సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

ప్రపంచ పీటీ దినోత్సవం 2023: ఫిజియోథెరపిస్ట్‌లను గౌరవించడం, కీళ్ల వ్యాధులపై అవగాహన పెంచడం

Posted On: 07 SEP 2023 12:54PM by PIB Hyderabad

1996 నుంచి, ఏటా సెప్టెంబరు 8వ తేదీని ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవంగా (ప్రపంచ పీటీ దినోత్సవం) జరుపుతున్నారు. 1951లో ఈ వృత్తి ప్రారంభించారు. ప్రపంచ పీటీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆ రోజున, ఫిజియోథెరపిస్టుల అంకితభావానికి, వారు అందించే అమూల్యమైన సేవలకు ప్రపంచం నీరాజనం అర్పిస్తుంది. రోగులకైనా, పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారికైనా ఫిజియోథెరపిస్టులు సేవలు అందిస్తారు. సాధారణ కదలికల నుంచి సంక్లిష్ట కార్యకలాపాల వరకు సరైన శారీరక పనితీరును సాధించడంలో సాయపడతారు. ఈ సంవత్సరం, సెప్టెంబరు 8న, ప్రపంచ పీటీ దినోత్సవం ఆర్థరైటిస్‌పై (కీళ్ల సంబంధిత వ్యాధులు) దృష్టి పెడుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ వంటి వివిధ రకాల ఇన్‌ఫ్లేమేటరీ ఆర్థరైటిస్‌ కేసులను పరిశీలిస్తుంది.

భారత సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని దివ్యాంగుల సాధికారత విభాగం (డీఈపీడ్ల్యూడీ), దేశంలోని దివ్యాంగుల అభివృద్ధి కోసం కేంద్ర సంస్థలా పని చేస్తోంది. ప్రజల్లో ఫిజియోథెరపీ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి, ఈ విభాగం సెప్టెంబర్ 8, 2023న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుతోంది. తన అనుబంధ సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

 

***



(Release ID: 1955426) Visitor Counter : 115