గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో గ్రామీణాభివృద్ధి శాఖ, భూ వనరుల శాఖ మరియు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ యొక్క వార్షిక సామర్థ్య నిర్మాణ ప్రణాళికను ఈ రోజు ప్రారంభించిన గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్


ఏసిబిపి అన్ని డిపార్ట్‌మెంట్‌ల సమర్థత మరియు పనితీరుని మెరుగుపరచడంలో ప్రభావాన్ని చూపుతుంది. తద్వారా న్యూ ఇండియా @2047 కోసం పిఎం యొక్క విజన్ విజయాలను వేగవంతం చేస్తుంది.

యూన్యువల్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ (ఏసిబిపి) అనేది మంత్రిత్వ శాఖ/డిపార్ట్‌మెంట్/ఆర్గనైజేషన్ (ఎండిఓ) అధికారుల యోగ్యత పెంపుదల అవసరాల ఆధారంగా రూపొందించబడిన ప్రణాళిక పత్రం.

Posted On: 22 AUG 2023 7:23PM by PIB Hyderabad

గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో గ్రామీణాభివృద్ధి శాఖ, భూ వనరుల శాఖ మరియు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ యొక్క వార్షిక సామర్థ్య నిర్మాణ ప్రణాళికను ప్రారంభించారు. ఏసిబిపిని ప్రారంభించిన సందర్భంగా శ్రీ గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ..ఈ ప్రణాళిక సేవా డెలివరీ, ప్రోగ్రామ్ అమలు మరియు కోర్ గవర్నెన్స్ విధులను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మరియు సంబంధిత సామర్థ్యాలను పొందేందుకు అవసరమైన శిక్షణకు హాజరు కావడం ద్వారా అధికారుల సామర్థ్యాలను పెంపొందిస్తుందని చెప్పారు. మెరుగైన పనితీరు కోసం పౌరుల కేంద్రీకరణతో మంత్రిత్వ శాఖ/డిపార్ట్‌మెంట్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం ఉత్తమమని తెలిపారు.

ప్రధానమంత్రి విజన్ న్యూ ఇండియా @ 2047 సాధించాలనే లక్ష్యంతో జాతీయ ప్రాధాన్యతలు, సిటిజన్ సెంట్రిసిటీ, ఎమర్జింగ్ టెక్నాలజీ అనే 3 లెన్స్‌ల ద్వారా వార్షిక సామర్థ్య నిర్మాణ ప్రణాళికను రూపొందించే విధానాన్ని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ రూపొందించింది. వ్యక్తిగత, సంస్థాగత మరియు సంస్థాగత లక్ష్య సాధనకు సానుకూలంగా సహకరించడానికి ఏసిబిపి అభివృద్ధికి మార్గదర్శకంగా ఉపయోగించబడుతుంది. ఏసిబిపి అన్ని డిపార్ట్‌మెంట్ల సామర్థ్యం మరియు పని నీతిని మెరుగుపరచడంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తద్వారా ప్రధానమంత్రి పిలుపునిచ్చిన న్యూ ఇండియా @2047 విజయాలను వేగవంతం చేస్తుంది.

యాన్యువల్ వార్షిక కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ (ఏసిబిపి) అనేది మంత్రిత్వ శాఖ/డిపార్ట్‌మెంట్/ఆర్గనైజేషన్ (ఎండిఓ) యొక్క అధికారుల యోగ్యత పెంపుదల అవసరాల ఆధారంగా అభివృద్ధి చేయబడిన ఒక ప్రణాళిక పత్రం. ఇది కాంపిటెన్సీ నీడ్ అనాలిసిస్ (సిఎన్‌ఏ) నిర్వహించడం ద్వారా మరియు ప్రాధాన్యపరచడం ద్వారా నిర్ధారించబడుతుంది. అధికారుల ఆవశ్యకతపై ఆధారపడిన సామర్థ్యాలు మరియు మంత్రిత్వ శాఖకు యోగ్యత యొక్క ప్రాముఖ్యతపై ఆధారపడి ఉంటుంది. తద్వారా కెపాసిటీ బిల్డింగ్‌పై ఎండిఓ పెట్టుబడి పెట్టే వనరులు ఆప్టిమైజ్ చేయబడతాయి.

ఏసిబిపిని అమలు చేయడానికి మరియు కొనసాగించడానికి మూడు విభాగాలలో సామర్థ్య నిర్మాణ యూనిట్ (సిబియు) నోటిఫై చేయబడింది. డిపార్ట్‌మెంట్ హెడ్‌  జీతంలో 2.5% బడ్జెట్ వ్యయం ఏసిబిపి అమలు కోసం కేటాయించబడుతుంది. క్వార్టర్ 2, క్వార్టర్ 3 & క్వార్టర్ 4 కోసం అధికారుల శిక్షణ అవసరాలకు సిబియు ప్రాధాన్యతనిస్తుంది. శిక్షణలు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉంటాయి. అధికారులకు వివిధ అంశాలలో శిక్షణ ఇవ్వడానికి ఇన్‌స్టిట్యూట్‌లు మరియు నాలెడ్జ్ పార్టనర్‌లను సిబిసి గుర్తించింది. ఏసిబిపి యొక్క సామర్థ్యాన్ని నిర్ధారించడానికి వివిధ అధికారులు మరియు సిబ్బందికి అందించబడిన శిక్షణల ప్రభావాన్ని కూడా మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుంది.

ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ, భూ వనరుల శాఖ మరియు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శులు మరియు అధికారులు మరియు సభ్యులు (మానవ వనరులు), కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

 

 

****



(Release ID: 1951264) Visitor Counter : 169


Read this release in: English , Urdu , Hindi