సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
"ఇండియా వచ్చేసింది! భారతదేశంలో జరుగుతున్న అత్యంత శుభ సమయాల్లో ఇది ఒకటి" : కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
భారతదేశం ఇతర దేశాలతో సమానంగా నిలబడటమే కాకుండా, ప్రపంచానికి నాయకత్వం వహించగలదని నిరూపించే సమయం ఆసన్నమయింది: డాక్టర్ జితేంద్ర సింగ్
“ప్రధాని మోదీ గత సంకెళ్లను విచ్ఛిన్నం చేసి భారతదేశాన్ని స్వేచ్చాయుత అభివృద్ధి పథంలో ఉంచారు”
Posted On:
25 AUG 2023 6:24PM by PIB Hyderabad
‘భారత్ వచ్చేసింది,‘ అన్నారు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్. “భారత్ లో సంభవిస్తున్న అత్యంత శుభ సమయాల్లో ఇదొకటి” అని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
“ఈ ఏడాది జీ20 గ్రూప్ కు భారత్ ఆతిథ్యమిస్తోంది. కొద్ది రోజులలో ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 సదస్సుకు ఇండియా ఆతిథ్యం ఇస్తోంది; అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం కూడా ఈ ఏడాది జరుపుకుంటున్నాం. ప్రధాన మంత్రి పిలుపు మేరకు రెండవ సారి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఆగస్టు 15 న 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం తరువాత మనం అమృత్ కాల్ లోకి ప్రవేశించాము. ఈ వారం కేవలం రెండు రోజుల క్రితమే చంద్రయాన్ పూర్తి అయింది” అని ఆయన అన్నారు.
భారత్ ఇతర దేశాలతో సమానంగా నిలవడమే కాకుండా ప్రపంచానికి నాయకత్వం వహించగలదని నిరూపించే సమయం ఆసన్నమైందని జితేంద్ర సింగ్ అన్నారు.
ఇండోర్ లో ఇ-గవర్నెన్స్ పై రెండు రోజుల పాటు జరిగిన 26వ జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి(స్వతంత్ర హోదా) పిఎంఒ , పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు.
ప్రధాని మోడీ గత సంకెళ్లను విచ్ఛిన్నం చేసి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ప్రధాని మోదీ అంతరిక్ష రంగానికి ద్వారాలు తెరిచారని, నేడు ఈ రంగం లో 150కి పైగా ప్రైవేట్ స్టార్టప్ లు ఉన్నాయని ఆయన చెప్పారు.
పరిపాలనా సంస్కరణలు గురించి ప్రస్తావిస్తూ, గత తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని జితేంద్ర సింగ్ తెలిపారు.
కోవిడ్ కాలంలో జనజీవనం స్తంభించిపోయిందని, కానీ భారత ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగంలో ఎలాంటి జాప్యం జరగలేదని, ఎందుకంటే మనం ఇప్పటికే డిజిటల్ లోకి వెళ్లామని, ఇతరులు ఇంకా అందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.డీబీటీ ద్వారా సామాన్యులకు ప్రయోజనాలను బదిలీ చేయడాన్ని ఆయన ప్రస్తావించారు.
'కనీస ప్రభుత్వం - గరిష్ట పాలన' అనే మంత్రాన్ని ప్రధాని మనకు ఇచ్చారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గెజిటెడ్ అధికారులు అటెస్టేషన్ చేసే పద్ధతిని తొలగించడం, ఇంటర్వ్యూలలో అవకతవకలను రద్దు చేయడం వంటి చొరవలను డిఎఆర్ పి జి చేపట్టింది. ఎక్కువ పనులను ఆన్ లైన్ చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం, పౌరుల భాగస్వామ్యాన్ని తీసుకురావడానికి, మానవ ఇంటర్ ఫేస్ ను కనీస స్థాయికి కుదించారు.
డి ఒ పి పి డబ్ల్యూ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (డీఎల్ సీ) ని, ఆ తర్వాత ఆధార్ ఆధారిత పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. తొలుత బయోమెట్రిక్ పరికరాల ద్వారా డీఎల్ సీల సమర్పణ జరగ్గా, ఇప్పుడు యూఐడీఏఐ ఆధార్ సాఫ్ట్ వేర్ ఆధారంగా ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టారు.
పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం గురించి మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛమైన, సమర్థవంతమైన ప్రభుత్వానికి ప్రామాణికం బలమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం అని అన్నారు. ఈ ప్రభుత్వం కాలపరిమితితో కూడిన పరిష్కార విధానాన్ని అనుసరించి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నందున సీపీజీఆర్ఎఎంఎస్ కు ఏటా 20 లక్షల ఫిర్యాదులు వస్తున్నాయని, వస్తుండగా, గతంలో కేవలం 2 లక్షల ఫిర్యాదులు మాత్రమే వచ్చేవని కేంద్ర మంత్రి తెలిపారు.
భూ నమోదులో పారదర్శకతను తీసుకువచ్చే డిజిలాకర్, స్వమిత్వా పథకాలను ఈజ్ ఆఫ్ లివింగ్ దిశగా టెక్నాలజీ ఆధారిత సంస్కరణల్లో ఒకటిగా డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఇ-గవర్నెన్స్ లో డిజిటల్ మార్పుల సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ వేగం, పరిమాణంతో దీన్ని సాధిస్తామని చెప్పారు.
***
(Release ID: 1952298)
Visitor Counter : 178