వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
మెస్సర్స్ ఇక్రా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్కి సీసీపీఏ ఆదేశాలు
- వెబ్‌సైట్ నుండి తప్పుడు టెస్టిమోనియల్‌లు మరియు తప్పుదారి పట్టించే క్లెయిమ్‌లను వెంటనే నిలిపివేయాలని ఆర్డరు
- తప్పుడు, తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేసినందుకు రూ.1,00,000 జరిమానా విధింపు
Posted On:
29 AUG 2023 1:54PM by PIB Hyderabad
మెస్సర్స్ ఇక్రా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్కి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 2015-2017 సంవత్సరాలకు చెందిన టాప్-ర్యాంక్ హోల్డర్ల తప్పుదోవ పట్టించే టెస్టిమోనియల్లను ప్రచారం చేయడం ద్వారా తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయడం న్యాయబద్ధం కాని వ్యాపార అభ్యాసం చేసినందుకు గాను మెస్సర్స్ ఇక్రా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్కి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం-2019 ఉల్లంఘన దృష్ట్యా.. చీఫ్ కమిషనర్ శ్రీమతి నిధి ఖరే నిధి మరియు కమిషనర్ శ్రీ అనుపమ్ మిశ్రా నేతృత్వంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో స్థాపించబడిన ఇక్రా ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ ద్వారా ఈ విషయం సీసీపీఏ దృష్టికి వచ్చింది. 2015 & 2017లో యుపిఎస్సీ సీఎస్ఈ యొక్క టాప్-ర్యాంక్ హోల్డర్‌ల టెస్టిమోనియల్‌ల ద్వారా 2015 & 2017లో తమ వద్ద శిక్షణ పొందిన విద్యార్థులుగా చూపుతూ వాస్తవమైన ప్రకటనలో మోసగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో సీసీపీఏ సుయో-మోటో కాగ్నిజెన్స్ తీసుకుంది. పైన పేర్కొన్న తప్పుడు దావాతో పాటు, అత్యుత్తమ యుపీఎస్సీ ఆన్‌లైన్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్- 2020ని అందించడానికి భారతదేశం నలుమూలల నుండి అత్యుత్తమ అధ్యాపకులను కలిగి ఉన్న ఏకైక కోచింగ్ అకాడమీగా ఇన్‌స్టిట్యూట్ తనను తాను క్లెయిమ్ చేసినట్టుగా కనుగొంది. దీంతో పూణేలో ఏడాదిలోలే యుపీఎస్సీ కోచింగ్లో ఈ సంస్థ అగ్రస్థానంలోకి చేరింది. దీని ప్రకారం, మెస్సర్స్ ఇక్రా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్కి నోటీసు జారీ చేసింది. దీనికి సంస్థ ప్రతిస్పందిస్తూ పూణే & కాన్పూర్లోని అధ్యాపకులు అధిక అర్హతలు మరియు ప్రసిద్ధి చెందినవారని తెలిపింది. 5కి 4.6 శాతంతో గూగుల్ రేటింగ్ను కలిగి ఉన్నారని పేర్కొంది. 2020 సంవత్సరానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ వారి ఉన్నత నైపుణ్యాలు మరియు పరిశోధన నాణ్యతతో తయారు చేయబడింది. ఇది విద్యాపరంగా విజయవంతమైంది. ప్రస్తుతం దాని వెబ్సైట్ నుండి ప్రకటన తీసివేయబడింది. మెస్సర్స్ ఇక్రా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ సంస్థ 2018లో స్థాపించబడింది. ఆలిండియా ర్యాంక్ హోల్డర్స్ టీనా దబీ ఏఐఆర్-1, (2015); అథర్ అమీర్ ఉల్ సఫీ ఖాన్ ఏఐఆర్-2, (2015); హిమాన్షు కౌశిక్ ఏఐఆర్-77, (2015); సైఫిన్ ఏఐఆర్-570, (2017)లను తమ విద్యార్థులుగా సంస్థ పేర్కొంది. ఈ విజయవంతమైన అభ్యర్థులు తమ విజయానికి రుణపడి ఉంటారని నమ్మించేలా ప్రకటనలు చేస్తూ వినియోగదారులను మోసం చేస్తోంది. ఈ విషయం దర్యాప్తు నివేదికలో కనుగొనబడింది. వినియోగదారుల హక్కులను రక్షించడానికి, ప్రోత్సహించడానికి మరియు అమలు చేయడానికి ప్రస్తుత విషయం వివరణాత్మక దర్యాప్తు కోసం డీజీ (ఇన్వెస్టిగేషన్) సీసీపీఏని అభ్యర్థించింది.
మెస్సర్స్ ఇక్రా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్కి అతిశయోక్తి క్లెయిమ్లను చేయడం ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టింది. దాని సేవలను తప్పుగా సూచించడమే కాకుండా, వారి సేవలను మోసపూరితంగా ప్రచారం చేయడం కోసం వినియోగదారులను తప్పుదారి పట్టించేందుకు ఎక్స్ప్రెస్ మరియు పరోక్ష ప్రాతినిధ్యాన్ని కూడా అందించిందని పేర్కొంది. మెస్సర్స్ ఇక్రా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్కి ఎక్కడా ఎలాంటి నిరాకరణను ప్రదర్శించలేదు మరియు వారు చేసిన ఇతర వాదనలను రుజువు చేయడంలో విఫలమైంది. ఉత్పత్తులు లేదా సేవల ప్రయోజనాన్ని అతిశయోక్తి చేయడం ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టించనప్పుడు ప్రకటన చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడుతుంది మరియు మోసపూరితమైనది కాదు. ప్రకటనలోని బహిర్గత సమాచారాన్ని దాచకూడదు. ఏదైనా క్లెయిమ్‌కు సంబంధించి మిస్ అవ్వడం కష్టంగా ఉండకూడదు, దాని మినహాయింపు లేదా లేకపోవడం ప్రకటనను మోసపూరితంగా లేదా దాని వాణిజ్య ఉద్దేశాన్ని దాచిపెట్టే అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ ఇప్పటికే తప్పుదారి పట్టించే ప్రకటనల నివారణకు మార్గదర్శకాలు మరియు తప్పుదారి పట్టించే ప్రకటనల కోసం ఎండార్స్మెంట్లు- 2022ని జారీ చేసింది. నవంబర్ 2022లో వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడం మరియు రక్షించడం కోసం నకిలీ, మోసపూరిత మరియు తప్పుదారి పట్టించే సమీక్షలను అరికట్టడానికి ఆన్లైన్ వినియోగదారు సమీక్షలపై ఫ్రేమ్వర్క్ను నోటిఫై చేసింది. దేశ నలుమూలలో ఉన్న వినియోగదారుల హక్కులను కాపాడేందుకు సీసీపీఏ కృషి చేస్తోంది. అందువల్ల తప్పుదోవ పట్టించే టెస్టిమోనియల్‌ల ముసుగులో తప్పుడు క్లెయిమ్లను నిలిపివేయాలని మెస్సర్స్ ఇక్రా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఆదేశాలు జారీ చేసింది. మోసపూరిత ప్రకటనలకు జరిమానాగా రూ.లక్ష రూపాల ఫైన్ను విధించింది.
***
(Release ID: 1953402)
Visitor Counter : 754