సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
మహిళా హస్తకళాకారులు కే వీ ఐ సీ ఛైర్మన్ తో కలిసి రక్షా బంధన్‌ను జరుపుకున్నారు
Posted On:
31 AUG 2023 8:00PM by PIB Hyderabad
రక్షా బంధన్ పర్వదిన సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హస్తకళాకారుల సోదరీమణులు న్యూఢిల్లీలోని ఖాదీ భవన్‌కు తరలివచ్చి ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) గౌరవాధ్యక్షుడు శ్రీ మనోజ్ కుమార్ కు ఖాదీ రాఖీ కట్టారు.
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఆగస్ట్ 7, 2023న జరిగిన 'జాతీయ చేనేత దినోత్సవం' కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రాబోయే ఉత్సవాల కోసం ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా భారతదేశంలోని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ కళాకారులకు ఉత్తమ ఉపాధి అవకాశాలు ద్వారా మద్దతు ఇవ్వాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు.
మహిళా అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే 'ఆత్మనిర్భర్ భారత్' ప్రచారానికి దిశానిర్దేశం చేస్తూ, ఖాదీ రాఖీలను తయారు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళా హస్త కళాకారులను ప్రధాని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్నారు. 'ఖాదీ రాఖీ' కోసం చరఖాపై దారాలను సునిశితంగా తిప్పుతూ ఖాదీ రాఖీ ని రూపొందించడానికి అవిశ్రాంతంగా శ్రమించే గ్రామీణ భారతీయ స్పిన్నర్ల పట్టుదలప్రత్యేకత ఇందులో ఉందని శ్రీ మనోజ్ కుమార్ పునరుద్ఘాటించారు. ఈ ఉత్పత్తి పూర్తిగా సహజమైనది, సింథటిక్ ఉత్పత్తులు ఇందులో లేవు.
న్యూఢిల్లీలోని ఖాదీ భవన్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తయారు చేయబడిన ఇటువంటి ఖాదీ రాఖీలు తగినంత పరిమాణంలో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, వాటి ధరలు ఒక్కొక్కటి 20 నుండి 250 రూపాయల వరకు ఉన్నాయి.
ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మద్దతుగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 'ఆత్మనిర్భర్ భారత్' ప్రచారాన్ని విజయవంతం చేయడానికి తన వంతు సహాయం అందజేస్తోందని ఆయన పేర్కొన్నారు. కమిషన్ పీ ఎం ఈ జీ పి వంటి ప్రధాన పథకాల కింద ఆమోదించబడిన లోన్ మొత్తంలో 35% వరకు గ్రాంట్‌లను అందిస్తోంది. ఖాదీ పరిశ్రమ కార్యకలాపాలలో పాల్గొంటున్న శ్రామికశక్తిలో 80% మహిళలు. మహిళల్లో పేదరికం, నిరక్షరాస్యత మరియు అనారోగ్య నిర్మూలనకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ నైపుణ్యాభివృద్ధి మరియు స్వావలంబన ద్వారా వారి సామర్థ్యం పూర్తిగా సాకారం కావాలని ఆయన ఆకాంక్షించారు.
****
(Release ID: 1953980)
Visitor Counter : 137