ప్రధాన మంత్రి కార్యాలయం

జి20 ఇంధన శాఖ మంత్రుల సదస్సు జరిగిన సందర్భం లో వీడియో మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం పాఠం

Posted On: 22 JUL 2023 9:50AM by PIB Hyderabad

మహానుభావులారా, మహిళ లు మరియు సజ్జనులారా, నమస్కారం. మీ అందరినీ భారతదేశానికి నేను ఆహ్వానిస్తున్నాను. భవిష్యత్తు, స్థిరత్వం లేదా వృద్ధి, ఇంకా అభివృద్ధి ని గురించినటువంటి ఏ చర్చ అయినా ఇంధనం గురించిన ప్రస్తావన లేకుండా పూర్తి కానే కాజాలదు. ఇది వ్యక్తులు మొదలుకొని దేశాల వరకు అన్ని స్థాయిల లో అభివృద్ధి ని ప్రభావితం చేస్తుంది.

మిత్రులారా,

మనకు ఉన్న వేరు వేరు వాస్తవికతల కారణం గా ఇంధనం యొక్క మూలాల లో మార్పు ను తీసుకు రావడం కోసం మనం అనుసరించేటటువంటి మార్గాలు విభిన్నం గా ఉన్నాయి. ఏమైనప్పటికీ, మన లక్ష్యాలు ఒకే విధమైనవిగా ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. భారతదేశం గ్రీన్ గ్రోథ్ మరియు ఇంధన మూలాల లో పరివర్తన కోసం అలుపు ఎరుగని ప్రయాసల కు నడుంకట్టింది. భారతదేశం ప్రపంచం లో అత్యంత జన సాంద్రత కలిగినటువంటి దేశం, ఇంకా భారతదేశం ప్రపంచం లో అత్యంత వేగవంతం గా వృద్ధి చెందుతున్నటువంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఉన్నది. అయినప్పటికీ, మేం మా యొక్క జలవాయు పరివర్తన సమస్య ను ఎదుర్కొనే దిశ లో దృఢ నిశ్చయం తో ముందుకు కదులుతున్నాం. శీతోష్ణస్థితి సంబంధి కార్యాచరణ లో భారతదేశం నాయకత్వాన్ని చాటుతున్నది. మేం శిలాజేతర స్థాపిత విద్యుత్తు సామర్థ్యాన్ని తొమ్మిదేళ్ళ ముందుగానే సాధించాం. మేం మరింత ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఇప్పుడు నిర్దేశించుకొన్నాం. 2030 వ సంవత్సరాని కల్లా 50 శాతం శిలాజేతర స్థాపిత సామర్థ్యాన్ని అందుకోవాలి అనే ప్రణాళిక ను సిద్ధం చేశాం. సౌర విద్యుత్తు లో మరియు పవన విద్యుత్తు లో ప్రపంచం లో నాయకత్వ స్థానాల లో ఉన్న దేశాల లో ఒకటి గా భారతదేశం కూడా ఉంది. కార్యాచరణ సమూహం తాలూకు ప్రతినిధులు పావాగఢ్ సోలర్ పార్క్ మరియు మొఢేరా సోలర్ విలేజ్ లను సందర్శించినందుకు నాకు సంతోషం కలిగింది. వారు స్వచ్ఛమైన ఇంధనం విషయం లో భారతదేశం యొక్క నిబద్ధత మరియు తత్సబంధి విస్తృతి ఏ స్థాయి లో ఉన్నాయో గమనించారు.

మిత్రులారా,

భారతదేశం లో మేం గడచిన తొమ్మిది సంవత్సరాల లో 190 మిలియన్ కు పైగా కుటుంబాల ను ఎల్ పిజి తో కలిపాం. మేం ప్రతి ఒక్క పల్లె ను విద్యుత్తు సదుపాయం తో జత పరచే ఒక చరిత్రాత్మకమైన విజయాన్ని కూడా సాధించాం. మేం ప్రజల కు గొట్టపు మార్గాల ద్వారా వంట గ్యాసు ను సమకూర్చేందుకు కూడా కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా కొన్ని సంవత్సరాల లో 90 శాతాని కి పైగా జనాభా కు సేవల ను ఇవ్వగలుగుతాం. అందరి కోసం ఆటుపోటుల కు తట్టుకొని నిలబడగలిగేటటువంటి న్యాయబద్ధం అయినటువంటి మరియు దీర్ఘకాలికమైనటువంటి ఇంధనం లభించాలి అన్నదే మా ప్రయాస గా ఉంది.

మిత్రులారా,

చిన్న చర్య లు పెద్ద ఫలితాల ను అందిస్తాయి. 2015 వ సంవత్సరం లో ఎల్ఇడి లైట్స్ ను ఉపయోగించడం కోసం ఒక పథకాన్ని ప్రారంభించడం ద్వారా మేం ఒక చిన్న ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఇది ప్రపంచం లో అతి పెద్ద ఎల్ఇడి పంపిణీ కార్యక్రమం గా మారిపోయింది. దీని ద్వారా మాకు ఒక్కో సంవత్సరానికి 45 బిలియన్ కు పైగా యూనిట్ ల ఇంధనం ఆదా అవుతోంది. ప్రపంచం లోకెల్లా అత్యంత పెద్దదైన టువంటి వ్యవసాయ క్షేత్రాల లో సౌర విద్యుత్తు ద్వారా పనిచేసే నీటి పంపు ల కార్యక్రమాన్ని కూడా మేం ఆరంభించాం. భారతదేశం లో స్వదేశీ విద్యుత్తు వాహనాల బజారు 2030 వ సంవత్సరాని కల్లా ఏటా 10 మిలియన్ యూనిట్ ల అమ్మకాల స్థాయి కి చేరుకోగలదన్న అంచనా ఉంది. మేం ఈ సంవత్సరం లో 20 శాతం ఇథెనాల్ మిశ్రిత పెట్రోల్ పథకాన్ని ప్రవేశపెట్టాం. ఈ విధమైన సేవల ను 2025 వ సంవత్సరానికల్లా యావత్తు దేశం లో అందుబాటు లోకి తీసుకురావాలన్నదే మా యొక్క ధ్యేయం గా ఉంది. భారతదేశాన్ని కర్బన ఉద్గారాల కు తావు ఉండనటువంటి ఇంధన నిలయం గా చూడడం కోసం మేం ఒక ప్రత్యామ్నాయం గా గ్రీన్ హైడ్రోజన్ అంశం పై ఉద్యమం తరహా లో కృషి చేస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ మరియు తత్సంబంధి ఇతర ఉప ఉత్పాదనల ను తీసుకు రావడం, వాటిని ఉపయోగించడం మరియు ఎగుమతి చేయడానికి భారతదేశాన్ని ఒక గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలన్నది దీని ఉద్దేశ్యం గా ఉంది. మేం నేర్చుకొన్నటువంటి అంశాల ను ఇతరుల కు వెల్లడి చేస్తున్నందుకు ఆనందం గా ఉన్నాం.

మిత్రులారా,

దీర్ఘకాలికం అయినటువంటి, న్యాయపూర్ణమైనటువంటి, తక్కువ ఖర్చు తో కూడినటువంటి, అన్నివర్గాల కు స్థానం ఉండేటటువంటి మరియు స్వచ్ఛమైనటువంటి ఇంధనం మూలాల ను ముందుకు తీసుకుపోవడం కోసం ప్రపంచం ఈ సమూహం కేసి చూస్తున్నది. ఈ కార్యాన్ని పూర్తి చేసే క్రమం లో, అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌథ్ లోని మా సోదరీమణులు మరియు సోదరులు వెనుకపట్టున ఉండిపోకుండా చూడడమనేది ముఖ్యం. మనం అభివృద్ధి చెందుతున్న దేశాల కు తక్కువ ఖర్చు లో ఆర్థిక సహాయం అందేటందుకు పూచీ పడవలసి ఉంది. మనం సాంకేతిక విజ్ఞానం పరం గా ఉన్న అంతరాయాల ను భర్తీ చేసేందుకు, ఇంధన భద్రత ను ప్రోత్సహించేందుకు, మరియు సప్లయ్ చైన్స్ లో వివిధత్వాన్ని ప్రవేశపెట్టేందుకు అనువైన మార్గాల ను అన్వేషించి తీరాలి. మరి, మనం భవిష్యత్తు కాలం కోసం ఇంధనాలుఅనే అంశం లో సహకారాన్ని పటిష్ట పరచుకోవాలి. ఈ దిశ లో హైడ్రోజన్ సంబంధి ఉన్నత స్థాయి సిద్ధాంతాలుఒక సరి అయిన చర్య కాగలదు. ట్రాన్స్- నేశనల్ గ్రిడ్ ఇంటర్ కనెక్శన్స్ అనేవి ఇంధన భద్రత వృద్ధి చెందింప చేయగలుగుతాయి. మేం ఈ ప్రాంతం లో మా ఇరుగు పొరుగు దేశాల తో ఈ యొక్క పరస్పర లాభదాయకమైన సహకారాన్ని ప్రోత్సహిస్తున్నాం. మరి మేం ఉత్సాహజనక ఫలితాల ను గమనిస్తున్నాం అని మీకు నేను చెప్పగలను. ఒక దాని తో మరొకటి జతపడి ఉన్న గ్రీన్ గ్రిడ్స్ తాలూకు దృష్టికోణాన్ని సాకారం చేయడం పరివర్తనకారి కాగలదు. అది మన అందరి కి శీతోష్ణస్థితి సంబంధి గమ్యాల ను చేరుకోవడాని కి, గ్రీన్ ఇన్ వెస్ట్ మెంట్ ను ప్రోత్సహించడానికి మరియు లక్షలాది హరిత కొలువుల ను కల్పించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ తాలూకు ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్’’ అనే గ్రీన్ గ్రిడ్స్ ఇనిశియేటివ్ లో చేరండి అంటూ మీ అందరి కి నేను ఆహ్వానం పలుకుతున్నాను.

 

మిత్రులారా,

మీరు మీ పరిసర ప్రాంతాల ను జాగ్రత గా చూసుకోవడం అనేది సహజం గా జరగవచ్చును. అది సాంస్కృతిక పరం గా కూడాను సంభవం కావచ్చును. భారతదేశం లో, అది మా యొక్క సాంప్రదాయక జ్ఞానం లో ఒక భాగం గా ఉంది. మరి మిశన్ లైఫ్ (లైఫ్ స్ట‌యిల్ ఫార్ ఎన్ వైరన్ మంట్ .. ఎల్ఐఎఫ్ ఇ) కు ఇక్కడే శక్తి అందుతున్నది. పర్యవరణం కోసం ఒక జీవనశైలి మనలో ప్రతి ఒక్క సభ్యత్వ దేశాన్ని ఒక క్లయిమేట్ చాంపియన్ గా మార్చివేస్తుంది.

 

మిత్రులారా,

మనం ఎలాగ ఇంధన మూలాలలో మార్పు ను తీసుకువస్తుంటామనే విషయం లో ఎటువంటి అంతరం ఏర్పడిపోదు, మన ఆలోచన లు మరియు మన కార్యాలు మనకు ఉన్నటువంటి ‘‘ఒక భూ గ్రహాన్ని’’ కాపాడడం లో, మనకు ఉన్నటువంటి ‘‘ఒక కుటుంబం’’ తాలూకు ప్రయోజనాల ను పరిరక్షించడం లో, మరి ‘‘ఒక హరిత భవిష్యత్తు’’ అనే గమ్యస్థానానికేసి పయనించడం లో ఎల్లవేళ ల సాయపడి తీరాలి. మీ యొక్క చర్చోపచర్చలు ఫలించాలి అని నేను కోరుకొంటున్నాను. మీకు ధన్యవాదాలు.

నమస్కారం.

 

***

 

 



(Release ID: 1955027) Visitor Counter : 95