రక్షణ మంత్రిత్వ శాఖ
కమాండెంట్, ఆర్మీ హాస్పిటల్ (పరిశోధన & రెఫరల్) గా లెఫ్టినెంట్ జనరల్ అజిత్ నీలకంఠన్ సెప్టెంబర్ 1న భాద్యతలు చేపట్టనున్నారు
Posted On:
31 AUG 2023 8:47PM by PIB Hyderabad
న్యూ ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (పరిశోధన & రెఫరల్) కమాండెంట్ గా లెఫ్టినెంట్ జనరల్ అజిత్ నీలకంఠన్ సెప్టెంబర్ 1న భాద్యతలు స్వీకరిస్తారు. ఆయన గతంలో డైరెక్టర్ జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ (సాయుధ దళాలు) పదవిని నిర్వహించారు.
లెఫ్టినెంట్ జనరల్ అజిత్ నీలకంఠన్ త్రివేండ్రం మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి, జనరల్ ఆఫీసర్ గా ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో 16 ఏప్రిల్ 1987న నియమితులయ్యారు. ఆయన పూణేలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుండి ఈ ఎన్ టీ లో ఎం ఎస్ పూర్తి చేసారు. తదనంతరం ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో తల మరియు మెడ ఓంకో సర్జరీలో శిక్షణ పొందారు.
తన కెరీర్‌లో లెఫ్టినెంట్ జనరల్ అజిత్ నీలకంఠన్డిప్యూటీ కమాండెంట్ ఆర్మీ హాస్పిటల్ (రీసెర్చ్ & రిఫరల్) మరియు కమాండెంట్, కమాండ్ హాస్పిటల్ (ఈస్టర్న్ కమాండ్) . జనరల్ ఆఫీసర్ కమాండ్ హాస్పిటల్ (ఈస్టర్న్ కమాండ్), బేస్ హాస్పిటల్ ఢిల్లీ కంటోన్మెంట్, ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ మరియు ఆర్మీ హాస్పిటల్ వంటి అనేక ముఖ్యమైన క్లినికల్ మరియు స్టాఫ్ పదవులను నిర్వహించారు. ఢిల్లీ సాయుధ దళాల వైద్య సేవల యొక్క వివిధ సూపర్ స్పెషాలిటీ మరియు అపెక్స్ హాస్పిటల్‌లలో ఎన్ టీ హెచ్- తల్లి మెడ సర్జరీ విభాగానికి కూడా నాయకత్వం వహించారు. ఆయన పూణేలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ మరియు హెడ్ (ఎన్ టీ హెచ్-హెచ్ హెన్ ఎస్ ) కూడా పనిచేశారు.
జనరల్ ఆఫీసర్‌ను ఎం సీ ఐ /ఎన్ ఎం సీ గా మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం, గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం, మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మరియు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ వంటి వివిధ విశ్వవిద్యాలయాలు ప్రొఫెసర్/పీజీ ఎగ్జామినర్‌గా గుర్తించాయి.
ఆయన అందించిన అద్భుతమైన సేవకు 2013లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ కమెండేషన్ మరియు 2014లో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్‌ను అందుకున్నారు..
***
(Release ID: 1953943)
Visitor Counter : 128