కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఇంటర్నెట్ పరివర్తన శక్తిని ప్రదర్శించే భారత్ ఇంటర్నెట్ ఉత్సవ్ అధికసంఖ్యాకులు పాల్గొనడంతో విజయవంతంగా ముగిసింది.

Posted On: 22 AUG 2023 6:06PM by PIB Hyderabad

       "భారత్ ఇంటర్నెట్ ఉత్సవ్" విజయవంతంగా ముగిసినట్లు టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) ప్రకటించడం ఎంతో సంతోషకరమైన విషయం.  ఈ ఉత్సవ్ దేశంలోని వివిధ ప్రాంతాలకు / నలుమూలలకు చెందిన పౌరులను ఒకచోట చేర్చింది.  వారంతా ఇంటర్నెట్ వారి జీవితాలను ఎలా మార్చేసిందో  తమ తమ కథలు/వీడియోలను పంచుకున్నారు.  టెలికమ్యూనికేషన్స్ శాఖ MYGOV సహకారంతో 45 రోజుల పాటు నిర్వహించిన  ఈవెంట్ కు ప్రజల నుంచి అఖండమైన స్పందన లభించింది.  24,000 మందికి పైగా పాల్గొని తమ జీవితాల్లో ఇంటర్నెట్ తెచ్చిన పరివర్తన గురించి కథలు/వీడియోలు పంపారు.  ఈ ఉత్సవ్ సామాజిక-ఆర్థిక అభివృద్ధిపై ఇంటర్నెట్
కలిగించిన తీవ్ర ప్రభావాన్ని నొక్కి చెప్పింది.

         భారత్ ఇంటర్నెట్ ఉత్సవ్‌లో పాల్గొని  తమ కథలు/వీడియోలను పంచుకున్న ప్రతి ఒక్కరికీ MYGOV భాగస్వామ్యంలో DoT తన ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తోంది.   అధిక సంఖ్యలో వచ్చిన (24,128) ఎంట్రీలలో వ్యక్తిగత జీవితాలు, సమాజాలు, మొత్తం మీద దేశం పురోగతిపై ఇంటర్నెట్ ప్రభావాన్ని గురించిన విస్తృతమైన గుర్తింపును ప్రతిబింబిస్తున్నది.

      భారత్ ఇంటర్నెట్ ఉత్సవ్ ప్రారంభించిన  జూలై 7, 2023వ తేదీ నుంచి  ఆగస్టు 21వ తేదీ వరకు భారతదేశం నలుమూలల నుంచి వ్యక్తులు, సమాజాలు,  సంస్థల నుండి అసాధారణమైన కథనాలు/వీడియోలు అందాయి.  మునుపెన్నడూ లేని రీతిలో పురోగతి, సంధాయకత, జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ఇంటర్నెట్ తమ రోజువారీ జీవితంలో అంతర్భాగంగా ఎలా మారిందో ఆయా వ్యక్తులు పంపిన  ఈ హృదయపూర్వక వీడియోలు వెల్లడిస్తాయి.  ఈ ఈవెంట్ విద్య, ఆరోగ్య సంరక్షణ , వ్యవస్థాపకత మరియు సాంస్కృతిక పరిరక్షణ వరకు విభిన్న రంగాలలో విస్తరించిన కథలు / కథనాలను సంగ్రహించగలిగింది.

       భారత్ ఇంటర్నెట్ ఉత్సవ్ ముగిసినందున అత్యంత ప్రభావవంతమైన ఉత్తమ కథలు / వీడియోలను ఎంచుకోవడానికి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించారు.  కథలు / వీడియోల ఎంట్రీలు పంపినవారిలో విజేతలను నిర్ణయించడానికి జ్యూరీ ప్రతి ఎంట్రీని  నిశితంగా పరిశీలిస్తుంది. విజేతలకు ప్రశంసలతో పాటు ఈ కింది విధంగా నగదు పారితోషకంతో సత్కరించడం జరుగుతుంది:

ఎ)  మూడు (3) ఉత్తమ కథలు/వీడియోలకు సర్టిఫికెట్ తో పాటు వరుసగా రూ.15,000, రూ.10,000, రూ.5000 నగదు బహుమతి ఇవ్వడం
       జరుగుతుంది.

బి)  ప్రతి రాష్ట్రం /కేంద్రపాలిత ప్రాంతం నుండి ఒక ఉత్తమ కథ / వీడియోకు సర్టిఫికేట్‌తో పాటు రూ. 1,000 నగదు
       బహుమతి ఇవ్వడం జరుగుతుంది.

సి)  అంతేకాకుండా మరో 10 ఉత్తమ కథలు / వీడియోలకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు.

డి)   భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో  ఈ కథలు  / వీడియోలు ప్రదర్శించడం జరుగుతుంది.

        ప్రతి పౌరునికి సురక్షితమైన, విశ్వసనీయమైన, అందుబాటైన ధరల్లో టెలికమ్యూనికేషన్ సేవలను అందించడానికి టెలికమ్యూనికేషన్ శాఖ నిబద్ధతను భారత్ ఇంటర్నెట్ ఉత్సవ్ యొక్క అఖండ విజయం పునరుద్ఘాటిస్తుంది.  డిజిటల్ యుగం ప్రయోజనాలు దేశంలోని సుదూర ప్రాంతాలకు చేరేలా నిశ్చయపరుస్తుంది.    

        భారత్ ఇంటర్నెట్ ఉత్సవ్ గురించిన  మరిన్ని తాజా వివరాలు, సమాచారం కోసం దయచేసి https://innovateindia.mygov.in/bharat-internet-utsav/ వెబ్సైట్ సందర్శించండి.  



 

*****



(Release ID: 1951591) Visitor Counter : 95


Read this release in: English , Urdu , Hindi