నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డిజిలు) వేగవంతంగా అమలు చేసే దిశగా యుఎన్‌డిపితో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న నీతి ఆయోగ్

Posted On: 29 AUG 2023 4:11PM by PIB Hyderabad

స సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజిలు)లో వేగంగా పురోగతి సాధించడానికి పరస్పర నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ,   ఎస్‌డిజి  స్థానికీకరణ, పర్యవేక్షణ, ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాక్‌లు, ఇతర వాటితోపాటు డేటా ఆధారిత అంశాలతో అనేక రంగాలపై సహకార విధాన చట్రాన్ని అధికారికంగా రూపొందించడానికి నీతి ఆయోగ్,  యుఎన్‌డిపి-భారత్ ఈ రోజు ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశాయి. నీతి ఆయోగ్ సీఈఓ శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం సమక్షంలో  డాక్టర్ యోగేష్ సూరి, నీతి ఆయోగ్ సీనియర్ అడ్వైజర్ (ఎస్‌డిజిలు), యుఎన్‌డిపి ఇండియా రెసిడెంట్ రిప్రజెంటేటివ్ శ్రీమతి షోకో నోడా సంతకాలు చేశారు.

భాగస్వామ్యాన్ని స్వాగతిస్తూ శ్రీ  బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, “సంవత్సరాలుగా, నీతి ఆయోగ్,  యుఎన్‌డిపి  సహకారం క్రమక్రమంగా బలం పుంజుకుందని అన్నారు. పర్యవేక్షణ జిల్లాలు దాటి బ్లాక్ స్థాయికి వెళ్లడంతో, ఈ భాగస్వామ్యం డేటా-ఆధారిత విధాన జోక్యాలను, ప్రోగ్రామాటిక్ చర్యలను ప్రోత్సహిస్తున్నట్లు తాము చూస్తున్నామన్నారు. 2030 ఎజెండా మధ్యభాగంలో నిలబడి, సహకార సమాఖ్యవాదం నిజమైన స్ఫూర్తితో రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని,  దాని అభివృద్ధి ప్రాధాన్యతలను దాని సహచరులకు గ్రహించడంలో భారతదేశం సాధించిన విజయాలను ప్రదర్శించడానికి పంచుకోవడానికి  యుఎన్‌డిపితో భాగస్వామ్యం కోసం తాము ఎదురుచూస్తున్నామని శ్రీ సుబ్రహ్మణ్యం తెలిపారు. "

యుఎన్‌డిపి -భారత్ రెసిడెంట్ రిప్రజెంటేటివ్ శ్రీమతి షోకో నోడా  యుఎన్‌డిపి  నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, “2030కి మధ్యలో,  ఎస్‌డిజిలను సాకారం చేయడంలో భారతదేశ నాయకత్వం చాలా కీలకం. 2015-2016 మరియు 2019-2021 మధ్య భారతదేశం బహుమితీయ పేదరికాన్ని దాదాపు సగానికి తగ్గించింది, సంక్లిష్ట సవాళ్లు ఉన్నప్పటికీ, లక్ష్యాల దిశగా పురోగతిని వేగవంతం చేయడం సాధ్యమవుతుందని నిరూపిస్తుంది. నీతి ఆయోగ్‌తో ఈ అవగాహన ఒప్పందం ద్వారా,  యుఎన్‌డిపి, ఎస్‌డిజిల స్థానికీకరణ, వివిధ సూచికల ద్వారా డేటా-ఆధారిత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 

ఐదేళ్ల కాలానికి ఎంఓయూపై సంతకాలు చేశారు.నీతి ఆయోగ్ జాతీయ, ఉప-జాతీయ స్థాయిలలో ఎస్‌డిజి ల స్వీకరణ, పర్యవేక్షణను సమన్వయం చేయడానికి నోడల్ మంత్రిత్వ శాఖ. యున్ వ్యవస్థలో  ఎస్‌డిజిల పురోగతిని వేగంగా ట్రాక్ చేయడానికి ప్రయత్నాలను సమన్వయం చేయడంలో  యుఎన్‌డిపి ఇంటిగ్రేటర్ పాత్రను పోషిస్తుంది.

 

****


(Release ID: 1953414) Visitor Counter : 279