రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సాగ‌ర్ ప‌రిక్ర‌మ 4 కోసం స‌న్నాహాల‌ను ఉధృతం చేసిన భార‌తీయ నావికాద‌ళం

Posted On: 31 AUG 2023 3:25PM by PIB Hyderabad

 భార‌త నావికాద‌ళం 27 ఆగ‌స్టు 2023న గోవాల సాగ‌ర్ ప‌రిక్ర‌మ 4 కోసం త‌న స‌న్నాహాల‌ను అధికారికంగా ప్రారంభించిన‌ట్టు సంకేతాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే,  వ‌చ్చే ఏడాది భార‌తీయ నౌక తారిణి పై స‌ర్క‌మ్‌వెంటింగ్  నౌకాయాత్ర‌కు వెళ్ళ‌నున్న‌ ఇద్ద‌రుస్వ‌చ్ఛంద మ‌హిళా అధికారులు లెఫ్టెనెంట్ క‌మ‌డోర్ దిల్నా, లెఫ్టెనెంట్ క‌మ‌డోరా రూపాల‌కు మార్గ‌ద‌ర్శిగా,  కోచ్‌గా ఉండేందుకు అగ్ర స‌ర్క‌మ్ నావిగేట‌ర్ (నౌకా యాత్ర ద్వారా స‌ముద్రాన్ని చుట్టు తిర‌గ‌డం), గోల్డెన్ గ్లోబ్ రేస్ హీరో అయిన‌ క‌మ‌డోర్ అభిలాష్‌తో అవ‌గాహ‌నా ఒప్పందంపై సంత‌కాలు చేసింది.
కంట్రోల‌ర్ ఆఫ్ ప‌ర్స‌న‌ల్ స‌ర్వీసెస్, భార‌తీయ నావికాద‌ళ సెయిలింగ్ అసోసియేష‌న్ (ఐఎన్ఎస్ఎ) ఉపాధ్య‌క్షుడు విఎడిఎం కృష్ణ స్వామినాథ‌న్‌, నావ‌ల్ వార్ కాలేజ్ క‌మాండెంట్ ఆర్ఎడిఎం రాజేష్ ధ‌న్‌ఖ‌డ్‌ల స‌మ‌క్షంలో ఈ అవ‌గాహ‌నా ఒప్పందంపై సంత‌కాలు చేయ‌డం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పెద్ద సంఖ్య‌లో నావికాద‌ళ సిబ్బంది కూడా పాల్గొన్నారు. 
ఆక‌ట్టుకునే స‌ముద్ర నావికాయాన విన్యాసాల విష‌యంలో ఇద్ద‌రు మ‌హిళా అధికారులు విఎడిఎం స్వామినాథ‌న్ అభినంద‌న‌లు తెల‌ప‌డ‌మే కాక సాగ‌ర్ ప‌రిక్ర‌మ 4 కోసం వారి స‌న్న‌ద్ధ‌తకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ స‌ముద్ర‌యాత్ర కృషికి త‌న బ‌ల‌మైన మ‌ద్ద‌తును అందిస్తున్నందుకు భార‌తీయ నావికాద‌ళం త‌ర‌ఫున క‌మ‌డోర్ అభిలాష్ టామీకి కూడా ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 
రానున్న నెల‌ల్లో ఇద్ద‌రు అధికారులు స‌వాళ్ళ‌తో కూడిన మిష‌న్ కోసం అరేబియా స‌ముద్రం, బంగాళాఖాతం, హిందూ మ‌హాస‌ముద్రంలో ప‌లు స్వ‌ల్ప‌కాలిక‌, దీర్ఘ యాత్ర‌లు చేప‌ట్ట‌డం స‌హా క‌మడోర్ టామీ శిష్య‌రికంలో క‌ఠిన శిక్ష‌ణ‌ను పొంద‌నున్నారు. 
క‌మ‌డోర్ టామీ ఇత‌ర సెయిలింగ్ యాత్ర‌ల‌లో పాల్గొనేవారికి కూడా మార్గ‌ద‌ర్శ‌నం చేయ‌డ‌మే కాక‌, శిక్ష‌ణా సంస్థ‌ల‌లో  శిక్ష‌ణ పొందుతున్న‌వారితో ప్రేర‌ణాత్మ‌క చ‌ర్చ‌ల ద్వారా, త‌న అనుభ‌వాల‌ను పంచుకుంటారు. 
సాగ‌ర్ ప‌రిక్ర‌మ 4 మునుపెన్న‌డూ చేయ‌ని సాహ‌సమే కాక భార‌త‌దేశ స‌ముద్ర నౌకాయానం య‌త్నంలో ఒక ముఖ్య‌మైన అడుగు. 

 

****


(Release ID: 1953929) Visitor Counter : 112