ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక అక్షరాస్యతపై ఢిల్లీలో 3వ జోనల్ స్థాయి ఆలిండియా క్విజ్ ను ఏర్పాటు చేసిన భారతీయ రిజర్వు బ్యాంకు.
Posted On:
28 AUG 2023 8:55PM by PIB Hyderabad
పాఠశాల విద్యార్థులలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ), 3వ జోనల్ స్థాయి ఆలిండియా ఫైనాన్షియల్ లిటరసీ క్విజ్ను నిర్వహించింది.
ఇందులో ఢిల్లీ, జమ్ము కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రాష్ట్రస్థాయి లో గెలుపొందిన విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ క్విజ్ను మొదట బ్లాక్ స్థాయిలో ఆతర్వాత జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించారు. ఇందులో 8,9,10 తరగతులకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించారు. విద్యార్థులలో ఆర్థిక అక్షరాస్యత, అవగాహనపై మరింత ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.
మొత్తం మీద, ఈ జోన్ కిందికి వస్తున్న రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 5,312 పాఠశాలలకు చెందిన , సుమారు 10,264 మంది బ్లాకు స్థాయి నుంచి ఈ పోటీలలో పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన జోనల్ స్థాయిలో, ఎ.ఎస్.ఒ.ఎఎస్.ఇ సెక్టర్ 10, ద్వారకా, ఢిల్లీ, గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ పటుషాయి, సోగమ్ కుప్వారా, జమ్ము కాశ్మీర్, ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ సుమూర్, లెహ్, లద్దాక్, ఎయుజిఐసి, రుద్రపూర్,
ఉత్తరాఖండ్, ప్రభుత్వ ఇంటర్ కాలేజి, ఫురసత్గంజ్, అమేథి, ఉత్తరప్రదేశ్. ఉన్నాయి. ఎ.ఎస్.ఒ.ఎస్.ఇ , సెక్టర్ 10, ద్వారక, ఢిల్లీకి చెందిన శ్రీ అమన్ గుప్త, శ్రీ ఉత్కర్ష్ సుధాకర్లు విజేతలుగా నిలిచారు. వీరిని ఆర్.బి.ఐ ఎగ్జిక్యుటివ్ డైరక్టర్ దీపక్ కుమార్ ఇతర ప్రముఖుల సమక్షంలో బహుమతి ప్రదానోత్సవ సభలో సత్కరించారు. ఈ పోటీలో విజేతలు జాతీయ స్థాయిలో ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించి ఆలిండియా క్విజ్ పోటీలో పాల్గొనే అవకాశం పొందుతారు.
ఆర్థిక అక్షరాస్యత ఆర్థిక సమ్మిళతత్వానికి, కస్టమర్లకు సాధికారత కల్పించడానికి, వారు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి, తద్వారా వారు ఆర్థికంగా ప్రయోజనం పొందడానికి వీలు కల్పిస్తుంది.. ఆర్థిక సమ్మిళితత్వం అంటే ఇది ఆర్థిక సేవలు అందుబాటులో ఉండేలా, భద్రమైన, పారదర్శకత తో ఉండేలా చూస్తుంది. ఆర్థిక సమ్మిళితత్వాన్ని ముందుకు తీసుకుపోయేలో చూస్తూనే, ఆర్.బి.ఐ ఆర్థిక అక్షరాస్యత, వినియోగదారుల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటోంది.
ఆర్థికంగా చైతన్యవంతమైన, దార్ధనికతతో కూడిన సాధికారత కలిగిన ఇండియా దిశగా ఆర్.బి.ఐ, ఇతర భాగస్వాములతో కలసి, ఆర్థిక విద్య కు సంబంధించి జాతీయ వ్యూహాన్ని 2020625 సంవత్సరానికి సంబంధఙంచి రూపొందించింది.
ఇది కంటెంట్, కెపాసిటి, కమ్యూనిటీ, కమ్యూనికేషన్, కొలాబరేషన్ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టిపెడుతోంది.
ఎన్.ఎస్.ఎఫ్.ఇ డాక్యుమెంట్, ఆర్థిక రంగ రెగ్యులేటర్లు, భారత ప్రభుత్వ దార్శనికతకు మద్దతుగా ఉండేలా రూపొందించారు. ఇది సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు
తమ సొమ్మును భద్రంగా నిర్వహించుకుంటూ , తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు వీలుగా, వారు విజ్ఞానాన్ని, నైపుణ్యాలను, వైఖరులను , తమ ప్రవర్తనను, భవిష్యత్తుకు అనుగుణంగా తమ డబ్బును జాగ్రత్తగా మలచుకోవడానికి వీలుగా రూపొందించినది.
ఇలాంటి చర్యలు పిల్లలకు ఆర్థిక అక్షరాస్యతపై ఆసక్తి పెరగడానికి దోహదపడుతుంది. ఇది ఆధునిక సమాజంలో మెలగడానికి జీవన నైపుణ్యాలను అందిస్తుంది.
పిల్లలు అత్యంత సంక్లిష్ట సమాజంలో పెరుగుతున్నారు. అలాగే ఆర్థిక ప్రపంచంలో సాంకేతిక మార్పులు త్వరితగతిన వస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులు తమ ఆర్ధిక వనరులను తాముగా జాగ్రత్తగా నిర్వహించుకోవలసి ఉంటుంది. తాము పెద్ద అయ్యే కొద్ది ఉద్యోగాలు, జీవనోపాధి అవకాశౄలు పొందుతూన్న క్రమంలో తమ ఆర్థిక వనరులను తామే నిర్వహించుకోవలసి ఉంటుంది.
***
(Release ID: 1953097)
Visitor Counter : 119