విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఆగప్టు 2023లో 1.15 మిలియన్ యుఎస్ డాలర్ల సిండికేటెడ్ టర్మ్ లోన్లను సేకరించిన ఆర్ ఇసి
Posted On:
06 SEP 2023 4:26PM by PIB Hyderabad
విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మహారత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయి ఆర్ ఇసి లిమిటెడ్ ఆగస్టు 2023న విజయవంతంగా 1.15 బిలియన్ యుఎస్‌డిని సేకరించింది. ఈ నిధులు 5 సంవత్సరాల కాలపరిమితితో ముడిపడి ఉండడమే కాక సెక్యూర్డ్ ఓవర్‌నైట్ ఫైనాన్సింగ్ రేట్ (ఎస్ఒఎఫ్ ఆర్) ప్రమాణాలకు ముడిపడ్డాయి. ఇది యుఎస్‌డి లో తీసుకున్న రుణాల బెంచ్‌మార్క్ రేటు ఇది. ఈ కేంద్రం నుంచి వచ్చే ఆదాయాన్నిరిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇసిబి మార్గదర్శకాల కింద అనుమతించిన విద్యుత్, మౌలిక సదుపాయాలు, లాజిస్టక్స్ రంగ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు వినియోగిస్తారు. ఆర్ ఇసి మార్కెట్ బారోయింగ్ ప్రోగ్రామ్ కింద 2023-24 సంవత్సరానికి రూ. 1.20 లక్షల కోట్లను సేకరించాలన్న లక్ష్యంతో ఈ నిధులను సేకరించారు.
ఈ మొత్తాన్ని రెండు దశలలో మ్యాండేటెడ్ లీడ్ అరేంజర్స్ అండ్ బుక్ రన్నర్స్ (ఎంఎల్ఎబిలు)గా ఉన్న ఆరు బ్యాంకులతో కూడిన ఒక కన్సోర్షియం నుంచి సేకరించారు.
మొదటి విడత సేకరించిన 505 మిలియన్ డాలర్లను బ్యాంక్ ఆఫ్ బరోడా, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్ టెక్ - సిటీ (గిఫ్ట్ సిటీ), ఐఎఫ్ఎస్‌సి బ్యాంకింగ్ యూనిట్ (ఐబియు), యాక్సిస్ బ్యాంక్, గిఫ్ట్ సిటీ ఐబియు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లండన్ శాఖ నుంచి 3 ఆగస్టు 2023న సేకరించారు. ఇక రెండవ విడతగా సేకరించిన 645 మిలియన్ డాలర్లను 31 ఆగస్టు 2023న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లండన్ శాఖ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, గిఫ్ట్ సిటీ ఐబియు, బ్యాంక్ ఆఫ్ ఇండియా లండన్ శాఖ, హెచ్ఎస్‌బిసి, గిఫ్ట్ సిటీ ఐబియు నుంచి సేకరించారు.
రెండు విడతలూ కలిపి మొత్తం 550 మిలియన్ డాలర్లను గిఫ్ట్ సిటీ ఐఎఫ్ఎస్‌సి బ్యాంకింగ్ యూనిట్స్ (ఐబియులు) హామీని పొందింది. ఒక్క నెలలో ఆర్ ఇసికి గిఫ్ట్ సిటీ ఐబియుల నుంచి వచ్చిన అత్యధిక హామీ ఇదే. ఇది డిసెంబర్ 2021లో 345 మిలియన్ డాలర్ల భారీ హామీని ఇది అధిగమించింది.
యుఎస్‌డి టర్మ్‌లోన్లను విజయవంతంగా పూర్తి చేయడంపై వ్యాఖ్యానిస్తూ, ఆర్ ఇసి తన రుణాల ఖర్చును తగ్గించడానికి రుణాల మూలాలలను విస్తరింపచేయడానికి వివిధ వినూత్న ఎంపికల కోసం చురుకుగా అన్వేషిస్తోందని ఆర్ ఇసి లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వివేక్ కుమార్ దేవాంగన్ అన్నారు. ఈ రెండు లావాదేవీలను ఒకే నెలలో విజయవంతంగా ముగించడం అన్నది ఆర్ ఇసి లిమిటెడ్ బలమైన ఆర్ధిక స్థితికి నిదర్శనమే కాక, అంతర్జాతీయ రుణదాతలకు అకర్షణీయ గమ్యంగా కొనసాగడాన్ని పట్టి చూపుతుందన్నారు.ఒక నెలలో అతిపెద్ద నిధుల సమీకరణకు కారణమైన గిఫ్ట్ సిటీ ఐబియుల నుంచి సహా ఈ రుణాల పట్ల బ్యాంకుల అపూర్వ స్పందనతో తాము సంతోషంగా ఉన్నామన్నారు. ఇది ప్రస్తుత సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అతిపెద్ద పిఎస్‌యు రుణ గ్రహీతగా ఆర్ఇసి స్థానాన్ని బలపరుస్తుందని ఆయన తెలిపారు.
****
(Release ID: 1955222)
Visitor Counter : 128