వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాల బలోపేతంపై ఎస్‌ఈసీఓ స్టేట్‌సెక్రటరీ శ్రీమతి హెలెనా బడ్లిగర్ మరియు భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మధ్య విజయవంతమైన సమావేశం
प्रविष्टि तिथि:
27 AUG 2023 7:37PM by PIB Hyderabad
వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాల బలోపేతంపై భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మరియు డైరెక్టర్ ఆఫ్ ద స్టేట్ సెక్రటరీ ఫర్ ఎకానమిక్ అఫైర్స్ (ఎస్‌ఈసీఓ) స్టేట్ సెక్రటరీ శ్రీమతి హెలెనా బడ్లిగర్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశం విజయవంతంగా జరిగింది. జైపూర్‌లో జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం విజయవంతంగా ముగిసిన తర్వాత ఈ సమావేశం జరిగింది. ఇది బలమైన వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాలను పెంపొందించడంలో భారతదేశం మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్‌టిఏ) దేశాల నిబద్ధతను నొక్కి చెబుతుంది.
ఈ సమావేశంలో మంత్రి గోయల్ మరియు శ్రీమతి బుడ్లిగర్ భారత్ మరియు ఈఎఫ్‌టిఏ దేశాల మధ్య వాణిజ్య మరియు పెట్టుబడి సంబంధాల గురించి వివరణాత్మక చర్చలు జరిపారు. ఈ చర్చలు భారతదేశం మరియు ఈఎఫ్‌టిఏ మధ్య వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టిఈపిఏ) కోసం కొనసాగుతున్న చర్చలలో సాధించిన పురోగతికి సంబంధించిన సమగ్ర సమీక్షను కలిగి ఉన్నాయి.
భారత్ మరియు ఈఎఫ్‌టిఏ దేశాల మధ్య అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవహారాలను ప్రతిబింబించే పరస్పర సూత్రం ఆధారంగా పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని సాధించాలనే తమ భాగస్వామ్య దృష్టిని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ఇరు ప్రాంతాల పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక ఒప్పందాన్ని రూపొందించడానికి కీలక సమస్యలు మరియు ఆందోళనలను పరిష్కరించడం యొక్క ప్రాముఖ్యతను చర్చలు నొక్కిచెప్పాయి. టిఈపిఏ చర్చలలోని సహకార కృషి భాగస్వామ్య ప్రాముఖ్యతను మరియు ఈ చర్చల విజయాన్ని నిర్ధారించడానికి రెండు పార్టీల అంకితభావాన్ని నొక్కి చెబుతుంది.
రెండు ప్రాంతాల మధ్య చిరకాల స్నేహం మరియు సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ భారతదేశం-ఈఎఫ్‌టిఏ వాణిజ్య సంబంధాలలో సానుకూల ముందడుగును ఈ సమావేశం ఫలితాలు సూచిస్తున్నాయి. వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాలను మరింతగా పెంచుకోవాలనే నిబద్ధత భారతదేశం మరియు ఈఎఫ్‌టిఏ దేశాల ఆర్థిక వృద్ధి మరియు శ్రేయస్సుకు మంచి సూచన.
***
(रिलीज़ आईडी: 1952770)
आगंतुक पटल : 179