కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
“రివ్యూ ఆఫ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఫర్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ కేబుల్ సర్వీసెస్”పై ట్రాయ్ విడుదల చేసిన సంప్రదింపుల పత్రంపై వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలు స్వీకరించే చివరి తేదీ పొడిగింపు
Posted On:
30 AUG 2023 5:05PM by PIB Hyderabad
భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్, ఈ నెల 08వ తేదీన, “రివ్యూ ఆఫ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఫర్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ కేబుల్ సర్వీసెస్”పై ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. సంప్రదింపు పత్రంలోని అంశాలపై సంబంధిత వర్గాల నుంచి వ్యాఖ్యలు స్వీకరించడానికి చివరి తేదీగా 05 సెప్టెంబర్ 2023ను నిర్ణయించింది. ప్రతివ్యాఖ్యలు పంపడానికి చివరి తేదీగా అదే నెల 19వ తేదీని నిర్ణయించింది.
సంప్రదింపు పత్రంపై వ్యాఖ్యలు సమర్పించేందుకు సమయం పొడిగించాలని వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని, వ్యాఖ్యలు & ప్రతివ్యాఖ్యల సమర్పణకు చివరి తేదీలను 19 సెప్టెంబర్ 2023 & 03 అక్టోబర్ 2023 వరకు ట్రాయ్ పొడిగించింది.
వ్యాఖ్యలు & ప్రతివ్యాఖ్యలను ఎలక్ట్రానిక్ రూపంలో పంపవచ్చు. ఈ-మెయిల్ ఐడీలు advbcs-2@trai.gov.in, jtadvbcs-1@trai.gov.in.
దీనిపై మరింత స్పష్టత లేదా సమాచారం కావాలనుకుంటే, సలహాదారు (బీ&సీఎస్) శ్రీ అనిల్ కుమార్ భరద్వాజ్‌ను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఫోన్ నంబరు +91-11-23237922.
****
(Release ID: 1953616)