గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

'సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన కోసం ట్రైనీలకు అవగాహన ప్రచారం, శిక్షణ‘ ప్రారంభించిన శ్రీ అర్జున్ ముండా


జన్ భాగీదారీని నిర్ధారించడం ద్వారా ప్రధాన మంత్రి ‘సికిల్ సెల్ వ్యాధి రహిత భారతదేశం‘ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి చొరవ: శ్రీ ముండా

సికిల్ సెల్ ఎనీమియా, దాని నిర్మూలనకు సంబంధించిన అవగాహన మాడ్యూల్ ను వివిధ గిరిజన భాషల్లోకి అనువదించడం ద్వారా సందేశాన్ని క్షేత్రస్థాయిలో లోతుగా వ్యాప్తి చెందేలా చూడాలి.

మిషన్ లో ప్రజలను విస్తృతంగా భాగస్వాములను చేసేందుకు కమ్యూనిటీ లీడర్ లను నిమగ్నం చేయాలి.

Posted On: 29 AUG 2023 7:32PM by PIB Hyderabad

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా ఈ రోజు న్యూఢిల్లీలో 'సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్'లో భాగంగా 'అవగాహన ప్రచారం , ట్రైనీల శిక్షణ'ను ప్రారంభించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కిందిస్థాయి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారు.

2023-24 బడ్జెట్ లో 2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియా (ఎస్ సి డి) ను నిర్మూలించే మిషన్ ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మిషన్ ద్వారా అవగాహన కల్పించడం, ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో 0-40 సంవత్సరాల మధ్య వయస్సు గల ఏడు కోట్ల మందికి సార్వత్రిక స్క్రీనింగ్ , కేంద్ర మంత్రిత్వ శాఖలు , రాష్ట్ర ప్రభుత్వాల సహకార ప్రయత్నాల ద్వారా కౌన్సిలింగ్ అవసరం. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై ఒకటిన మధ్య ప్రదేశ్ లోని షాదోల్ జిల్లాలో ఈ మిషన్ ను లాంఛనంగా ప్రారంభించారు.

శిక్షణ, అవగాహన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సమాజాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా ‘సికిల్ సెల్  వ్యాధి రహిత భారతదేశం‘ అనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ప్రధాని స్ఫూర్తిదాయక నాయకత్వంలో, ఆరోగ్య , కుటుంబ సంక్షేమం , గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ఎస్ సి డి నిర్మూలన మిషన్ కోసం సమిష్టి గా అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నాయని శ్రీ ముండా తెలిపారు.

 ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సవాళ్లు, అవకాశాలను మంత్రి ప్రస్తావించారు. ప్రజా భాగస్వామ్యం (జన్ భాగీదారీ) తో ఈ మిషన్ ను క్షేత్రస్థాయి ఉద్యమంగా మార్చడమే ప్రాథమిక సవాలు అని ఆయన అన్నారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వ్యాధిని నిర్మూలించడానికి నిజమైన భాగస్వామ్య పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వారిని ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభావిత జనాభా ఆరోగ్య సంరక్షణ డేటాబేస్ ను సృష్టించవలసిన అవసరాన్ని మంత్రి స్పష్టం చేశారు. ఇది పరిశోధన , శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. అప్పుడే ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టి రాబోయే తరాలను కాపాడటం సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. 

రాష్ట్ర స్థాయిలో పెద్ద సంఖ్యలో తృతీయ సంరక్షణ వైద్య అభ్యాసకులను మాస్టర్ ట్రైనర్లుగా నామినేట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిస్పందన పట్ల శ్రీ ముండా సంతోషం వ్యక్తం చేశారు. వ్యాధి గురించి అపోహలు, అనుమానాల వ్యాప్తిని నివారిస్తూనే, వ్యాధి, దాని లక్షణాలు , దాని బాధ గురించి అవగాహన పెంపొందింపచేయడానికి వైద్య నిపుణులు గిరిజన సమాజాలతో కలిసి పనిచేస్తున్నారు. తత్ఫలితంగా, ప్రజలకు సరైన సమాచారం ఇస్తున్నామమనే హామీ ఇవ్వడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవగాహన కల్పన , భాగస్వాముల కౌన్సెలింగ్  కోసం ఒక మాడ్యూల్ ను ప్రచురించడానికి వైద్య వృత్తి లో ఉన్నవారు, రోగులకు సహాయం చేసే సంస్థలు, ఇతర భాగస్వాములతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రోజు మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ మాడ్యూల్స్ ను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అవగాహన కల్పించే బృహత్తర కార్యక్రమం చేపడుతున్నామని, వివిధ స్థాయిల్లో శిక్షణ మాడ్యూల్ చివరి మైలు వరకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు. కమ్యూనిటీ స్థాయిలో నాయకులను భాగస్వాములను చేయాలని యోచిస్తున్నామని, వారు ఈ మిషన్ లో ప్రజలను మరింత విస్తృతంగా భాగస్వామ్యం చేసేలా చూడాలని యోచిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. మునుపెన్నడూ లేని విధంగా గిరిజన భాషల్లోకి అవగాహన కార్యక్రమాలను అనువదిస్తున్నామని, తద్వారా క్షేత్రస్థాయిలో సందేశాన్ని లోతుగా వ్యాప్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా గిరిజన వ్యవహారాల కార్యదర్శి అనిల్ కుమార్ ఝా మాట్లాడుతూ, రోగనిర్ధారణ పరీక్షల కోసం ప్రజలు తమను సంప్రదించేంతగా ప్రేరేపించడానికి, రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిలో మూడంచెల శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అదనంగా, రాష్ట్ర ప్రభుత్వాలు తృతీయ సంరక్షణ వైద్యులను రాష్ట్ర స్థాయిలో మాస్టర్ శిక్షకులుగా నియమించాయి, అటు జిల్లా స్థాయి లో శిక్షకులు స్థానిక ప్రభావశీలురు , అభిప్రాయ రూపకర్తలకు శిక్షణ ఇస్తారు.

అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్ జయ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం అవగాహన ప్రచారానికి నాంది పలికిందని పేర్కొన్నారు. అంతేకాకుండా, మిషన్ ప్రజా ఉద్యమంగా మారేలా చూడటానికి మంత్రిత్వ శాఖ ఈ రంగంలోని అన్ని భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతోందని ఆమె పేర్కొన్నారు. శిక్షణను మరింత ముందుకు తీసుకెళ్లాలని, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వాలని, తద్వారా సందేశాన్ని స్థానిక, గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని ఆమె మాస్టర్ ట్రైనర్లను కోరారు. చివరి మైలుకు చేరుకునేలా అన్ని స్థాయిల్లో భాగస్వాములందరినీ భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా, అవగాహన పెంచడానికి ప్రాంతీయ వర్క్ షాప్ లు , ప్రమోషనల్ క్యాంపెయిన్ లను నిర్వహించాలని , స్వాస్థ్య,  సికిల్ సెల్ కార్నర్ వంటి ఆన్ లైన్ వనరులను ఉపయోగించుకోవాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

ఈ సందర్భంగా మూడు టెక్నికల్ సదస్సులు జరిగాయి. ( I) మహారాష్ట్రలోని నాగ పూర్ మెడికల్ కాలేజీ రిటైర్డ్ ప్రొఫెసర్, కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ దీప్తి జైన్ తో  అవగాహన మాడ్యూల్స్, నివారణ చర్యగా వాటి ప్రాముఖ్యత' అనే అంశం పైన,  (2) ఢిల్లీ లోని గంగారాం ఆస్పత్రి పీడియాట్రిక్ హెమటాలజీ అండ్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ అనుపమ్ సచ్ దేవ్ తో 'సికిల్ సెల్ లో రోగ నిర్ధారణ కీలకం అనే అంశం పైన (3) నోయిడా లోని ఎస్ఎస్.పిజిఐ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నీతా రాధాకృష్ణన్ తో 'సికిల్ సెల్ వ్యాధి నివారణ , నిర్వహణలో ఆరోగ్య కార్యకర్తల పాత్ర అనే అంశాలపై టెక్నికల్ సదస్సులు జరిగాయి

ఇంటర్నేషనల్ పీడియాట్రిక్ అసోసియేషన్ (ఐపిఎ) అధ్యక్షుడు డాక్టర్ నవీన్ థాకర్, ఎయిమ్స్ దియోఘర్ డైరెక్టర్ డాక్టర్ సౌరభ్ వర్ష్నే, ఇతర వైద్య నిపుణులు, ఇతర భాగస్వాములు, కమిటీ సభ్యులందరూ ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో నెస్ట్స్ కమిషనర్ శ్రీ అసిత్ గోపాల్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ నావల్ జిత్ కపూర్, డిడిజి శ్రీ బిశ్వజీత్ దాస్, ఆరోగ్య సలహాదారు శ్రీమతి వినీతా శ్రీవాస్తవ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇతర అధికారులు పాల్గొన్నారు.

****



(Release ID: 1953371) Visitor Counter : 167


Read this release in: English , Urdu , Hindi , Tamil