సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సిబ్బందికి బ్యాంకర్ల అవగాహనా వర్క్‌షాప్‌ను నిర్వహించిన పెన్షన్‌, పెన్షనర్ల సంక్షేమ విభాగం (డిఒపిపిడబ్ల్యు)


పెన్షనర్ల సులభతర జీవనానికి సంబంధించి, భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అవగాహనను పెంచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది.

Posted On: 18 AUG 2023 5:05PM by PIB Hyderabad

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ బ్రాంచిలలో పెన్షన్‌ సంబంధిత పనులు చూసే సిబ్బంది, సిపిపిసిలకు చెందిన అధికారులకు 2023 ఆగస్టు 18న డిపార్టమెంట్‌ ఆఫ్‌ పెన్షన్‌, పెన్షనర్‌ వెల్ఫేర్‌ సంస్థ లక్నోలో , బ్యాంకర్ల అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

డిఒపిపిడబ్ల్యు అదనపు కార్యదర్శి శ్రీసంజీవ్‌ నారాయణ్‌ మాథుర్‌, పి అండ్‌పిడబ్ల్యు కార్యదర్శి  శ్రీ వి. శ్రీనివాస్‌ నాయకత్వంలో డిఒపిపిడబ్ల్యుకు చెందిన అధికారులు  ఈ కార్యక్రమంలో సిబ్బందికి అవగాహన కల్పించారు. పెన్షన్‌ విధాన సంస్కరణలు, పెన్షన్‌ డిజిటైజేషన్‌, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రత్యేక సెషన్‌ నిర్వహించారు. అలాగే పెన్షనర్లకు సంబంధించి ఆదాయపన్ను అంశాల విషయంలో , వార్షిక లైఫ్‌ సర్టిఫికేట్‌ను ప్రతి ఏడాది సమర్పించడం వంటి వాటి విషయంలో  స్పెషల్‌ సెషన్‌ నిర్వహించారు.  ఛీఫ్‌ కంట్రోలర్‌ (పెన్షన్‌), సిపిఎఒ , పెన్షనర్ల ఇబ్బందులకు సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. బ్యాంకు వీటిని పరిష్కరించేందుకు తీసుకోవలసిన చర్యలను సూచించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఛీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఆపరేషన్స్‌, (హెడ్‌ ఆఫీస్‌), శ్రీ సంజయ్‌ వర్షిణి నాయకత్వంలో  పలువురు అధికారులు క్షేత్ర స్థాయిలో , పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు చెందిన వివిధ బ్రాంచిలలో పెన్షన్‌ వర్క్‌ను చూస్తున్న సిబ్బంది ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.

పి అండ్‌ పి డబ్ల్యు కార్యదర్శి మాట్లాడుతూ, పెన్షనర్ల సంక్షేమానికి  డిపార్టమెంట్‌ తీసుకున్న చర్యలను వివరించారు. వివిధ బ్యాంకు బ్రాంచీలు  పెన్షనర్లకు పెన్షన్‌ నిరంతరాయంగా, కచ్చితంగా అందేలా పెన్షనర్లతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలని సూచించారు. పెన్షనర్లకు సమస్యలు ఏవైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. భారత ప్రభుత్వం పెన్షనర్ల సంక్షేమానికి తీసుకుంటున్న సంక్షేమ చర్యలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందేవిధంగా అటు సిబ్బందికి, పెన్షనర్లకు అవగాహన కల్పించాలని సూచించారు.  డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ కు ముఖ గుర్తింపు సాంకేతికను ఉపయోగించుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకులు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. డిజిటల్‌ లైఫ్‌సర్టిఫికేట్‌,ముఖ గుర్తింపు సాంకేతికత పెన్షనర్ల విషయంలో ఒక గేమ్‌ చేంజర్‌ అని ఆయన తెలిపారు. సెక్రటరీ పిఅండ్‌ పి డబ్ల్యు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కు చెందిన పలువురు పెన్షనర్లను ఈ సందర్బంగా సత్కరించారు. తమ విభాగం తీసుకున్న చర్యలపై పెన్షనర్ల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు.

డిపార్టమెంట్‌ ఆఫ్‌ పెన్షన్‌, పెన్షనర్స్‌ వెల్ఫేర్‌ కు చెందిన అదనపు కార్యదర్శి శ్రీ ఎన్‌ సంజీవ్‌మాథూర్‌ మాట్లాడుతూ, బ్యాంకుల కోసం చేపట్టిన అవగాహనా కార్యక్రమాలలో ఇది ఆరవదని ఆయన అన్నారు. పెన్షనర్ల సులభతర జీవితానికి మరింత వీలు కల్పించడం ఈ కార్యక్రమాల లక్ష్యం. పెన్షనర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి అభిప్రాయాలు తెలుసకుంటుండడం ద్వారా  డిపార్టమెంట్‌ ఆఫ్‌ పెన్షన్స, పెన్షనర్‌ వెల్ఫేరÊ తగిన విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, క్షేత్రస్థాయిలో సిబ్బంది ,పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి వీలుకలుగుతుందన్నారు.  ఈ అవగాహనా కార్యక్రమాలు బ్యాంకు అధికారుల పనితీరు మరింతగా మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కేంద్రకార్యాలయ ఛీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీ సంజయ్‌ వర్షనే మాట్లాడుతూ,పెన్షనర్ల సంక్షేమానికి తమ బ్యాంకు తీసుకున్న చర్యలను వివరించారు. పెన్షన్‌, పెన్షన్‌ ప్రయోజనాలను పెన్షనర్లకు సకాలంలో ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కట్టుబడి ఉన్నదని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ విధానపరమైన అంశాలపై బ్యాంకు అధికారుల నుంచి సవివరమైన ఫీడ్‌ బ్యాక్‌ను తీసుకున్నారు. ఇది పెన్షనర్ల సులభతర జీవనానికి మరింత మెరుగైన మార్పులకు దోహదపడుతుంది.పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సిపిపిసి,నుంచి 50 మంది అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  పెన్షన్‌ సంబంధిత వ్యవహారాలు చూసే బ్రాంచీలకు సమావేశాల ముగింపు కార్యక్రమంలో  సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.

 

***

 


(Release ID: 1951589) Visitor Counter : 84


Read this release in: English , Urdu , Hindi