మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
మత్య్స, ఆక్వాకల్చర్ క్షేత్రంలో భారత్, నార్వేల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాల నేతృత్వంలో నార్వేలో పర్యటించిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం
నాణ్యమైన, వైవిధ్యభరితమైన భారత ఆక్వాకల్చర్, మత్స్య ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌లో ప్రోత్సహిస్తున్న భారతీయ ప్రదర్శకుల కృషిని ప్రశంసించిన శ్రీ పర్షోత్తమ్ రూపాల
ప్రయోగ కేంద్రాన్ని సందర్శించి, ఎన్‌టిఎన్‌యు చేపడుతున్న అత్యాధునిక పరిశోధనను, ఆవిష్కరణలను వీక్షించిన ప్రతినిధి బృందం
స్కేల్ ఎక్యూ కేజ్ కల్చర్ ప్రదర్శన జోన్‌ను వీక్షించి, ఆక్వాకల్చర్, మత్స్య రంగంలో సహకారానికి, భాగస్వామ్యానికి అవకాశం గల సంభావ్య అంశాలపై చర్చించిన ప్రతినిధి బృందం
Posted On:
23 AUG 2023 5:18PM by PIB Hyderabad
భారత్- నార్వేల మధ్య మత్స్య,ఆక్వా కల్చర్ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా నేతృత్వంలో కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి మంత్రిత్వ శాఖసహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, మత్య్స విభాగం సంయుక్త కార్యదర్శి నీతూ కుమార్ ప్రసాద్, ఇతర సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం నార్వేలో పర్యటిస్తోంది. మంగళవారం క్లోస్టెర్గాటాలోని త్రోంఢీమ్ స్పెక్ట్రమ్ లో జరిగిన ఆక్వా కల్చర్ సాంకేతిక, ఆవిష్కరణల కోసం ఉద్దేశించిన అతిపెద్ద వాణిజ్య ప్రదర్శనలలో ఒకటి అయిన ఆక్వా నార్ 2023 వాణిజ్య ప్రదర్శన ప్రారంభ కార్యక్రమానికి హాజరైన అనంతరం, ప్రపంచ ఆక్వాకల్చర్ పరిశ్రమకు జన్యు సంబంధ మూల సామాగ్రి, ఫలదీకరణ గుడ్లను అభివృద్ధి, ఉత్పత్తి చేసి అందచేసే పరిశోధన ఆధారిత పెంపక కంపెనీని ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ రంగంలో ఉమ్మడి సహకారానికి గల అవకాశాలను గురించి ఆక్వాజెన్ సిఇఒ నట్ రోఫ్లోతో శ్రీ పర్షోత్తమ్ రూపాల, డాక్టర్ ఎల్, మురుగన్ చర్చించారు.
మత్య్స, ఆక్వా కల్చర్‌కు సంబంధించిన ఉత్పత్తులు సేవలను ప్రదర్శించడం ద్వారా ఈ ప్రదర్శనలో పాలు పంచుకున్న భారతీయులతో శ్రీ పర్షోత్తమ్ రూపాల, డాక్టర్ ఎల్, మురుగన్ తో కలిసి ముచ్చటించారు. నాణ్యమైన, వైవిధ్యభరితమైన భారతీయ ఆక్వాకల్చర్, మత్స్య ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌లో ప్రదర్శించి, ప్రోత్సహిస్తున్నందుకు భారతీయ ప్రదర్శకులు చేస్తున్న కృషిని కేంద్రమంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా అభినందించారు. అలాగే, ఆక్వా కల్చర్, మత్య్స రంగంలో సహకారానికి గల అవకాశాలు సహా వివిధ అంశాలపై ప్రతినిధి బృందం చర్చించింది.
భారతీయ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి మంగళవారం నాడు నార్వేలోని ఎన్‌టిఎన్‌యు సీలాబ్‌ను సందర్శించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. సముద్ర శాస్త్రం, సాంకేతికతలో నిపుణులైన ప్రొఫెసర్ జెలింగె రీటన్, ప్రొఫెసర్ బెంట్ ఫిన్‌స్టాడ్‌లు ప్రతినిధులకు విషయానలను వివరించారు. ఎన్‌టిఎన్‌యు సీలాబ్ అన్నది బహుశాస్త్రాంతర పరిశోధన కేంద్రం. నీలి ఆర్ధిక వ్యవస్థకు నిలకడైన పరిష్కరాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇది పని చేస్తుంది. ప్రతినిధి బృందం నార్వేలోని అతిపెద్ద శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయమైన ఎన్‌టిఎన్‌యు ప్రయోగశాలను సందర్శించి, అక్కడ చేపడుతున్న అత్యాధునిక పరిశోధనలను, ఆవిష్కరణలను వీక్షించారు.
తమ పర్యటన సందర్భంగా, ప్రతినిధి బృందం, ఆక్వాకల్చర్ సాంకేతికత, ఆవిష్కరణలలో ప్రముఖ కంపెనీ అయిన స్కేల్ ఎక్యూకు చెందిన కేజ్ కల్చర్ జోన్ ప్రదర్శనను వీక్షించింది. అనంతరం స్కేల్ ఎక్యూ సీనియర్ మేనేజ్‌మెంట్‌తో ముచ్చటించి, ఆక్వాకల్చర్, మత్స్య రంగాలలో సహకారానికి, భాగస్వామ్యానికి అవకాశమున్న సంభావ్య అంశాలపై చర్చించారు.
చేపల పెంపకంలో పరిష్కారాలు, పంజరాలు, హ్యాచరీ వ్యవస్థలు, సాల్మన్ పరిశ్రమకు ప్రత్యేక పరికరాలు సహా స్కేల్ ఎక్యూ అందించే పలు ఉత్పత్తులు, సేవలపై ప్రతినిధి బృందానికి వివరించారు. దీనితో పాటుగా బృందం, ఆక్వాకల్చర్ ఉత్పాదకతను, సుస్థిరతను పెంచేందుకు స్కేల్ఎక్యూ ఉపయోగించిన కొన్ని వినూత్న సాంకేతికతల ప్రత్యక్ష ప్రదర్శనను కూడా వీక్షించింది.
అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఆవిష్కరణ, సాంకేతిక, పరికరాలను అందించే స్కేల్ఎక్యూ అందచేసే వివిధ ఉత్పత్తులు, సేవల గురించి ప్రతినిధి బృందానికి వివరించారు. సహకారానికి, భాగస్వామ్యానికి అవకాశమున్న సంభావ్య అంశాలపై స్కేల్ ఎక్యూ సీనియర్ మేనేజ్‌మెంట్‌తో ప్రతినిధి బృందం చర్చించింది. ఈ పర్యటన ఫలవంతం, ఉపయుక్తంగా జరిగింది. ఆక్వా కల్చర్ రంగంలో భారత్ - నార్వేల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న ఆసక్తిని ఇరు పక్షాలూ ఆసక్తిని వ్యక్తం చేశాయి.
****
(Release ID: 1951963)
Visitor Counter : 109