శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నరోడా.. ఖుర్జాలోని ‘సిసిఎస్‌ఐఆర్‌-సిజిసిఆర్ఐ’ ఔట్రీచ్ సెంటర్లలో ‘ఒక వారం-ఒక ల్యాబ్’ కార్యక్రమం కింద ‘ఓపెన్ డే.. సోషల్ కనెక్ట్’

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2023 1:32PM by PIB Hyderabad

   “ఒక వారం-ఒక ల్యాబ్‌” కార్యక్రమం కింద నరోడా (గుజరాత్) ఖుర్జా (ఉత్తరప్రదేశ్)లోని ‘సిసిఎస్‌ఐఆర్‌-సిజిసిఆర్ఐ’ ఔట్రీచ్ సెంటర్లలో 2023 ఆగస్టు 24న వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. నరోడాలో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఎన్‌ఐడి, జియు’సహా వివిధ విద్యా సంస్థల నుంచి 65 మందికిపైగా విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సోన్యా గ్రూప్‌ సంస్థల అధిపతి శ్రీ రూపేష్‌భాయ్ షా ముఖ్య అతిథిగా, విద్రెస్ ఇండియా సంస్థ నుంచి శ్రీ జి.జి.త్రివేది విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ‘సిసిఎస్‌ఐఆర్‌-సిజిసిఆర్ఐ’ డైరెక్టర్ డాక్టర్ సుమన్ కుమారి మిశ్రా ఆహూతులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం అనంతరం వారంతా వివరణాత్మక ప్రయోగశాల సందర్శనకు వెళ్లారు.

 అలాగే ఖుర్జా కేంద్రంలోనూ ఇదే తరహా కార్యక్రమం నిర్వహించారు. బులంద్‌షహర్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీ కుల్దీప్ మీనా దీనికి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ‘కెపిఎంఎ’ అధ్యక్షుడు శ్రీ ఆర్‌.రన్నా ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అలాగే విద్యార్థులు, కళాకారులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

ఎగువ చిత్రమాలిక: నరోడా కేంద్రంలో కార్యక్రమాలు

దిగువ చిత్రమాలిక: ఖుర్జా కేంద్రంలో కార్యక్రమాలు

*****


(రిలీజ్ ఐడి: 1952351) సందర్శకుల సూచీ సంఖ్య : : 173
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी