రక్షణ మంత్రిత్వ శాఖ
భారత నావికాదళం కేంద్రాలను సందర్శించిన యుఏఈ నేవీ ఎస్.ఎం.ఈ. ప్రతినిధి బృందం
- విజయవంతంగా ముగిసన సందర్శన.. ఫలప్రదమైన చర్చలు
Posted On:
02 SEP 2023 2:32PM by PIB Hyderabad
భారత నావికాదళం కేంద్రాలను సందర్శించిన యుఏఈ నేవీ ఎస్.ఎం.ఈ ప్రతినిధి బృందం సందర్శించింది. కల్నల్ డాక్టర్ అలీ సైఫ్ అలీ మెహ్రాజీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల యుఏఈ నేవీ సబ్జెక్ట్ మేటర్ (ఎస్ఎంఈ) ప్రతినిధి బృందం 01 సెప్టెంబర్ 23న ప్రత్యేక వాతావరణ శాస్త్రం, సముద్ర శాస్త్రం, శిక్షణ మరియు వాతావరణ మోడలింగ్ కేంద్రంలో సందర్శించింది. ఈ బృందం నాలుగు రోజుల పర్యటన సందర్భంగా ఇండియన్ నేవీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. 01 సెప్టెంబర్ 23న న్యూ ఢిల్లీలోని రక్షణ శాఖ (నేవీ) ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్ (ఐ.హెచ్.క్యు)లో జరిగిన ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇది అధికారుల సందర్శనలో కీలకమైన ముఖ్యాంశం. ఈ సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు వాటి ఫలితాల పట్ల రెండు నౌకాదళాలు తమ సంతృప్తిని వ్యక్తం చేశాయి. వాతావరణ శాస్త్రం మరియు సముద్ర శాస్త్ర రంగాలలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి అంగీకరించాయి. రెండు నౌకాదళాల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఫలవంతమైన చర్చలు జరిగేలా వ్యవస్థను సులభతరం చేసి, సాదర స్వాగతం పలికిన భారత నావికాదళానికి ఆతిథ్య ప్రతినిధి బృందం అధిపతి కల్నల్ డాక్టర్ అలీ సైఫ్ అలీ మెహ్రాజీ కృతజ్ఞతలు తెలిపారు. భారత నావికాదళం ద్వారా అభివృద్ధి చేయబడిన అత్యాధునిక సాంకేతికతలు, పద్ధతులు మరియు పరిశోధనా కార్యక్రమాలకు సాక్ష్యమివ్వడం, సహచరులతో నిమగ్నమవ్వడం ద్వారా పొందిన అంతర్దృష్టులకు యు.ఎ.ఈ.లకు నావికాదళం అత్యంత విలువైనది. ఈ కొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి, ఉమ్మడి పరిశోధన మరియు సహకారం కోసం అవకాశాలను అన్వేషించడానికి ప్రతినిధి బృందం ఎదురుచూస్తోంది. న్యూఢిల్లీలోని ఐ.హెచ్.క్యూ ఎంఓడీ (నేవీ) పర్యటనలో భాగంగా, కల్నల్ డాక్టర్ అలీ సైఫ్ అలీ మెహ్రాజీ రియర్ అడ్మిరల్ నిర్భయ్ బాప్నా, ఏసీఎన్ఎస్ (ఎఫ్సీఐ)ని కూడా కలిశారు. వాతావరణ నమూనాలు, సముద్ర పరిస్థితులు మరియు వాతావరణ మార్పులతోపాటు నౌకాదళ కార్యకలాపాలపై ప్రభావం చూపే ఇతర సంబంధిత రంగాల వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పేలా చర్చలు జరిగాయి. అందరికీ ఉజ్వలమైన మరియు సుస్థిరమైన భవిష్యత్తును సృష్టించేందుకు రెండు దేశాల నిబద్ధత మరియు అంకితభావానికి ఈ సందర్శన నిదర్శనం.
***
(Release ID: 1954490)
Visitor Counter : 150