సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
బంగ్లాదేశ్ పౌర సేవకులకు చెందిన 67వ & 68వ బ్యాచ్‌ల శిక్షణను పూర్తి చేసిన ఎన్‌సిజిజి ; ఇప్పటివరకు బంగ్లాదేశ్ నుండి 2,469 మంది అధికారులు ఎన్‌సిజిజిలో శిక్షణ పొందారు.
సాధికారత, జవాబుదారీతనం మరియు పబ్లిక్ సర్వీస్ డెలివరీ కోసం సాంకేతికతను ఉపయోగించాలని కోరిన డిఏఆర్‌పిజి&డీజి, ఎన్‌సిజిజి సెక్రటరీ శ్రీ వి శ్రీనివాస్
Posted On:
02 SEP 2023 11:56AM by PIB Hyderabad
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) భాగస్వామ్యంతో నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సిజిజి) ద్వారా బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్లకు 2-వారాల 67వ & 68వ బ్యాచ్‌ల సామర్థ్య నిర్మాణ కార్యక్రమం (సిబిపి) 1 సెప్టెంబర్ 2023న ముగిసింది. 1,500 మంది పౌర సేవకులకు సిబిపి మొదటి దశను పూర్తి చేయడంతో ఎన్‌సిజిజి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో 2025 నాటికి అదనంగా 1,800 మంది పౌర సేవకుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఎన్‌సిజిజి ఇప్పటికే బంగ్లాదేశ్‌లోని 855 మంది అధికారులకు శిక్షణను అందించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఓ) నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సిజిజి)ని 'దృష్టిలో ఉన్న సంస్థ'గా గుర్తించింది. ఫలితంగా ఎన్‌సిజిజి విస్తరిస్తోంది మరియు దాని కార్యకలాపాలను గణనీయంగా పెంచుతోంది.
వాల్డిక్టరీ సెషన్‌కు భారత ప్రభుత్వ డిఏఆర్‌పిజి&డీజి, ఎన్‌సిజిజి సెక్రటరీ శ్రీ వి.శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. శ్రీ వి శ్రీనివాస్ తన ప్రసంగంలో.. ప్రజల అవసరాలకు అధికారులు స్పందించాలని మరియు ప్రజా ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించడం ముఖ్యమైన ప్రాముఖ్యత అని నొక్కి చెప్పారు. రెండు దేశాల మధ్య అభివృద్ధి భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు. మరియు ఈ కార్యక్రమం కొత్త అభివృద్ధి నమూనా మరియు ఇతర విషయాలతో పాటు చొరవలకు శక్తివంతం చేసే ప్రయత్నం అని పేర్కొన్నారు.
ఈ 2 వారాల సామర్థ్యం పెంపొందించే కార్యక్రమం నుండి కొత్త ఆలోచనలు మరియు ఉత్తమ అభ్యాసాల రూపంలో నేర్చుకున్న వాటిని తీసుకువెళ్లాలని మరియు సమాజానికి మేలు చేసేందుకు కోసం వాటిని ఒక టెంప్లేట్‌గా ఉపయోగించాలని ఆయన వారికి సూచించారు. బంగ్లాదేశ్ అధికారులు ప్రోగ్రామ్ రూపకల్పన మరియు అధిక అర్హత కలిగిన డొమైన్ నిపుణులు మరియు రిసోర్స్ పర్సన్‌లుగా వచ్చిన ప్రముఖ వ్యక్తులతో వినడానికి మరియు చర్చించే అవకాశాన్ని అభినందించారు. ఇప్పటివరకు ఎంఈఏ మద్దతుతో మరియు ఢాకాలోని ఇండియన్ మిషన్‌తో సన్నిహిత సహకారంతో ఎన్‌సిజిజి బంగ్లాదేశ్‌లోని 2469 మంది పౌర సేవకులకు శిక్షణ ఇచ్చింది.
కోర్సు సమన్వయకర్త డాక్టర్ ఎ.పి. సింగ్ తన ప్రసంగంలో రెండు ప్రోగ్రామ్‌లలో కవర్ చేయబడిన అంశాల వైవిధ్యాన్ని హైలైట్ చేశారు. ఈ కార్యక్రమాలలో పాలన, డిజిటల్ పరివర్తన, అభివృద్ధి పథకాలు మరియు స్థిరమైన అభ్యాసాలపై వివిధ అంశాలు ఉన్నాయి. కవర్ చేయబడిన అంశాలలో మారుతున్న పాలన, విపత్తు నిర్వహణ, ఆల్ ఇండియా సర్వీసెస్ అవలోకనం, నాయకత్వం మరియు కమ్యూనికేషన్, ఇ-గవర్నెన్స్, డిజిటల్ ఇండియా, ఉమాంగ్, ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (జిఇఎం), సమర్థవంతమైన పబ్లిక్ సర్వీస్ డెలివరీ, విజిలెన్స్ అడ్మినిస్ట్రేషన్, అవినీతి నిరోధక వ్యూహాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్‌లో డిజిటల్ గవర్నెన్స్, ముద్రా యోజన వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారికి ఎక్స్‌పోజర్ సందర్శనలలో పాల్గొనడానికి విలువైన అవకాశం ఉందని, ఇది వారి మొత్తం అభ్యాస ప్రయాణాన్ని పెంపొందించిందని ఆయన హైలైట్ చేశారు. ప్రణాళికాబద్ధమైన పర్యటనలలో హరిద్వార్‌లోని జిల్లా యంత్రాంగం, నెట్ జీరో ప్రాజెక్ట్ మరియు ప్రధానమంత్రి సంగ్రహాలయ మొదలైనవి ఉన్నాయి. అలాగే తాజ్ మహల్‌ను కూడా సందర్శించారు.
ఎంఈఏ భాగస్వామ్యంతో ఎన్‌సిజిజి 15 దేశాల పౌర సేవకులకు శిక్షణ ఇచ్చింది. బంగ్లాదేశ్, కెన్యా, టాంజానియా, ట్యునీషియా, సీషెల్స్, గాంబియా, మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, లావోస్, వియత్నాం, నేపాల్ భూటాన్, మయన్మార్ మరియు కంబోడియా దేశాలు అందులో ఉన్నాయి. పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించి, విస్తరిస్తున్న దేశాల జాబితా నుండి ఎక్కువ సంఖ్యలో పౌర సేవకులకు వసతి కల్పించడానికి ఎన్‌సిజిజి తన సామర్థ్యాన్ని ముందుగానే విస్తరిస్తోంది. ఈ విస్తరణ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం మరియు ఎన్‌సిజిజి అందించే నైపుణ్యం మరియు వనరుల నుండి మరిన్ని దేశాలు ప్రయోజనం పొందగలవని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.
మొత్తం కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌కు కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్. ఎ. పి. సింగ్ వ్యవహరించారు. అలాగే కో-కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్. ముఖేష్ భండారి, ప్రోగ్రామ్ అసిస్టెంట్ శ్రీ సంజయ్ దత్ పంత్ ఎన్‌సిజిజి కెపాసిటీ బిల్డింగ్ టీమ్ పర్యవేక్షించారు.
*****
(Release ID: 1954488)
Visitor Counter : 111