వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఇండొనేషియాలోని సెమరాంగ్‌లో జరిగిన 20వ ఆసియాన్- భారత్ ఆర్ధిక మంత్రుల సమావేశంలో పాలుపంచుకున్న భారత్
Posted On:
21 AUG 2023 8:30PM by PIB Hyderabad
ఇండొనేషియాలోని సెమరాంగ్‌లో 21 ఆగస్టు 2023న జరిగిన 20వ ఆసియాన్ (ఎఎస్ఇఎఎన్) - భారత్ ఆర్ధిక మంత్రుల సమావేశానికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వాణిజ్య విభాగపు అదనపు కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ హాజరయ్యారు. ఆయన ఈ సమావేశానికి ఇండొనేషియా వాణిజ్య మంత్రి డాక్టర్ జుల్కిఫ్లి హసన్‌తో కలిసి సహాధ్యక్షత వహించారు. మొత్తం 10 ఆసియాన్ దేశాలు, అంటే బ్రూనై, కంబోడియా, ఇండొనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాంకు చెందిన ఆర్ధిక మంత్రులు లేక వారి ప్రతినిధులు ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. పరిశీలకునిగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ తైమోర్- లెస్లీ కూడా ఈ సమావేశంలో పాల్గొంది.
మంత్రులు భారత్, ఆసియాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను సమీక్షించి, ఆసియాన్- భారత సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు పక్షాలకూ, ముఖ్యంగా మహమ్మారి అనంతర కాలంలో అర్థవంతమైన ప్రయోజనాలను అందించేలా భారత్, ఆసియాన్ మధ్య ఆర్ధిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, మెరుగుపరిచేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. భారత్- ఆసియాన్ 2022-23 సంవత్సరంలో 131.5 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నమోదు చేశాయి.
మంత్రులు ఆసియాన్- భారత బిజినెస్ కౌన్సిల్ (ఎఐబిసి)తో మెచ్చటించి, 2023లో కౌలాలంపూర్‌లో 6మార్చిన 2023న నిర్వహించిన 5వ ఆసియాన్- భారత వాణిజ్య సందస్సు సహా ఏబిసి చేపట్టిన కార్యకలాపాలను గురించి తెలుసుకున్నారు. వ్యాపారాలు లేవనెత్తిన నాన్ టారిఫ్ బారియర్స్ (ఎన్‌టిబిలు- పన్నేతర అడ్డంకులను) పరిగణనలోకి తీసుకుంటూ, ఇరు వైపుల భాగస్వాముల మధ్య పెరుగుతున్న బదలాయింపులను ప్రశంసించారు.
కోవిడ్-19 మహమ్మారి బహుకోణీయ ప్రభావాలు, పర్యావరణ మార్పు, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన అస్థిరత, ద్రవ్యోల్బణ ఒత్తిడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు వంటి ప్రాంతీయ, ప్రపంచ స్థాయి సవాళ్ళపై తమ అభిప్రాయాలను ఇచ్చి పుచ్చుకున్నారు. ఇరు పక్షాలూ బలమైన సరఫరా చెయిన్లను, ఆహార భద్రత, ఇంధన భద్రత, ఆరోగ్య, ఆర్ధిక స్థిరతను సహకారానికి ప్రాధాన్యతా అంశాలు గుర్తించాయి.
ఈ ఏడాది సమావేశపు ప్రధాన అజెండా 2009లో సంతకాలు చేసిన ఆసియాన్- ఇండియా ట్రేడ్ ఇన్ గుడ్స్ అగ్రిమెంట్ (ఎఐటిఐజిఎ- ఆసియాన్0 భారత వాణిజ్య సరుకు ఒప్పందం)ప్రధాన అజెండాగా ఉంది. ఆర్థిక మంత్రుల సమావేశానికి ముందుగా సమీక్ష కోసం రోడ్‌మ్యాప్‌ను చర్చించి, ఎఐటిఐజిఎ సమీక్ష సంప్రదింపుల ఉల్లేఖన నిబంధనలను, కార్యప్రణాళికను సంయుక్త కమిటీ సమావేశం ఖరారు చేసింది. నిర్మాణాత్మక చర్చల అనంతరం, నిర్వచించబడిన పద్ధతులతో చర్చల అధికారిక ప్రారంభానికి మార్గాన్ని సుగమం చేసే పైన పేర్కొన్న సమీక్షా పత్రాలను మంత్రుల ఆమోదించారు. ఎఐటిఐజిఎ సమీక్ష భారతీయ వ్యాపారాల దీర్ఘకాల డిమాండ్. త్వరిత గతి సమీక్ష అన్నది ఎఫ్‌టిఎ వాణిజ్యాన్ని సులభతరం, పరస్పర లాభదాయకం చేస్తుంది. చర్చల త్రైమాసిక షెడ్యూల్‌ను అనుసరించి, సమీక్షను 2025లో ముగించేందుకు మంత్రులు అంగీకరించారు. ఎఐటిఐజిఎ సమీక్ష ద్వైపాక్షిక వాణిజ్యంలోని ప్రస్తుత అసమానతను పరిష్కరిస్తూ వాణిజ్యాన్ని మెరుగుపరచి, వైవిధ్యభరితం చేస్తుంది. అనంతరం, సెప్టెంబర్ ప్రారంభంలో జరుగనున్న భారత్- ఆసియాన్ నేతల శిఖరాగ్ర సమావేశంలో మార్గదర్శకత్వం కోసం ఎఐటిజిఎ సమీక్షకు సంబంధించిన నిర్ణయం ఉంచనున్నారు.
***
(Release ID: 1951112)
Visitor Counter : 163