సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

‘ఎన్‌ఇఎస్‌డిఏ – వే ఫార్వర్డ్ మంత్లీ రిపోర్ట్ ఫర్ స్టేట్స్/యూటీ’ 5వ ఎడిషన్ విడుదల


రాష్ట్రాలు/యూటీలలోని విభాగాలు 13,867 ఇ-సేవలను అందిస్తాయి

2,016 తప్పనిసరి ఇ-సేవలలో 1,397 అందుబాటులో ఉన్నాయి. వీటి సంతృప్తస్థాయి 69%

లోకల్ గవర్నెన్స్ & యుటిలిటీ సర్వీసెస్ సెక్టార్‌లో గరిష్ట సంఖ్యలో ఇ-సేవలు (5,203) ఉన్నాయి

సింగిల్ యూనిఫైడ్ సర్వీస్ డెలివరీ పోర్టల్ ఇ-సేవనం ద్వారా 100% (911) సేవలను అందిస్తున్న కేరళ

విద్యా రంగం కింద గుర్తించబడిన 25 రకాల విభిన్న ఇ-సేవలలో కర్ణాటక (21) గరిష్ట రకాల ఇ-సేవలను అందిస్తుంది

Posted On: 21 AUG 2023 7:11PM by PIB Hyderabad

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ & పబ్లిక్ గ్రీవెన్స్ (డిఏఆర్‌పిజి) 'నేషనల్ ఇ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్‌మెంట్ (ఎన్‌ఇఎస్‌డిఏ) - వే ఫార్వర్డ్ మంత్లీ రిపోర్ట్ ఫర్ స్టేట్స్/యూటీస్' ఐదవ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇది  రాష్ట్రాలు/యూటీల్లో ఇ-సేవ డెలివరీ స్థితికి సంబంధించిన వివరణాత్మక అవలోకనాన్ని అందిస్తుంది.

జూలై నెలవారీ నివేదిక ఇ-సేవలు, తప్పనిసరి ఇ-సేవలు (నెఎస్‌డిఎ 2021 ప్రకారం) స్థితిని ప్రదర్శిస్తుంది మరియు రాష్ట్రాలు/యుటిలలో ఉత్తమ పద్ధతులను హైలైట్ చేస్తుంది. ఇది రాష్ట్రం/యూటీల యొక్క ఒకే ఏకీకృత సర్వీస్ డెలివరీ పోర్టల్ ద్వారా అందించబడిన ఇ-సేవల యొక్క సంతృప్త స్థాయిని కూడా నొక్కి చెబుతుంది అంతేకాకుండా ఈ నివేదిక ముఖ్యంగా విద్యా రంగం కింద అందించబడిన ఇ-సేవలపై లోతైన విశ్లేషణను కలిగి ఉంది.

జూలై, 2023 నివేదిక విడుదల చేయబడింది మరియు ఇక్కడ అందుబాటులో ఉంది

 

https://darpg.gov.in/sites/default/files/NeSDA_July.pdf

జూలై, 2023 నెల నివేదికలోని ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

ఇ-సేవలు

 

  • 13,867 ఇ-సేవలు రాష్ట్రాలు/యుటిలలో అందించబడ్డాయి. ఇది జూన్ నివేదికతో పోలిస్తే 6.3% (816) సేవల పెరుగుదలను సూచిస్తుంది
  • 2,016 తప్పనిసరి ఇ-సేవలలో 1,397 (56*36 రాష్ట్రాలు/యుటిలు) అందుబాటులో ఉన్నాయి. వీటి సంతృప్తత స్థాయి 69% గా ఉంది.
  • స్థానిక పాలన & యుటిలిటీ సేవలు సెక్టార్‌లో గరిష్ఠ సంఖ్యలో ఇ-సేవలు (5,203) ఉన్నాయి
  • 58% అంటే 36 రాష్ట్రాలు/యుటిలలో 21 టూరిజం రంగంలో తప్పనిసరి ఇ-సేవలను సాధించాయి. దీని తర్వాత పర్యావరణ రంగం 47% అంటే 36 రాష్ట్రాలు/యూటీలలో 17 ఉన్నాయి


విద్యా రంగంలో ఇ-సేవలు

 

  • విద్యా రంగం కింద 911 ఇ-సేవలు మ్యాప్ చేయబడ్డాయి
  • విద్యా రంగం కింద ఇ-సేవల యొక్క గుర్తించబడిన ఉప థీమ్‌లు
  • డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ మరియు సర్టిఫికెట్ జారీ కింద 297 ఇ-సేవలు
  • ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ సర్వీసెస్ అండ్ సపోర్ట్ కింద 297 ఇ-సేవలు
  • ఆర్థిక సహాయ పథకాలు మరియు స్కాలర్‌షిప్‌ల క్రింద 202 ఇ-సేవలు
  • ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ మరియు రెగ్యులేషన్ కింద 78 ఇ-సేవలు
  • ఇతర అంశాల కింద 37 ఇ-సేవలు
  • మధ్యప్రదేశ్ విద్యారంగంలో గరిష్టంగా(122) ఇ-సేవలను అందిస్తోంది. దాని తర్వాత కర్ణాటక (113), కేరళ (92), గుజరాత్ (69), మరియు హిమాచల్ ప్రదేశ్ (55) ఉన్నాయి.
  • విద్యా రంగం కింద గుర్తించబడిన 25 రకాల విభిన్న ఇ-సేవలలో కర్ణాటక (21) గరిష్ట రకాల ఇ-సేవలను అందిస్తుంది.దాని తర్వాత కేరళ (17), మధ్యప్రదేశ్ (16) ఉన్నాయి.


ఉత్తమ పద్ధతులు

గుజరాత్ ప్రభుత్వం జీ-శాల (గుజరాత్ స్టూడెంట్స్ హోలిస్టిక్ అడాప్టివ్ లెర్నింగ్ యాప్)ను అభివృద్ధి చేసింది, ఇది గ్రేడ్ I-XII కోసం ఇ-కంటెంట్‌తో కూడిన లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్‌ఎంఎస్)
మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారి విద్యా హక్కు (ఆర్‌టీఈ) పోర్టల్ ద్వారా 100% సీట్ల కేటాయింపు కోసం ఆన్‌లైన్ మరియు కేంద్రీకృత విధానాన్ని ఉపయోగించిన దేశంలో మొదటి రాష్ట్రంగా ఉంది.
నాగాలాండ్ ప్రభుత్వం కామన్ స్కాలర్‌షిప్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఇది రాష్ట్ర స్కాలర్‌షిప్‌లన్నీంటికి కేంద్రీకృత వేదికగా పనిచేస్తుంది
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వారి హిమాచల్ ప్రదేశ్ తక్నికి శిక్ష (హెచ్‌పిటెక్) బోర్డు పోర్టల్ ద్వారా పాలిటెక్నిక్ మరియు ఐటీఐ అభ్యర్థుల ఆన్‌లైన్ అడ్మిషన్ సంబంధిత ప్రక్రియలను ప్రారంభించింది.
కర్ణాటక ప్రభుత్వం వారి కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్‌మెంట్ బోర్డ్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో మొత్తం పరీక్ష ప్రక్రియను డిజిటలైజ్ చేసింది.

పైన పేర్కొన్న ఇ-సేవల గణాంకాలు 06/08/2023 నాటికి ఎన్‌ఇఎస్‌డిఏ- వే ఫార్వర్డ్ డ్యాష్‌బోర్డ్‌లో రాష్ట్రాలు/యూటీలు అప్‌లోడ్ చేయబడ్డాయి. డిపార్ట్‌మెంట్ పేర్కొన్న ఇ-సేవలను వివిధ విద్య నిర్దిష్ట ఉప-థీమ్‌లుగా వర్గీకరించింది.

 

image.png

*****



(Release ID: 1951110) Visitor Counter : 100


Read this release in: Urdu , English , Hindi , Marathi