రక్షణ మంత్రిత్వ శాఖ
దక్షిణాఫ్రికాలోని డర్బన్ నౌకాశ్రయాన్ని సందర్శించిన ఐఎన్‌ఎస్ సునయన
प्रविष्टि तिथि:
26 AUG 2023 11:29AM by PIB Hyderabad
ఈ నెల 21-25 తేదీల్లో, దక్షిణాఫ్రికాలోని డర్బన్ నౌకాశ్రయాన్ని ఐఎన్‌ఎస్ సునయన సందర్శించింది. ప్రధాన మంత్రి దార్శనికత అయిన 'సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇది ది రీజియన్'కు (సాగర్) అనుగుణంగా, సముద్ర భాగస్వామ్య దేశంతో భారతదేశ సంబంధాన్ని బలోపేతం చేసింది. సందర్శన సమయంలో, భారత నౌకాదళం & దక్షిణాఫ్రికా నౌకాదళ సిబ్బంది మధ్య వృత్తిపరమైన, శిక్షణ కార్యక్రమాలు, డెక్ సందర్శనలు, క్రీడాపోటీలు జరిగాయి. నావిగేషన్, ఆయుధ యుద్ధం, నష్ట నివారణ, సోదాలు & జప్తులు వంటి అంశాలపై ఉమ్మడి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. 'వసుదైక కుటుంబం' సందేశంతో, దక్షిణాఫ్రికా నౌకాదళ సిబ్బందితో కలిసి ఐఎన్‌ఎస్ సునయనలో సంయుక్త యోగా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.
ఈ నెల 23న ఐఎన్‌ఎస్ సునయనలోకి సందర్శకులను అనుమతించారు. డర్బన్‌లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డా.థెల్మా జాన్ డేవిడ్ నౌకను సందర్శించారు. నౌక పాత్ర & సామర్థ్యం గురించి తెలుసుకున్నారు.
ఐఎన్‌ఎస్ సునయన నౌకాశ్రయం నుంచి తిరిగి బయలుదేరినప్పుడు, దక్షిణాఫ్రికా నౌకాదళ నౌక ఎస్‌ఏఎస్ కింగ్ సెఖుఖునే Iతో కలిసి సముద్ర భాగస్వామ్య విన్యాసాలు (ఎంపీఎక్స్) చేపట్టింది.
ఈ సందర్శన విజయవంతంగా సాగడం, సముద్ర రంగంలో సహకారం & భాగస్వామ్యాన్ని పెంచుకోవడంలో రెండు నౌకాదళాల నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.
AKN4.JPG)
9DKJ.JPG)
***
(रिलीज़ आईडी: 1952505)
आगंतुक पटल : 149