వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఆగస్టు 20 (ఆదివారం) నుండి కిలో రూ.40 రిటైల్ ధరకు టమోటాల విక్రయం


- ఎన్.సి.సి.ఎఫ్, నాఫెడ్ ద్వారా తక్కువ ధరకు అమ్మకాలు

Posted On: 18 AUG 2023 5:41PM by PIB Hyderabad

టోకో, రిటైల్ మార్కెట్లలో టమోటా ధరలు తగ్గుముఖం పట్టిన దృష్ట్యా 2023 ఆగస్టు 20 నుండి కిలో టమోటా రూ.40/- రిటైల్ ధరకు విక్రయించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎన్.సి.సి.ఎఫ్, నాఫెడ్ సంస్థలను ఆదేశించిందిఢిల్లీ-ఎన్సీఆర్లో టమోటాల రిటైల్ విక్రయం జూలై 14, 2023 నుండి ప్రారంభమైంది రోజు వరకు దేశంలోని ప్రధాన వినియోగ కేంద్రాల్లోని రిటైల్ వినియోగదారులకు నిరంతరం పంపిణీ చేయబడే రెండు ఏజెన్సీల ద్వారా 15 లక్షల కిలోల టమోటాలు కొనుగోలు చేయబడ్డాయిఢిల్లీ-ఎన్సీఆర్రాజస్థాన్ (జైపూర్కోటా), ఉత్తరప్రదేశ్ (లక్నోకాన్పూర్వారణాసిప్రయాగ్రాజ్), బీహార్ (పాట్నాముజఫర్పూర్అర్రాబక్సర్తదితర ప్రాంతాలలో రిటైల్ టొమాటో విక్రయాలు జరిగాయి. ఎన్.సి.సి.ఎఫ్ మరియు నాఫెడ్ ద్వారా సేకరించిన టమోటాల రిటైల్ ధర మొదట్లో కిలోకు రూ.90/-గా నిర్ణయించబడిందిఇది వినియోగదారులకు ప్రయోజనం కలిగించే విధంగా ధరల తగ్గుదలకు అనుగుణంగా వరుసగా మరింతగా తగ్గించబడింది.  చివరిగా 15.08.2023న కిలో టమోటా ధరను రూ.50/-కి తగ్గించడం జరిగింది, ఇది 20.08.2023 నుంచి కిలోకు రూ.40/-కి తగ్గనుంది.  వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆదేశాల మేరకు, ఎన్‌సిసిఎఫ్ మరియు నాఫెడ్ గత నెలలో రిటైల్ ధరలు గరిష్ఠంగా పెరిగిన ప్రధాన వినియోగ కేంద్రాలలో ఏకకాలంలో చేరవేడయడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్రలోని మండీల నుండి టమోటా సేకరణను ప్రారంభించిన విషయం గుర్తుండే ఉంటుంది.

                                                          ******



(Release ID: 1950378) Visitor Counter : 132