శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్- సిఎస్ఐఆర్ ప్రైమా ఈటీ11- ని అభివృద్ధి చేసిన సిఎస్ఐఆర్ - సిఎం ఇఆర్ఐ

Posted On: 30 AUG 2023 8:31PM by PIB Hyderabad

భారతదేశంలో, జనాభాలో దాదాపు 55% మందికి వ్యవసాయం ప్రాథమిక జీవనోపాధి వనరుగా ఉంది, 1.3 బిలియన్ ప్రజలకు ఆహారం అందిస్తోంది. దేశ జిడిపికి గణనీయంగా దోహదం చేస్తోంది. యాంత్రీకరణ ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో ట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తాయి. భారతీయ ట్రాక్టర్ పరిశ్రమ గత కొన్ని దశాబ్దాలలో ఉత్పత్తి సామర్థ్యం, సాంకేతికత పరంగా చాలా ముందుకు వచ్చింది.

సిఎస్ఐఆర్ సిఎంఇఆర్ఐ కి వివిధ స్థాయిలు, సామర్ధ్యాలతో ట్రాక్టర్ల డిజైన్, అభివృద్ధిలో సిఎస్ఐఆర్ కి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1965లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన స్వరాజ్ ట్రాక్టర్, 2000లో అభివృద్ధి చేసిన 35 హెచ్ పి సోనాలికా ట్రాక్టర్, 2009లో చిన్న, సన్నకారు రైతుల డిమాండ్ కోసం 12 హెచ్ పి చిన్న డీజిల్ కృషిశక్తి ట్రాక్టర్ తో ఈ ప్రయాణం ప్రారంభమైంది. వారసత్వాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిఎంఇఆర్ఐ ట్రాక్టర్ అభివృద్ధి పై అధునాతన

సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేయడం ప్రారంభించింది, ఫలితంగా ఈ ఇ-ట్రాక్టర్ ఆవిర్భవించింది.
 

సాంప్రదాయకంగా ట్రాక్టర్లు డీజిల్ ను ఉపయోగిస్తాయి, తద్వారా పర్యావరణ కాలుష్యానికి గణనీయంగా దోహదం చేస్తాయి. ఒక అంచనా ప్రకారం మన దేశ వార్షిక డీజిల్ వినియోగంలో ఇవి 7.4%, మొత్తం వ్యవసాయ ఇంధన వినియోగంలో 60% ఉన్నాయి. వచ్చే రెండు దశాబ్దాలలో వాటి పిఎం 2.5, ఎన్ ఒఎక్స్ ఉద్గారాలు ప్రస్తుత స్థాయి కంటే 4-5 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ రంగాన్ని విద్యుదీకరణ దిశగా వేగంగా మళ్లించేందుకు గ్లోబల్ కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గింపు వ్యూహం ఎంతో అవసరం . 2021 సంవత్సరంలో గ్లాస్గోలో జరిగిన సి ఒపి 26 శిఖరాగ్ర సమావేశంలో, 2030 నాటికి మొత్తం అంచనా వేయబడిన కార్బన్ ఉద్గారాలను ఒక బిలియన్ టన్నులు తగ్గించడానికి కృషి చేస్తామని భారతదేశం ప్రకటించింది. అలాగే 2070 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందువల్ల, ట్రాక్టర్ల విద్యుదీకరణ ఈ లక్ష్యాలను సాధించడంలో మన దేశానికి సహాయపడే అవసరమైన దశ. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను మరింత తగ్గించాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని, త్వరలో శిలాజ ఇంధనాల కొరతను పరిగణనలోకి తీసుకొని, మరింత స్థిరమైన వ్యవసాయం నేపథ్యంలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను సాధ్యమైన పరిష్కారంగా గుర్తించారు. ఏదేమైనా, చాలా వాణిజ్య పరికరాలు అధిక-శక్తి యంత్రాలను కలిగి ఉంటాయి, ఇవి పెద్ద విస్తీర్ణ ప్రాంతానికి మాత్రమే సాధ్యమవుతాయి సుమారు 2 హెక్టార్లు లేదా అంతకంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్న భారతీయ సన్నకారు రైతులకు సవాలుగా ఉంటుంది. ఈ చిన్న ,సన్నకారు రైతులు 80% కంటే ఎక్కువ మంది రైతు సమాజాన్ని కలిగి ఉంటారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు సిఎస్ఐఆర్ సిఎంఇఆర్ఐ భారతదేశంలోని చిన్న, సన్నకారు రైతుల కోసం దేశీయంగా సిఎస్ఐఆర్ ప్రైమా ఈటీ11 పేరుతో కాంపాక్ట్ 100% ప్యూర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను రూపొందించి అభివృద్ధి చేసింది. సిఎస్ఐఆర్ ప్రైమా ఇటి 11 ప్రత్యేకతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: 1) మొదటి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొత్తం ట్రాక్టర్ ను స్వదేశీ విడి భాగాలు, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో డిజైన్ చేసి తయారు చేశారు.

2) ట్రాక్టర్ వ్యవసాయ క్షేత్రానికి ఖచ్చితంగా సరిపోయేలా ఉండాలనే ప్రధాన అవసరానికి అనుగుణంగా దాని డైనమిక్స్, బరువు, , ట్రాన్స్ మిషన్ సర్దుబాట్లు, ఆ తరువాత లివర్ ,పెడల్ పొజిషన్ ఇలా ప్రతి దానిని పకడ్బందీగా పరిగణన లోకి తీసుకుని డిజైన్ చేశారు.
3) అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం లో మరో యు ఎస్ పి ఏమిటంటే ఇది మహిళా హితం (ఉమెన్ ఫ్రెండ్లీ) . దీనికోసం ఎర్గోనామిక్స్ లో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఉదా: మహిళలు సులభంగా నడిపేలా లివర్లు, స్విచ్ లు మొదలైన అన్నింటినీ అనువుగా అమర్చారు. ఇంకా పెద్దగా శ్రమ పడకుండా అనేక యాంత్రిక వ్యవస్థలను సులభమైన నిర్వహణ కోసం ఎలక్ట్రానిక్ స్విచ్ లతో భర్తీ చేశారు.
4) రైతులు సాంప్రదాయ హోమ్ ఛార్జింగ్ సాకెట్ ఉపయోగించి ట్రాక్టర్ ను 7 నుండి 8 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇంకా ట్రాక్టర్ ను పొలంలో 4 గంటలకు పైగా ఆపరేట్ చేయవచ్చు., సాధారణ హాలేజ్ ఆపరేషన్ విషయంలో అయితే ట్రాక్టర్ 6 గంటలకు పైగా నడవగలదు. భారతదేశంలో రైతులు తమ పనిని ఉదయం నుండి ప్రారంభించి మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకుంటారు . ఈ సమయంలో వారు తమ ట్రాక్టర్ ను ఛార్జ్ చేయవచ్చు, తద్వారా వారు తిరిగి మధ్యాహ్నం నుంచి వాటిని పనికి ఉపయోగించవచ్చు.
5) ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే: సెమీ సింక్రనైజ్డ్ టైప్ గేరింగ్ సిస్టమ్ ను ఉపయోగించి బలమైన , సమర్థవంతమైన ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో ట్రాక్టర్ ను డిజైన్ చేస్తున్నందున తక్కువ ఖర్చులో ఆశించిన సామర్థ్యాన్ని సాధించడానికి వీలవుతుంది.
6) ట్రాక్టర్ 500 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తే సామర్థ్యంతో అత్యుత్తమ హైడ్రాలిక్ కలిగి ఉంది. ట్రాక్టర్ ఫీల్డ్ ఆపరేషన్ కు మాత్రమే కాకుండా రవాణా ఆపరేషన్ కు అవసరమైన పనిముట్లను లిఫ్ట్ చేయగలదని ఇది సూచిస్తుంది. ఈ ట్రాక్టర్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో 1.8 టన్నుల సామర్థ్యం గల ట్రాలీని నడపగలదు.
7) అవసరమైన కవర్లు, గార్డులతో పటిష్టంగా చేసిన డిజైన్ డానికి బురద, నీటి నుంచి రక్షణ కల్పిస్తుంది.
8) ఎలక్ట్రిక్ అంశాల విషయానికి వస్తే ప్రిస్మాటిక్ సెల్ కన్ఫర్మేషన్ తో అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీ ని మనం ఎంచుకున్నాం. ఇది వ్యవసాయ అనువర్తనానికి లోతైన డిశ్చార్జ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 3000 చక్రాల (సైకిల్) కంటే ఎక్కువ జీవితకాలాన్ని కలిగి ఉంది.
9) కంట్రోలర్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా సవరించారు.
10) మరో ప్రత్యేక లక్షణం ఏమిటంటే, లోడ్ చేయడానికి V2L అనే పోర్ట్ అంటే వాహనం ఉంది, అంటే ట్రాక్టర్ పనిచేయనప్పుడు, దాని బ్యాటరీ శక్తిని పంప్,ఇరిగేషన్ వంటి ఇతర ద్వితీయ అనువర్తనాలకు ఉపయోగించవచ్చు. ఇంతకు ముందు ఎక్కడా లేని ఈ మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో జరిగిన వన్ వీక్ వన్ ల్యాబ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆవిష్కరించారు.

డిఎస్ఐఆర్ కార్యదర్శి డాక్టర్ ఎన్ కలైసెల్వి , అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ఈ ప్రభావవంతమైన సాంకేతిక పరిజ్ఞానం లైసెన్స్ ను హైదరాబాద్ కు చెందిన కెఎన్ బయోసైన్స్ కంపెనీ కి ఇచ్చారు. కుశాల్ ట్రాక్టర్ బ్రాండ్ కు, అనేక బయోసైన్స్ సంబంధిత అభివృద్ధి / ప్రోడక్టు లను క్షేత్ర స్థాయికి తీసుకు వెళ్ళడంలో ఈ కంపెనీ పేరు గాంచింది. ఈ ప్రాజెక్టు కూడా ఘన విజయం సాధించాలని ఆశిస్తున్నాం.
ఈ ట్రాక్టర్ సిఎస్ఐఆర్ ప్రైమా ఇటి 11 భారతదేశంలోని చిన్న , సన్నకారు రైతుల డిమాండ్లను తీర్చడం లో సుస్థిర వ్యవసాయంలో పురోగతిని సృష్టిస్తుందని భావిస్తున్నారు. తద్వారా ఈ పరిణామం "మేక్ ఫర్ ది వరల్డ్" అనే విప్లవాత్మక దార్శనికతతో ప్రపంచ ట్రాక్టర్ పరిశ్రమలో భారత దేశం నాయకత్వం వహించడానికి ప్రేరేపిస్తుంది.

****(Release ID: 1953643) Visitor Counter : 189


Read this release in: English , Urdu , Hindi