అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకుని ఆంక్షలు సడలించడంతో భారత అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెంది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది... కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


'' ప్రధానమంత్రి నిర్ణయంతో గతం చెరిగి పోయింది. పెట్టుబడులు సమకూరాయి. ప్రైవేటు రంగం సహకారంతో అంతరిక్ష రంగం అభివృద్ధి పధంలో పయనిస్తోంది''... డాక్టర్ జితేంద్ర సింగ్

'' 2020 నాటికి భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ $80 బిల్లియన్లకు చేరుతుంది'' .. డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 30 AUG 2023 4:56PM by PIB Hyderabad

అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రపంచం గుర్తించింది అని  కేంద్ర శాస్త్ర, సాంకేతిక, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు,ప్రజా ఫిర్యాదులు, అంతరిక్షం, అణుశాస్త్ర శాఖ సహాయ మంత్రి (పూర్తి స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకుని ఆంక్షలు సడలించడంతో భారత అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెంది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది మంత్రి అన్నారు. 

'' ప్రధానమంత్రి నిర్ణయంతో గతం చెరిగి పోయింది. ఈ పరిమాణం ముందుగా ఎందుకు చోటు చేసుకోలేదు అని నాకు అనిపిస్తుంది. ప్రధానమంత్రి నిర్ణయంతో పెట్టుదులు పెరిగాయి. ప్రైవేటు రంగం ముందుకు వచ్చింది. పెట్టుబడులు పెరగడంతో అభివృద్ధి సాధ్యం అయ్యింది.  కేవలం 3-4 సంవత్సరాల కాలంలో దేశంలో 150కి పైగా అంకుర సంస్థలు ఏర్పాటు అయ్యాయి'' అని మంత్రి ఒక ప్రైవేటు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వ్యాఖ్యానించారు. 

 380 కి పైగా విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది అని  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా 250 మిలియన్ యూరోలు,అమెరికా ఉపగ్రహాలను 170 మిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని ఇస్రో  ఆర్జించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

“ భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ నేడు దాదాపు $ 8 బిలియన్ల వద్ద ఉంది, ఇది ప్రపంచంలో   (మార్కెట్ వాటా) 2% గా ఉంది.  అయితే ప్రపంచం మొత్తం భారతదేశం సాధించిన ప్రగతిని గుర్తించింది. ఈ లెక్కల ప్రకారం 2040 నాటికి భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ  2040 నాటికి $40 బిలియన్లుకు చేరుతుందని అంచనా. అయితే,  2-3 రోజుల క్రితం విడుదల అయిన  ADL (ఆర్థర్ డి లిటిల్) నివేదిక భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ  2040 నాటికి $100 బిలియన్లకు చేరుకునే  సామర్థ్యాన్ని కలిగి ఉందని  పేర్కొంది, ఇది ఒక భారీ ముందడుగు  అవుతుంది.  ప్రపంచం కూడా ఇలా జరగాలని ఆశిస్తోంది. భారతదేశం వేగంగా అభివృద్ధి పధంలో అడుగులు వేస్తోంది. తరచూ ప్రయోగాలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.'' అని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 

సెప్టెంబర్ 2వ తేదీన మొదటి సూర్యుని  మిషన్ "ఆదిత్య-ఎల్1" ప్రయోగం జరుగుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  తర్వాత అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మొదటి ట్రయల్ జరుగుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.  వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే రెండవ ట్రయల్‌లో  “వ్యోమ్మిత్ర” అనే మహిళా రోబోట్ గగనంలోకి వెళ్తుందని మంత్రి తీలిపారు.పరీక్షల తర్వాత   ముగ్గురు వ్యోమగాములతో  మొదటి మానవ మిషన్‌ ప్రయోగం జరుగుతుందని వివరించారు. 

అంతరిక్ష పరిశోధనలో భారతదేశం మరే ఇతర దేశంతో పోటీ పడడం లేదని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.  భారతదేశ అంతరిక్ష పరిశోధన , అణుశక్తి కార్యక్రమాలు వ్యవస్థాపక పితామహులు నిర్దేశించిన విధంగా  పూర్తిగా శాంతియుత అవసరాల కోసం జరుగుతున్నాయన్నారు.  ప్రముఖ అంతరిక్ష సంస్థలకు ఇస్రో సహకారం అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు.  ప్రైవేట్ విదేశీ సంస్థల, విద్యా సంస్థల రూపొందించిన  అనేక ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అంశాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. 

రైల్వేలు, హైవేలు, వ్యవసాయం, వాటర్ మ్యాపింగ్, స్మార్ట్ సిటీలు, టెలిమెడిసిన్ , రోబోటిక్ సర్జరీ వంటి వివిధ రంగాలకు స్పేస్ టెక్నాలజీ ఉయోగిస్తున్నామని తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్ దీనివల్ల  సామాన్యులకు 'సులభతరం జీవన విధానం' అందిందన్నారు. వాస్తవానికి భారతదేశంలో ప్రతి గృహాన్ని  స్పేస్ టెక్నాలజీ తాకిందని   డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.

 

***


(Release ID: 1953617) Visitor Counter : 193