ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

భారతదేశం స్మార్ట్‌ఫోన్‌ల తయారీ లో విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు ఐటీ హార్డ్‌వేర్ తయారీ మరియు ఎగుమతులను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది: ఎం ఓ ఎస్ రాజీవ్ చంద్రశేఖర్


భారతదేశం ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ తయారీకి విశ్వసనీయ కేంద్రంగా ఉంది, ప్రధాని మోదీ దూరదృష్టితో కూడిన పీ ఎల్ ఐ విధానాలకు ధన్యవాదాలు: ఎం ఓ ఎస్ రాజీవ్ చంద్రశేఖర్

2014కు ముందు దాదాపు శూన్యం గా వున్న ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమను 300 బిలియన్ డాలర్ల పరిశ్రమ గా చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం: మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలు మరియు భారతీయ విజేతలు ఐ టీ హార్డ్‌వేర్ కోసం పీ ఎల్ ఐ 2.0 కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

Posted On: 31 AUG 2023 7:11PM by PIB Hyderabad

కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు ఎలక్ట్రానిక్స్ & ఐటి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్, " భారతదేశంలో పెద్ద ఐటి కంపెనీలు తమ ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమయ్యాయని అన్నారు. పీ ఎల్ ఐ 2.0 పథకం కింద దాదాపు 40 దరఖాస్తులు వచ్చాయి, ఇందులో ప్రపంచ అగ్రశ్రేణి ఐ టీ కంపెనీలు మరియు దేశీయ విజేతలు వున్నారు" అని ఈ రోజు మీడియా ప్రతినిధులతో అన్నారు.

 

"డెల్, హెచ్ పీ, అసుస్  మరియు ఎసర్ వంటి ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐ టీ కంపెనీలు  పీ ఎల్ ఐ 2.0 స్కీమ్ కోసం దరఖాస్తు చేయడం శుభ వార్త. ఇది భారతదేశంలో కంప్యూటర్ల తయారీపై ఉన్న ఆసక్తిని  తెలియజేస్తుంది.  స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశం భారతదేశం ఎలా ఎదుగుతోందో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ల్యాప్‌టాప్‌లు, సర్వర్లు మరియు టాబ్లెట్‌ల వంటి ఐ టీ హార్డ్‌వేర్‌లో మేము ఉన్నత స్థితిని సాధించాలనుకుంటున్నాము. పీ ఎల్ ఐ పథకం ఈ మిషన్‌లో భాగం. ఈ పథకం అమలు చేయడం మాకు సంతోషంగా ఉంది. పరిశ్రమ నుండి మంచి ఆదరణ లభించింది. పెద్ద ఐటి కంపెనీలు తమ ఉత్పత్తులను భారతదేశంలో తయారు చేసి ఇక్కడి నుండి ఎగుమతి చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఉద్యోగాలు మరియు పెట్టుబడులకు అవకాశాలను సృష్టిస్తుంది ” అని మంత్రి ఆకాక్షించారు.

 

డెల్ మరియు హెచ్‌పి వంటి ప్రధాన ఐటి కంపెనీలు నేరుగా ఈ పథకం కింద పాల్గొంటుండగా,   హెచ్‌పిఇ, లెనోవో, ఏసర్, ఆసుస్ , థామ్సన్ కంపెనీలు  భారతదేశంలో తయారీ సౌకర్యాలు ఉన్న ఈ ఎం ఎస్ కంపెనీల ద్వారా పాల్గొంటున్నారు. ప్యాడ్జెట్ (డిక్సన్), వీ వీ డి ఎన్, నెట్ వెబ్, సిర్మ, ఒపైముస్, సహస్ర, నియో లింక్, పనచే, సోజో ( లావా) వంటి దేశీయ కంపెనీలు దీనికి మరింత మద్దతు ఇస్తున్నాయి.

 

ఈ సంవత్సరం ఆరంభంలో మంత్రి అనేక డిజిటల్ ఇండియా కింద నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు వంటి టెక్ పరిశ్రమ వాటాదారులతో కలిసి పనిచేశారు. భారతదేశంలోని ఐ టీ హార్డ్‌వేర్ తయారీ పర్యావరణ వ్యవస్థను ఉత్ప్రేరకపరచడానికి వారి సమస్యలను ఆయన సత్వరం పరిష్కరించారు.

 

“ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఐ టీ హార్డ్‌వేర్ తయారీ పర్యావరణ వ్యవస్థ కల్పన కోసం ప్రభుత్వం స్టార్టప్‌లు, పరిశ్రమలు మరియు విద్యాసంస్థలతో సన్నిహితంగా సహకరించింది. 2014కి ముందు దాదాపు శూన్యంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ను , 2026 నాటికి $300 బిలియన్ల  మరియు $1 ట్రిలియన్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ గా ప్రగతి సాధించడం మా లక్ష్యం. పరిశ్రమ సూచనలతో రూపొందించిన  ఐ టీ హార్డ్‌వేర్  పీ ఎల్ ఐ 2.0 పథకం భారతదేశానికి ముఖ్యమైన లక్ష్యం. నేడు, భారతదేశం ఎలక్ట్రానిక్స్‌లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల మార్కెట్‌లలో ఒకటి. ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం మరియు ప్రజా సేవలలో వేగవంతమైన డిజిటలైజేషన్‌కు ధన్యవాదాలు, ”అని మంత్రి తెలిపారు. మేలో, ప్రభుత్వం ఐ టీ హార్డ్‌వేర్ కోసం పీ ఎల్ ఐ 2.0 పథకాన్ని మంజూరు చేసింది, దీనికోసం 2021 పథకం కంటే రెట్టింపు బడ్జెట్‌తో రూ. 17,000 కోట్లు కేటాయించింది. రూ. 2,430 కోట్ల అదనపు పెట్టుబడితో  రూ. 3.35 లక్షల కోట్ల అధిక  ఉత్పత్తి తో పాటు 75,000 మంది నిపుణులకు ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తుందని అంచనా.

 

****



(Release ID: 1953971) Visitor Counter : 146


Read this release in: English , Urdu , Hindi