పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పంచాయతీరాజ్ వ్యవస్థ -అవలోకనం, అవకాశాలు అనే అంశంపై హైదరాబాద్ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయితీ రాజ్‌ ( (ఎన్ఐఆర్డీ-పిఆర్)లో ప్రారంభమైన రెండు రోజుల వర్క్‌షాప్

Posted On: 04 SEP 2023 6:00PM by PIB Hyderabad

పంచాయతీరాజ్ వ్యవస్థ -అవలోకనం, అవకాశాలు అనే అంశంపై హైదరాబాద్  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయితీ రాజ్‌ (NIRDPR)లో  రెండు రోజుల వర్క్‌షాప్ 2023 సెప్టెంబర్ 4న ప్రారంభమయ్యింది. (ఎన్ఐఆర్డీ-పిఆర్) వికాస్ ఆడిటోరియం లో కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సవాళ్ల పరిష్కారానికి అమలు చేయాల్సిన చర్యలను వర్క్‌షాప్ లో చర్చించి, పంచాయతీలను "మార్పు రూపకర్తలు" లేదా "మార్పుల ఏజెంట్లు"గా రూపొందించడానికి అనుసరించాల్సిన ప్రణాళికను సిద్ధం చేస్తారు. 

సమావేశంలో ప్రసంగించిన పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్ దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ అభివృద్ధిలో పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వ్యక్తిగత శ్రద్ధ కనబరిచి పంచాయతీల అభివృద్ధికి కృషి జరగాలని సూచించారు. దీనివల్ల పంచాయతీ రాజ్ వ్యవస్థ సమానంగా లేదా ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా అభివృద్ధి సాధిస్తుందన్నారు.  అభివృద్ధి ప్రణాళికలు, పంచాయతీ అభివృద్ధి సూచిక, స్థానికీకరణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించిన అంశాలకు  పంచాయతీలు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పంచాయతీరాజ్ సంస్థల కోసం గుర్తించిన తొమ్మిది రంగాలలో ప్రపంచ లక్ష్యాలు సాధించే దిశగా వేగంగా కృషి జరగాల్సి ఉంటుందని  శ్రీ సునీల్ కుమార్  అన్నారు. 

 

 

స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల (ఎల్‌ఎస్‌డిజి) స్థానికీకరణ ప్రక్రియలో కేంద్ర మంత్రిత్వ శాఖలు / శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నీతి ఆయోగ్, పంచాయతీ రాజ్ సంస్థలు (పిఆర్‌ఐలు) సహకారంతో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు అమలు చేస్తుందని శ్రీ సునీల్ కుమార్ తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి 9 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు.  వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని పంచాయతీ అభివృద్ధి సూచిక  (పిడిఐ)ని రూపొందించామని ఆయన వివరించారు.ఎల్‌ఎస్‌డిజిలక్ష్య సాధనలో సాధించిన పురోగతి  పిడిఐ ద్వారా తెలుస్తుందన్నారు. 

2030 నాటికి ఎస్‌డిజి లక్ష్యాలు చేరుకోవాలని దేశం లక్ష్యంగా నిర్ణయించుకుందని శ్రీ సునీల్ కుమార్ తెలిపారు. పంచాయతీ స్థాయిలో సాధించిన అభివృద్ధి నివేదిక (పిడిఐ) ఆధారంగా లక్ష్య సాధనలో సాధించిన పురోగతి, సాధించాల్సి ఉన్న లక్ష్యాలపై  మంత్రిత్వ శాఖ / విభాగాలు అవగాహనకు వచ్చి ప్రణాళిక రూపొందిస్తాయని ఆయన వివరించారు.ఎల్‌ఎస్‌డిజి ల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలు, పథకాలు లక్ష్యాల మేరకు అమలు జరిగేలా చూసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. 

లక్ష్యాల సాధనకు సమిష్టి కృషి జరగాలని శ్రీ సునీల్ కుమార్ సూచించారు. రాష్ట్ర స్థాయి మంత్రిత్వ శాఖలు, పంచాయతీరాజ్ సంస్థలు, సంబంధిత వర్గాల సమిష్టిగా పని చేసినప్పుడు మాత్రమే పంచాయతీ అభివృద్ధి సూచిక ద్వారా సాధించిన ప్రగతిని మదింపు వేయడానికి వీలవుతుందని శ్రీ సునీల్ కుమార్ వివరించారు. 

 గ్రామపంచాయతీ ఆకాంక్షను పరిష్కరించడానికి సమగ్ర, అధిక నాణ్యత గల గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) తయారీలో గ్రామీణ స్థానిక సంస్థలు, సాంప్రదాయ స్థానిక సంస్థల పనితీరు మార్పు కీలకంగా ఉంటుందని  శ్రీ సునీల్ కుమార్ అన్నారు.

పంచాయతీలకు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న గ్రాంట్‌లపై  పంచాయతీలకు ఇప్పుడు అవగాహన ఉందని పేర్కొన్న శ్రీ సునీల్ కుమార్  ప్రాధాన్య కార్యకలాపాలను గుర్తించి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించడానికి కృషి చేయాలని సూచించారు.నీరు, ఆరోగ్యం, పారిశుధ్యం అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రధాన కార్యక్రమాలు, పథకాలు అమలు చేయాలని అన్నారు. టీబీ రహిత గ్రామ పంచాయతీల  అభివృద్ధి కోసం అమలు జరుగుతున్న కార్యక్రమంలో పంచాయితీలు కీలకపాత్ర పోషించాలని ఆయన సూచించారు.గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికతో కలిపి  గ్రామ పేదరిక నిర్మూలన ప్రణాళిక అమలు చేయడానికి చర్యలు అమలు జరగాలని శ్రీ సునీల్ కుమార్ సూచించారు. స్వయం సహాయక బృందాల సహకారాన్ని పధకాల అమలులో తీసుకోవాలని ఆయన సూచించారు. 

 

 

అర్థవంతమైన, జవాబుదారీగా గ్రామసభల నిర్వహణకు, నిధుల సక్రమ వినియోగం, పంచాయితీల స్వంత మూల ఆదాయాలను పెంచడం, ఆవిష్కరణలు ,సాంకేతిక వినియోగం, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ అంతరాలు  తగ్గించడం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని  శ్రీ సునీల్ కుమార్ సూచించారు.  పంచాయతీ రాజ్ సంస్థల పరిధిలో అమలు జరుగుతున్న అన్ని కార్యక్రమాలు, పథకాల ద్వారా సమకూరుతున్న నిధులు ఖర్చు చేసే అంశంలో   పంచాయితీ - మహిళా స్వయం సహాయక బృందాల సహకారం తీసుకుని  మహిళా సాధికారత , ఆదాయ ఉత్పాదక కార్యకలాపాలలో మహిళల ప్రమేయం ఉండేలా చేసేందుకు చర్యలు అమలు జరగాలని ఆయన సూచించారు.

 

 

 ప్రజాస్వామ్యం వ్యవస్థలో  అట్టడుగు స్థాయిలో   గ్రామ పంచాయతీలు  అన్ని కార్యకలాపాలకు కేంద్ర బిందువులు అని  శ్రీ సునీల్ కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా 31.00 లక్షల మంది పంచాయతీలకు ఎన్నికైన ప్రతినిధులు ఉన్నారు, ఇందులో దాదాపు 46% మహిళలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన పరివర్తన మార్పులు తీసుకు రాగలరు అని ఆయన అన్నారు. . గ్రామీణ భారతదేశం  పరివర్తన కోసం ప్రధాన పధకాలను పటిష్టంగా  సమర్ధవంతంగా అమలు చేయడంలో పంచాయతీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. 

 

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయితీ రాజ్‌  డైరెక్టర్ జనరల్ డాక్టర్. జి. నరేంద్ర కుమార్, అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్ర శేఖర్ కుమార్ సమక్షంలో వర్క్‌షాప్ మొదటి రోజు కార్యక్రమాలు  శ్రీ సునీల్ కుమార్ అధ్యక్షతన ప్రారంభమయ్యాయి.  పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి  శ్రీ వికాస్ ఆనంద్, , పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ  సంయుక్త కార్యదర్శి   శ్రీమతి. మమతా వర్మ, పురాతన కాలంలోభారత దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ లోకీలక పాత్ర పోషించిన ప్రముకులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.  కేంద్ర  గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్. S. మీనాక్షిసుందరం,  పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి డా. మనబేంద్ర నాథ్ రాయ్, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి,డాక్టర్  విజయానంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.   

కార్యక్రమంలో భాగంగా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు (2024 - 2025) తయారీ కోసం పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ (PPC) 2023 ప్రారంభించారు. పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ప్రాజెక్ట్ ఆధారిత బ్లాక్ పంచాయతీ మరియు జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై నివేదిక సిద్ధం చేసింది.  ఈ సందర్భంగా పంచాయతీ అభివృద్ధి సూచిక,జాతీయ శిక్షణా మాడ్యూల్‌ను విడుదల చేశారు. 73వ రాజ్యాంగ సవరణకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయితీ రాజ్‌ రూపొందించిన   జర్నల్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్  ప్రత్యేక సంచిక ఆవిష్కరించారు.  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయితీ రాజ్‌  లో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పంచాయతీరాజ్ (SoEPR)పై ముద్రించిన బ్రోచర్‌ను విడుదల చేశారు.

పంచాయితీ రాజ్‌లో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ (SoEPR) వివరాలను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయితీ రాజ్‌   డైరెక్టర్ జనరల్ డాక్టర్ జీ.  నరేంద్ర కుమార్ వివరించారు. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్   ఏర్పాటు చేయడం వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.   పంచాయితీలపై అవగాహన పెంపొందించి , ప్రజలకు సేవలను మరింత ప్రభావవంతంగా అందించగల సామర్ధ్యాలను స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సమకూరుస్తుందని ఆయన తెలిపారు. పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సహకారంతో  పంచాయతీరాజ్ వ్యవస్థ లోని వివిధ రంగాలను   పరిశోధించడానికి, పటిష్ట సమాచార వ్యవస్థను అభివృద్ధి చేయడానికి  ప్రస్తుతం ఉన్న 21 కేంద్రాలకు అదనంగా తొమ్మిది కొత్త కేంద్రాలతో పంచాయితీ రాజ్ (SoEPR)లో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. 

 

 

జాతీయ వర్క్‌షాప్ లక్ష్యాలను పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్ర శేఖర్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రజల ఆకాంక్షలు, అంచనాలు పెరుగుతున్నాయని తెలిపిన డాక్టర్ చంద్రశేఖర్  పంచాయతీలు గ్రామీణ పరివర్తనకు మార్గంగా ఉపయోగపడుతున్నాయని అన్నారు.  గ్రామీణ పరివర్తనకు చోదకులుగా ఎదగడానికి పంచాయతీలు సన్నద్ధం కావాలన్నారు. . పంచాయతీలలో ప్రధాన ప్రాంతాల్లో సరికొత్త 'ఎకో-సిస్టమ్' విధానంతో సామర్థ్య పెంపుదలను ఊహించడం అత్యవసరమని మరియు గ్రామ సమగ్ర, సమగ్ర మరియు స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి మారుతున్న పాలనా యంత్రాంగం అవసరాన్ని ఆయన వివరించారు. పంచాయతీ రాజ్‌ మంత్రిత్వ శాఖ 2023 సెప్టెంబరు 4 నుండి 5 వరకు ఈ రెండు రోజుల జాతీయ వాటాదారుల సలహా వర్క్‌షాప్‌ని నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. పంచాయితీలను మార్పు చేసేవారుగా ఎనేబుల్ చేయడానికి ముందుకు వెళ్లే మార్గాన్ని ఉద్దేశించి డాక్టర్ చంద్ర శేఖర్ కుమార్ తెలిపారు. పంచాయతీల ప్రస్తుత, ఉద్భవిస్తున్న సమస్యల జాబితా నుండి గుర్తించబడిన ఆరు అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి అని  ఆయన తెలిపారు. 

 

 

 పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్-2023  రోడ్ ఎహెడ్ గురించి  పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ వికాస్ ఆనంద్ వివరించారు.    పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ మంత్రం సబ్‌కి యోజన సబ్‌కా వికాస్ అని, పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (PDP) చొరవతో బావిని రూపొందించాలని సూచించారు.  గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP),ప్రాజెక్ట్-ఆధారిత బ్లాక్ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (BPDP) ,జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (DPDP) ల ద్వారా  దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో గుణాత్మక పరివర్తన, స్థిరమైన అభివృద్ధికి లక్ష్యాల సాధన కోసం కృషి జరుగుతుందన్నారు. 

జాతీయ వర్క్‌షాప్‌లో  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయితీ రాజ్‌   అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అంజన్ కుమార్ భంజా స్వాగత ప్రసంగం చేశారు. ప్రారంభ కార్యక్రమం  తర్వాత ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చలు ప్రారంభించారు. . పంచాయతీ రాజ్ వ్యవస్థ  సమర్థవంతమైన పనితీరుకు సంబంధించిన 21 సమస్యలు చర్చించడానికి  6 గ్రూపులు, 21 సబ్-గ్రూప్‌లు ఏర్పాటు అయ్యాయి. 

దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన   పంచాయతీ రాజ్ శాఖల కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు  డైరెక్టర్లు, జిల్లా పంచాయతీల అధ్యక్షులు,సీఈవోలు , బ్లాక్ పంచాయతీ అధ్యక్షులు  కార్యదర్శులు, గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థల అధికారులు వర్క్‌షాప్‌లో పాల్గొంటున్నారు.

పంచాయితీ రాజ్ రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల  ప్రతినిధులు,  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయితీ రాజ్‌  , SIRD&PRలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (IIPA), పంచాయితీ రాజ్ శిక్షణ సంస్థలు, ఐక్యరాజ్య సమితి సంష్తలు,  CBOలు, NGOల సభ్యులు నేషనల్ స్టేక్‌హోల్డర్‌లో సమావేశంలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ,కార్యనిర్వాహకులు, కీలకమైన వాటాదారులు,  నిపుణులు, అట్టడుగు స్థాయిలో పంచాయతీరాజ్ రంగంలో పని చేస్తున్న సంస్థలు ఈ జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొంటున్నారు. పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ శ్రీ రమిత్ మౌర్య, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న ఆఫీసర్ ట్రైనీలు శ్రీ ఓం ప్రకాష్ గుప్తా, శ్రీమతి పల్లవి వర్మ, శ్రీ శుభాంకర్ బాలా కూడా రెండు రోజుల సమావేశాల్లో పాల్గొంటారు. 

మేధోమథన వర్క్‌షాప్‌లో (i) పంచాయతీ ఎన్నికలు, (ii) గ్రామసభ స్టాండింగ్ కమిటీలు- వాటి సాధికారత, (iii) పంచాయతీల పనితీరు, (iv) పంచాయతీ ఆర్థిక అంశాలు, స్వంత ఆదాయ వనరులు  (v) నాయకత్వ పాత్ర ఎన్నికైన మహిళా ప్రతినిధుల (vi) సాక్ష్యం-ఆధారిత ప్రణాళిక రూపకల్పన అంశాలపై చర్చలు నిర్వహిస్తారు. సాధికార పంచాయతీలు, సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర/రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత స్థాయి ప్రణాళిక , జిల్లా, బ్లాక్ , గ్రామ పంచాయతీ స్థాయిలో వివిధ సంబంధిత వర్గాల  మధ్య మెరుగైన ప్రణాళిక, సమన్వయం , సమన్వయం కి  సంబంధించిన వినూత్న విధానాలపై  చర్చలు జరిగే అవకాశం ఉంది. 

జాతీయ వర్క్‌షాప్‌లో మొదటి రోజు పంచాయతీ ప్రతినిధులు చురుగ్గా, ఉత్సాహంగా పాల్గొన్నారు. నేషనల్ స్టేక్‌హోల్డర్ కన్సల్టేటివ్ వర్క్‌షాప్ 5 సెప్టెంబర్ 2023న గుర్తించబడిన ప్రతి ఇతివృత్తం పై చర్చలు,  , పంచాయితీల సామర్థ్యాలు పెంపొందించడానికి ఆలోచనలు, సూచనలు స్వీకరిస్తారు.  బహిరంగ సభతో వర్క్‌షాప్ ముగుస్తుంది. 

 

 

దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుందని ప్రతినిధులు తెలిపారు. పంచాయతీ సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక రూపకల్పంలో కూడా ఈ వర్క్ షాప్ లో జరిగే చర్చలు ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.

పంచాయితీల పని తీరుపై జరిగిన చర్చలో పాల్గొన్న నిపుణులు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు అర్హులైన ప్రజలందరికీ చేరేలా సమర్ధంగా,పటిష్టంగా అమలు జరిగేలా చూసేందుకు పంచాయతీలు ప్రణాళిక రూపొందించి స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని నిపుణులు సూచించారు. లక్ష్యాల సాధన కోసం అవసరమైన మానవ వనరులను అభివృద్ధి చేయడానికి ఇటువంటి వర్క్ షాప్ లు ఉపయోగపడతాయని నిపుణులు తెలిపారు.

 

****


(Release ID: 1954772) Visitor Counter : 305


Read this release in: English , Urdu , Hindi