వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

బాస్మతి బియ్యం గా తప్పుగా చూపించి జరుగుతున్న బాస్మతి యేతర తెల్ల బియ్యం ఎగుమతులు అరికట్టడానికి నిరోధించడానికి బాస్మతి బియ్యం ఎగుమతులపై అదనపు ఆంక్షలు విధించిన కేంద్రం

Posted On: 27 AUG 2023 12:17PM by PIB Hyderabad

దేశంలో ధరలు నియంత్రించిఆహార భద్రత కల్పించడానికి దేశం నుంచి జరుగుతున్న బియ్యం ఎగుమతులు నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా 2023 జూలై 20 నుంచి  బాస్మతి యేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. 

కొన్ని రకాల బియ్యం ఎగుమతిపై నియంత్రణ  ఉన్నప్పటికీ  ప్రస్తుత సంవత్సరంలో బియ్యం ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. 2023   ఆగస్టు 17 వరకు మొత్తం 7.33 ఎంఎంటీ బియ్యం  ఎగుమతులు ( ఎగుమతి నిషేధించిన నూకలు మినహా ఇతర రకాల బియ్యం)  జరిగాయి. గత  సంవత్సరం ఇదే కాలంలో 6.37ఎంఎంటీ బియ్యం  ఎగుమతి అయింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది ఎగుమతులు  15.06% పెరిగాయి. ఉప్పుడు బియ్యం,  బాస్మతి బియ్యం ఎగుమతి కూడా పెరిగింది.  ఈ రెండు రకాలు ఎగుమతులపై ఎటువంటి ఆంక్షలు  లేవు. ఉప్పుడు బియ్యం   బియ్యం ఎగుమతి 21.18% పెరిగింది (గత సంవత్సరంలో 2.72 ఎంఎంటీ  తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో 3.29 ఎంఎంటీ  ), బాస్మతి బియ్యం ఎగుమతి 9.35% పెరిగింది (ప్రస్తుత సంవత్సరంలో 1.86 ఎంఎంటీ  - గత సంవత్సరం 1.70ఎంఎంటీ  ).  9 సెప్టెంబర్ 2022 నుంచి 20% ఎగుమతి సుంకం విధిస్తున్న బాస్మతి యేతర తెల్ల బియ్యం ఎగుమతిని  2023 జూలై 20  నుంచి కేంద్రంనిషేధించింది. ఈ రకం బియ్యం ఎగుమతులు   కూడా 4.36% పెరిగాయి.  (గత సంవత్సరంలో 1.89 ఎంఎంటీ  ఈ సంవత్సరం  1.97ఎంఎంటీ  ).  వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ రూపొందించిన ముందస్తు  మూడవ  అంచనా ప్రకారంప్రస్తుత రబీ సీజన్ లో 13.84% ఉత్పత్తి తగ్గింది.  2022-23లో 2021-22  రబీ సీజన్‌లో ఉత్పత్తి  184.71 ఎల్ఎంటీ గా ఉంది. 2022-23 రబీ సీజన్‌లో ఉత్పత్తి  158.95 ఎల్ఎంటీ   మాత్రమే ఉంటుందని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. 

 ఆసియా కొనుగోలుదారుల నుండి బలమైన డిమాండ్ కారణంగాథాయ్‌లాండ్ వంటి కొన్ని ప్రధాన ఉత్పత్తి దేశాలలో 2022/23లో తగ్గిన  ఉత్పత్తిఎల్ నినో ప్రారంభం వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది అనే  భయం కారణంగాఅంతర్జాతీయంగా   బియ్యం ధరలు కూడా గత సంవత్సరం నుంచి  నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.ఎఫ్ఏఓ  బియ్యం ధర సూచిక జూలై 2023లో 129.7 పాయింట్లకు చేరుకుంది. 2011 సెప్టెంబర్  తర్వాత బియ్యం ధర సూచిక అత్యధిక విలువ నమోదు చేసింది.  గత సంవత్సరం స్థాయిలతో పోలిస్తే 19.7% పెరుగుదలను నమోదు చేసింది. భారతీయ బియ్యం ధరలు అంతర్జాతీయ ధరల కంటే ఇప్పటికీ తక్కువగా ఉండడంతో  ఉన్నందున భారతీయ బియ్యానికి ఎక్కువ  డిమాండ్ ఉందిదీని ఫలితంగా 2021-22, 2022-23 లో రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిగాయి.

బాస్మతి యేతర తెల్ల బియ్యంతప్పుడు వర్గీకరణఅక్రమ ఎగుమతి గురించి ప్రభుత్వం విశ్వసనీయనివేదికలు అందాయి.  బాస్మతి యేతర తెల్ల బియ్యం   ఎగుమతిపై 2023 జూలై 20  నుంచి కేంద్రం నిషేధం విధించింది.   దంపుడు బియ్యంబాస్మతి బియ్యం హెచ్ఎస్ కోడ్‌ల క్రింద బాస్మతీయేతర తెల్ల బియ్యం   ఎగుమతి అవుతున్నట్లు నివేదికలు అందాయి. 

వ్యవసాయప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ ( ఏ పెడా)  బాస్మతి బియ్యం ఎగుమతి నియంత్రణ బాధ్యత వహిస్తుందిదీనికోసం  సంస్థ  వెబ్ ఆధారిత వ్యవస్థను కలిగి ఉంది,  బాస్మతి బియ్యం పేరుతో  తెల్ల బాస్మతి యేతర బియ్యం అక్రమ ఎగుమతులు: నిరోధించడానికి క్రింది చర్యలు అమలు చేయాలని సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

   i.        బాస్మతి బియ్యం  ఎగుమతుల కోసం ఒక ఎంటీ కి USD 1200 మరియు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన కాంట్రాక్టులు మాత్రమే  రిజిస్ట్రేషన్ - కమ్ - కేటాయింపు సర్టిఫికేట్ (RCAC) జారీ కోసం నమోదుచేయాలి 

  ii.        ఎంటీ కి   USD 1200 కంటే తక్కువ విలువ కలిగిన ఒప్పందాలను తాత్కాలికంగా రద్దు చేయాలి.  ధరలలో వైవిధ్యం,  బాస్మతి యేతర తెలుపు ఎగుమతి కోసం ఉపయోగిస్తున్న విధానాన్ని పరిశీలించడానికి  ఏ పెడా  చైర్మన్ నియమించిన కమిటీ నివేదిక అందిన తర్వాత  ఈ అంశంపై తదుపరి చర్య తీసుకోవాలి.   ప్రస్తుత నెలలో  బియ్యం   సగటు ఎగుమతి ధర ఎంటీ కి   USD 1214 ఉన్న నేపథ్యంలో బాస్మతి  కాంట్రాక్ట్ ధరలో అత్యల్ప కాంట్రాక్ట్ ధర ఎంటీ కి  USD 359 ఎగుమతి చేయడంలో పెద్ద వ్యత్యాసం ఉందని ప్రభుత్వం గుర్తించింది.  కమిటీ తన నివేదికను ఒక నెల వ్యవధిలో సమర్పించాల్సి ఉంటుంది. నివేదిక  తర్వాత   తక్కువ ధరకు  బాస్మతి బియ్యం  ఎగుమతులపై పరిశ్రమ నుంచి అందిన ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకోవాలి.  

iii.        నూతన మార్గదర్శకాలువిధానాలపై పరిశ్రమ వర్గాలతో వ్యవసాయప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించడానికి చర్యలు అమలు చేయాలి. బాస్మతి యేతర తెల్ల బియ్యం ఎగుమతి కోసం తప్పుడు విధానాలు అమలు కాకుండా చూసేందుకు తగిన చర్యలు అమలు చేయాలి. 

 

***



(Release ID: 1952697) Visitor Counter : 160