మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
గువాహతి ప్రాంతీయ కేంద్రంలో ఇంట్లో పిల్లల ప్రవర్తనా సమస్యల నిర్వహణపై తల్లిదండ్రులకు వర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎన్ఐపిసిసిడి
प्रविष्टि तिथि:
25 AUG 2023 4:07PM by PIB Hyderabad
ఇంట్లో పిల్లల ప్రవర్తనా సమస్యల నిర్వహణ అన్న అంశంపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ (ఎన్ఐపిసిసిడి) తల్లిదండ్రుల కోసం 21 ఆగస్టు 2023న అస్సాం, గువాహతిలోని ఎస్‌బిఒఎ పబ్లిక్ స్కూల్ గార్చుక్‌లో నిర్వహించింది.
వర్క్‌షాప్ దిగువన పేర్కొన్న లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించింది-
పిల్లల విధ్వంసక ప్రవర్తన వెనుక ఉన్నకారణాలను అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రుల జ్ఞానాన్ని పెంపొందించడం.
గౌరవనీయమైన, అందుబాటులో ఉన్న, ఆచరణ సాధ్యమైన ప్రవర్తనా నిర్వహణ పరిష్కారాలను అందించడం.
సామాజికంగా ఆమోదితమైన ప్రవర్తనా ప్రత్యామ్నాయాల దిశగా తల్లిదండ్రుల, పిల్లల భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం.
***
(रिलीज़ आईडी: 1953077)
आगंतुक पटल : 142