ఉక్కు మంత్రిత్వ శాఖ
దేశీయ యుద్ధ నౌక వింధ్యగిరికి మొత్తం 4000 టన్నుల ప్రత్యేక ఉక్కును సరఫరా చేసిన సెయిల్; రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు ప్రతీక
డిఎంఆర్ 249ఎ గ్రేడ్ హెచ్ఆర్ షీట్లను, ప్లేట్లను కలిగి ఉన్నసరఫరా చేసిన ఉక్కు
Posted On:
16 AUG 2023 6:40PM by PIB Hyderabad
దేశ రక్షణ పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) భారతదేశపు ఆరవ స్వదేశీ యుద్ధనౌక వింధ్యగిరి నిర్మాణం కోసం మొత్తం 4000 టన్నుల ప్రత్యేక ఉక్కును సరఫరా చేసింది. ఈ యుద్ధ నౌక పి 17ఎ చొరవలో భాగం, దీనిని భారత నావికాదళం చేపట్టగా, ఎం/ఎ స్ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జిఆర్ఎస్ఇ) దీనిని నిర్మిస్తోంది. ఈ యుద్ధనౌకను 17, 2023న గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించనున్నారు.
వింధ్యగిరి కోసం సెయిల్ సరఫరా చేసిన ఉక్కు డిఎంఆర్ 249 ఎ గ్రేడ్ హెచ్ఆర్ షీట్లు, ప్లేట్లును కలిగి ఉంది.
ప్రాజెక్టు పి 17ఎ కింద ఏడు నౌకలను ప్రారంభించాలన్న కీలక కృషి, ఉద్దేశ్యం ఉన్నాయి. వింధ్యగిరిని ప్రారంభించడం అన్నది ఆరవ నౌకను విజయవంతంగా నిర్మించడాన్ని సూచిస్తుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో సెయిల్ భాగస్వామ్యం అన్నది భారత రక్షణ రంగంలో దేశీయ వృద్ధిని, ఆవిష్కరణలను పెంపొందించాలన్న స్థిరమైన అంకిత భావానికి ఉదాహరణగా నిలుస్తుంది.
దేశానికి గర్వకారణమైన ఐఎన్ఎస్ విక్రాంత ప్రారంభానికి సెయిల్ విశేషమైన సహకారాన్ని అందించడంలో దోహదం చేసిన వెంటనే ఈ ముఖ్యమైన మైలురాయి రావడం ఒక విశేషం.ఈ విమాన వాహక నౌక నిర్మాణం కోసం సెయిల్ మొత్తం 30వేల టన్నుల ప్రత్యేక ఉక్కును అందించింది.
***
(Release ID: 1949727)
Visitor Counter : 172