. పర్యావరణ అనుకూలమైన పద్ధతిలో వ్యర్థాల నిర్వహణకు నిర్మాతలు/తయారీదారులు బాధ్యత వహించాలని నిర్ధారించడానికి ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ మరియు పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్స్‌ను పొందుపరిచామని ఆయన చెప్పారు.
ప్రభుత్వం యొక్క ఎస్‌ఏటిఏటి (సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫర్డబుల్ ట్రాన్స్‌పోర్టేషన్) పథకం కంప్రెస్డ్ బయో-గ్యాస్ (సిబిజి) ఉత్పత్తి ప్లాంట్‌లను నెలకొల్పడం మరియు సిబిజిని గ్రీన్ ఇంధనంగా ఉపయోగించేందుకు మార్కెట్‌లో అందుబాటులో ఉంచడం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్ మరియు పరిసర ప్రాంతాల కోసం ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కోసం ఒక చట్టబద్ధమైన కమిషన్‌ను కలిగి ఉండి, మొత్తం ఎయిర్‌షెడ్‌ను దాని అధికార పరిధిగా తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
***
(Release ID: 1955444)
Visitor Counter : 206