పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతాల్లో గాలి నాణ్యతలో మెరుగుదల కొనసాగుతోంది
గత 8 సంవత్సరాలలో (కొవిడ్ ప్రభావిత 2020 మినహా) జనవరి - ఆగస్టు 2023 మధ్య కాలంలో అత్యుత్తమ సగటు గాలి నాణ్యతను ఢిల్లీ నమోదు చేసింది.
2023 జనవరి-ఆగస్టులో రోజువారీ సగటు పిఎం2.5 సాంద్రతలు దాదాపు 77 మైక్రోగ్రామ్/ఎం3 నమోదయ్యాయి. 2017 నుండి 2022 వరకు సంబంధిత కాలాల్లో 85-97 మైక్రోగ్రామ్/ఎం3 (కొవిడ్ ప్రభావిత 2020 మినహా)
Posted On:
31 AUG 2023 6:21PM by PIB Hyderabad
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మొత్తం గాలి నాణ్యతలో మెరుగుదల ధోరణి కొనసాగుతోంది. ఈ సంవత్సరం జనవరి-ఆగస్టు మధ్య కాలంలో గత 8 సంవత్సరాలలో అంటే 2016 నుండి 2023 వరకు (కొవిడ్ ప్రభావిత 2020 మినహాయించి) అత్యుత్తమ సగటు గాలి నాణ్యతను ఢిల్లీ నమోదు చేసింది.
రోజువారీ సగటు ప్రస్తుత సంవత్సరంలో పైన పేర్కొన్న కాలంలో ఢిల్లీలో ఎక్యూఐ 174గా నమోదైంది. ఇది 2022లో 194, 2021లో 192, 2020లో 147, 2019లో 199, 2018లో 203, 2017లో 203 మరియు 236లో వరుసగా 236గా నమోదైంది.
జనవరి-ఆగస్టు మధ్య కాలంలో మొత్తం రోజువారీ సగటు ఎక్యూఐ స్థాయి 200 కంటే తక్కువ 2021 నుండి మాత్రమే గమనించబడింది. 2023లో అత్యల్పంగా 174 ( కొవిడ్ ప్రభావిత 2020 మినహా)గా నమోదయింది.
వర్షపాతం/ అవపాతం మరియు గాలి వేగం స్థాయిల ద్వారా ఎక్యూఐ బాగా ప్రభావితమవుతుంది. ఆగస్టు 2023 నెల అత్యంత పొడిగా ఉంది, మొత్తం దేశంలో సాధారణం కంటే దాదాపు 30% వర్షపాతం మరియు ఢిల్లీ, హర్యానా మరియు రాజస్థాన్‌లలో కూడా సాధారణం కంటే 50% కంటే ఎక్కువ లోటు గణనీయంగా ఉంది. ఆగస్ట్ 26 మరియు 28 తేదీలలో సంభవించిన బలమైన దుమ్ము తుఫాను కార్యకలాపాలు కూడా పిఎం10 సాంద్రతలలో అస్థిరమైన పెరుగుదలకు దారితీశాయి. ఈ పరిస్థితి ఉన్నప్పటికీ, ఆగస్టు నెలలో మొత్తం 31 రోజుల రోజువారీ సగటు ఎక్యూఐ "సంతృప్తికరమైన - మితమైన" గాలి నాణ్యత విభాగంలోనే ఉంది.
గత 5 సంవత్సరాల (కొవిడ్ ప్రభావిత 2020 మినహా) సంబంధిత కాలంతో పోల్చితే జనవరి - ఆగస్టు 2023 మధ్యకాలంలో "మంచి" నుండి "మితమైన" గాలి నాణ్యత (రోజువారీ సగటు ఎక్యూఐ<200)తో ఢిల్లీ అత్యధిక రోజులు (163) చూసింది.
మునుపటి సంవత్సరాల్లో ఈ కాలంలో “మంచి” నుండి “మధ్యస్థం” వరకు గాలి నాణ్యత రోజులు వరుసగా 2022లో 116, 2021లో 144, 2019లో 135 మరియు 2018లో 123 రోజులు మాత్రమే ఉన్నాయి.
2023లో ఈ కాలంలో రోజువారీ సగటులో కూడా గణనీయమైన తగ్గుదల కనిపించింది. గత 6 సంవత్సరాలలో పిఎం2.5 మరియు పిఎం10 సాంద్రతలు నమోదయ్యాయి.
2023 జనవరి-ఆగస్టు మధ్య కాలంలో రోజువారీ సగటు పిఎం2.5 సాంద్రతలు దాదాపు 77 మైక్రోగ్రామ్/ఎం3 నమోదయ్యాయి. 2017 నుండి 2022 వరకు (కొవిడ్ ప్రభావితమైన 2020 మినహా) 85-97 మైక్రోగ్రామ్/ఎం3 వరకు ఉంది.
అదేవిధంగా ఢిల్లీలో రోజువారీ సగటు పిఎం10 గాఢత దాదాపు 176 మైక్రోగ్రామ్/ఎం3 ఉంది. ఇది 2017 నుండి 2022 వరకు సంబంధిత కాలాల్లో (కొవిడ్ ప్రభావిత 2020 మినహా) 201-226 మైక్రోగ్రామ్/ఎం3 పరిధి కంటే చాలా తక్కువగా ఉంది.
అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, నిరంతర భూస్థాయి ప్రయత్నాలు, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి వివిధ వాటాదారుల ఏజెన్సీల చర్యలు మరియు కొనసాగుతున్న పర్యవేక్షణ మరియు అమలు చర్యలు 2023లో మెరుగైన గాలి నాణ్యతకు సహాయపడ్డాయి.
****
(Release ID: 1953933)
Visitor Counter : 162