రక్షణ మంత్రిత్వ శాఖ
రెండవ ఎంసిఎ నావ, యార్డ్ 76 (ఎల్ఎస్ఎఎం 8)ను విశాఖపట్నంలోని ఎం/ఎ స్ సెకాన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ప్రారంభం
Posted On:
18 AUG 2023 6:16PM by PIB Hyderabad
రెండవ క్షిపణి కమ్ మందుగుండు సామాగ్రి (మిస్సైల్ కమ్ అమ్యునిషన్ - ఎంసిఎ) నావ, యార్డ్ 76 (ఎల్ఎస్ఎఎం 8)ను యుద్ధనౌకల ఉత్పత్తి సూపరింటెండెంట్ (విశాఖపట్నం) కమడోర్ జి రవి 18 ఆగస్టు 2023న ఆంధ్రప్రదేశ్‌లోని, తూర్పుగోదావరిలో, గుట్టెనదీవి (ఎం/ఎ స్ సెకాన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రయోగస్థానం)లో ప్రారంభించారు. స్వదేశీ తయారీదారుల నుంచి సేకరించిన అన్ని ప్రధాన, అనుబంధ పరికరాలు/ వ్యవస్థలతో, ఈ నావ రక్షణ మంత్రిత్వ శాఖ మేక్ ఇన్ ఇండియా చొరవకు సగర్వ పతాకధారి.
ఈ 08 x ఎంసిఎ నావ నిర్మాణానికి కాంట్రాక్టును భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ చొరవలకు అనుగుణంగా ఎంఎస్ఎంఇ అయిన ఎం/ఎ స్ సెకాన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నంతో కుదుర్చుకున్నారు. ఈ నావను 30 ఏళ్ళ సేవా కాలంతో నిర్మిస్తున్నారు. ఎంసిఎ నావల అందుబాటు అన్నది రవాణా, వస్తువులను ఓడమీదకు ఎక్కించడం, దించడం/ రేవుల పక్కన, బయిట నౌకాశ్రయాలలో భారతీయ నావికాదళ నౌకలకు మందుగుండు సామాగ్రి, ఆయుధాలను అందించడం సౌలభ్యత వంటి కార్యాచరణ హామీలను నెరవేర్చడాన్ని వేగవంతం చేస్తుంది.
***
(Release ID: 1950379)
Visitor Counter : 147