సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
'ఆత్మనిర్భర్ భారత్' కు సాధికారత కల్పించడం: 'ఖాదీ రక్షా సూత్' (ఖాదీ-రాఖీ) ని ఒక ముందడుగు గా పరిచయం చేయడం"
Posted On:
23 AUG 2023 6:14PM by PIB Hyderabad
రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి) చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ ఈ రోజు న్యూఢిల్లీ లో 'ఖాదీ రక్షా షూట్ సూత్' (ఖాదీ-రాఖీ) ని ప్రారంభించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ 'ఖాదీ రక్షా షూట్' (ఖాదీ-రాఖీ) ని ప్రవేశపెట్టడం జరిగింది. 'జాతీయ చేనేత దినోత్సవం' సందర్భంగా 2023 ఆగష్టు, 7వ తేదీన న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, రాబోయే పండుగ వేడుకల కోసం ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా గ్రామీణ కళాకారులకు హృదయపూర్వకంగా మద్దతు ఇవ్వాలని, తద్వారా భారతదేశం లోని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఉపాధి అవకాశాలను కల్పించాలని పౌరులను కోరారు.
ఈ సందర్భంగా శ్రీ మనోజ్‌కుమార్ మాట్లాడుతూ, చరఖాపై పలు దారాలను తిప్పుతూ గ్రామీణ భారతదేశం లోని అంకితభావంతో కూడిన నూలు వడికే నేత సోదరీమణులు 'ఖాదీ రక్షా షూట్' (ఖాదీ-రాఖీ) ని రూపొందించడం ఒక విశేషమని చెప్పారు. ఈ ఉత్పత్తి పూర్తిగా సహజమైనది, ఎటువంటి రసాయన సంకలనాలు లేనిది. ఉదాహరణకి, ఉత్తరప్రదేశ్ లోని అంబేద్కర్ నగర్ కు చెందిన గ్రామోద్యోగిక్ వికాస్ సంస్థాన్ రూపొందించిన రాఖీ పవిత్రమైన స్వదేశీ గోమాత పేడ నుండి రూపొందించడం జరిగింది. తులసి, టొమాటో, వంగ గింజలను అదనంగా చేర్చడం వల్ల దాని కూర్పు మరింత మెరుగయ్యింది. వీటిని భూమిలో పారేసినప్పుడు, అవి తులసి, టమోటా, వంగ మొక్కలుగా మొలకెత్తుతాయనే భావనతో వీటిని తయారు చేయడం జరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తయారైన అటువంటి 'ఖాదీ రక్షా షూట్' (ఖాదీ-రాఖీ) లు ఇప్పుడు న్యూఢిల్లీలోని ఖాదీ భవన్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి, వాటి ధరలు ఒక్కొక్కటి 20 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ఉన్నాయి.
విలేఖరుల సమావేశంలో శ్రీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం 'ఖాదీ రక్షా షూట్' (ఖాదీ-రాఖీ) లను 'పైలట్-ప్రాజెక్ట్' గా న్యూ ఢిల్లీలోని ఖాదీ భవన్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. రాబోయే సంవత్సరంలో 'ఖాదీ రక్షా షూట్' (ఖాదీ-రాఖీ) లను దేశవ్యాప్తంగా విక్రయించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖాదీ ద్వారా భారతదేశ జాతీయ వారసత్వ విశిష్టతను తెలియజేసే 'ఖాదీ రక్షా షూట్' (ఖాదీ-రాఖీ) లను స్వీకరించి, ఆమోదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలా చేయడం ద్వారా, దేశ ప్రజలు భారతదేశ విశిష్ట వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు, మన గౌరవనీయమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఊహించిన విధంగా 'ఆత్మనిర్భర్-భారత్' దార్శనికతను ఆచరించిన వారవుతారు.
మన జాతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న ఖాదీ ప్రాముఖ్యత గురించి, భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఖాదీ పోషించిన కీలక పాత్ర గురించి శ్రీ మనోజ్ కుమార్ ప్రముఖంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఖాదీ గత తొమ్మిదేళ్లుగా 'స్వర్ణయుగం' లోకి ప్రవేశించి, పూర్వ వైభవాన్ని పొందింది. గత ఆర్థిక సంవత్సరంలో, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయం 1.34 లక్షల కోట్ల రూపాయలను అధిగమించింది. దీనికి తోడు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, 9.5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించడం ద్వారా, ఖాదీ చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. ఖాదీ యొక్క ఈ కొత్త శక్తితో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'న్యూ ఇండియాస్ న్యూ ఖాదీ' ని దుస్తులకు చిహ్నంగా మాత్రమే కాకుండా, 'ఆయుధంగా' కూడా రూపొందించారని ఆయన నొక్కి చెప్పారు. ఈ ఆయుధాన్ని పేదరికానికి వ్యతిరేకంగా ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా, చేతివృత్తుల వారికి సాధికారత కల్పించడం, ఆహార భద్రతను నిర్ధారించడం, మహిళా సాధికారతను పెంపొందించడం, నిరుద్యోగాన్ని నిర్మూలించడంపై దృష్టి సారించడం జరిగింది.
2014 నుండి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, తమ ప్రముఖ రేడియో కార్యక్రమం 'మన్-కీ-బాత్' ద్వారా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను ఆదరించేలా మన దేశ పౌరులను ప్రోత్సహించారు. ఖాదీ పరిశ్రమ పరివర్తనాత్మక పునరుజ్జీవనానికి లోనవడంతో ఈ ప్రయత్నం యొక్క ప్రభావం విశేషమైనది. 2013-14 సంవత్సరానికి ముందు క్షీణించిన రంగం ఇప్పుడు కొత్త పునరుజ్జీవనాన్ని చవిచూసింది. గ్రామీణ కళాకారుల నైపుణ్యం గుర్తింపు పొందడంతో పాటు, వారి నైపుణ్యానికి తగిన ఆర్థిక ప్రోత్సాహం కూడా ఇప్పుడు అందుతోంది. హస్త కళాకారులను ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఈ నిబద్ధతకు అనుగుణంగా, కె.వి.ఐ.సి. 'ఖాదీ రక్షా షూట్' (ఖాదీ-రాఖీ) లను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. రక్షాబంధన్ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, మనం పండుగను జరుపుకుంటున్నప్పుడు మన మణికట్టుపై 'ఖాదీ రక్షా షూట్' (ఖాదీ-రాఖీ) ని కట్టుకునే అవకాశం తో పాటు, గ్రామీణ భారతదేశంలోని మహిళా కళాకారుల ముఖాల్లో కొత్త చిరునవ్వును తీసుకురావడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించాలి.
*****
(Release ID: 1951983)
Visitor Counter : 164