సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భాషా అవరోధం వల్ల యువత ఉద్యోగావకాశాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలను 15 భారతీయ భాషల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది: డాక్టర్ జితేంద్ర సింగ్


అధికార భాష హిందీతో పాటు భారతీయ ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి ప్రధాని మోదీ నాయకత్వంలో గత తొమ్మిదేళ్లలో గణనీయమైన పురోగతి సాధించాం: డాక్టర్ జితేంద్ర సింగ్

“హిందీని ప్రమోట్ చేస్తున్న కొద్దీ ఇతర భారతీయ భాషలు కూడా అభివృద్ధి చెందుతాయి”

భారతీయ భాషలను ప్రోత్సహించడానికి ఆంగ్లం , ఇతర భాషల నుండి సాధారణ పదజాలాన్ని స్వీకరించాలని
పిలుపునిచ్చిన డాక్టర్ జితేంద్ర సింగ్

సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖకు సంబంధించిన 14వ హిందీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 16 AUG 2023 6:51PM by PIB Hyderabad

భాషా అవరోధం వల్ల ఏ ఒక్క యువత లో ఏ ఒక్కరూ ఉద్యోగావకాశాలను కోల్పోకుండా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షను 15 భారతీయ భాషల్లో నిర్వహించాలని ఇటీవల నిర్ణయించినట్టు  కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పి ఎం ఒ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖకు చెందిన 14వ హిందీ సలహా సంప్రదింపుల (కన్సల్టేటివ్) కమిటీ సమావేశంలో జితేంద్ర సింగ్  ప్రసంగించారు.

అధికార భాష హిందీతో పాటు భారతీయ ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత తొమ్మిదేళ్లలో గణనీయమైన పురోగతి సాధించామని ఆయన అన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం స్థానిక యువత భాగస్వామ్యానికి ఊతమిస్తుందని, ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తుందని మంత్రి అన్నారు.

హిందీ, ఇంగ్లిష్ తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి (ఎం ఇ ఐ టి ఐ ), కొంకణి వంటి 13 ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుందని చెప్పారు. 

ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు తమ మాతృభాష /ప్రాంతీయ భాషలో పరీక్షలో పాల్గొని తమ ఎంపిక అవకాశాలను మెరుగు పరుచుకుంటారని పేర్కొన్నారు. 

అధికార భాష హిందీతో పాటు భారతీయ ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గత తొమ్మిదేళ్లలో గణనీయమైన పురోగతి సాధించామని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

ఇంగ్లిష్, హిందీ కాకుండా ఇతర భాషల్లో ఎస్ఎస్ సి పరీక్షలు నిర్వహించాలని వివిధ రాష్ట్రాల నుంచి నిరంతరం డిమాండ్ లు వస్తున్నాయని డి ఒ పి టి  మంత్రి తెలిపారు. ఇతర అంశాలతో (కమిషన్ నిర్వహించే పరీక్షల పథకం, సిలబస్ సమీక్ష) పాటు ఈ అంశాన్ని కూడా పరిశీలించడానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించిందని చెప్పారు. 

‘1976 అధికార భాషా నిబంధనలతో ఈ విధానాన్ని ప్రారంభించినప్పటికీ గత ఐదారేళ్లలో మాత్రమే గణనీయమైన పురోగతి సాధించామని‘ చెప్పారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల 15 భాషల్లో పరీక్ష రాసేందుకు ఫార్మాట్ ను ఆవిష్కరించిందని, మొత్తం 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ లో రాతపరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. జె ఇ ఇ , నీట్, యూజీసీ పరీక్షలను కూడా మన దేశంలోని 12 భాషల్లో నిర్వహిస్తున్నారు.

“యు పి ఎస్ సి లో ఇంకా ఉన్నత చదువుల సబ్జెక్టు పుస్తకాల కొరత ఉంది. అయితే భారతీయ భాషల్లో ప్రత్యేక పుస్తకాలను తెచ్చేందుకు హెచ్ఆర్ డి మంత్రిత్వ శాఖ సమన్వయంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి.  దేశంలో హిందీలో తొలి ఎంబీబీఎస్ కోర్సును మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో గతేడాది అక్టోబర్ లో ప్రారంభించారు. ఇప్పుడు హిందీలో ఎంబీబీఎస్ ప్రారంభించిన రెండో రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది” అని ఆయన తెలిపారు. 

ఇంగ్లిష్, ఇతర భాషల నుంచి సాధారణ పదజాలాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ జితేంద్ర సింగ్, అనువాదాన్ని తయారు చేయడానికి వండడానికి సమయం, వనరులను వృథా చేయకుండా న్యూక్లియస్, అమీబా వంటి పదాలను తీసుకోవడం ద్వారా హిందీలో వైద్య విద్యను ప్రవేశపెట్టడంలో మధ్యప్రదేశ్ ముందడుగు వేయగలదని అన్నారు.

ప్రాథమిక, సాంకేతిక, వైద్య విద్యలో విద్యార్థుల మాతృభాషకు ప్రాధాన్యమివ్వడం ద్వారా నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ ఈపీ)లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

“హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, గుజరాతీ, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లో మెడికల్, ఇంజినీరింగ్ విద్యను అందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వైద్య విద్య హిందీలో ప్రారంభమైంది. త్వరలోనే హిందీలో కూడా ఇంజనీరింగ్ చదువులు ప్రారంభమవుతాయి. , దేశవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో ఇంజనీరింగ్ పుస్తకాల అనువాదం ప్రారంభమైంది. త్వరలోనే దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ మాతృభాషలో సాంకేతిక, వైద్య విద్యను అభ్యసించగలుగుతారు” అని తెలిపారు.

రెండు శతాబ్దాల నాటి క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ స్థానంలో ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మూడు విప్లవాత్మక బిల్లులను ప్రవేశపెట్టిందని జితేంద్ర సింగ్ తెలిపారు. “ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు 2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898 స్థానంలో భారతీయ నగరిక్ సురక్షా సంహిత బిల్లు 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో భారతీయ సాక్ష్య సక్షా బిల్లు 2023ను తీసుకు వచ్చినట్టు” తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్ లైన్ ట్రైనింగ్ (ఐ జి ఒ. టి) పోర్టల్ కింద మిషన్ కర్మయోగి ప్రారంభ్ కు చెందిన 650 శిక్షణ మాడ్యూళ్లలో 56 హిందీలో అందుబాటులో ఉంచినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇతర భారతీయ భాషలను చేర్చడానికి దీని పరిధిని విస్తరించవచ్చని ఆయన అన్నారు.

ప్రభుత్వ శాఖల్లో హిందీ సమీక్షా కమిటీలు తరచూ సమావేశం కావాలని పిలుపునిచ్చిన డాక్టర్ జితేంద్ర సింగ్, మనం హిందీని ప్రోత్సహిస్తున్నందున, ఇతర భారతీయ భాషలు కూడా లాభపడతా యని, అభివృద్ధి చెందుతాయనిఅన్నారు. ‘మనస్తత్వం మారినప్పుడు నిజమైన ప్రభావం ఉంటుందని, ఫలితంగా సామాజిక మార్పు వస్తుందని‘ ఆయన అన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ అవార్డులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ పై హిందీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు, మంత్రిత్వ శాఖ ప్రచురణల అధికారి డాక్టర్  కె సి అజయ్ కుమార్ రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు, పార్లమెంటు సభ్యులు శ్రీ సతీష్ కుమార్ గౌతమ్, శ్రీ శ్యామ్ సింగ్ యాదవ్ ( లోక్ సభ), శ్రీ రువాంగ్రా నర్జారీ (రాజ్యసభ) లతో పాటు హిందీ పండితులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.ఈ సమావేశంలో పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ కార్యదర్శి, పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ కార్యదర్శి వి.శ్రీనివాస్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్, డి ఒ పి టి అడిషనల్ సెక్రటరీ శ్రీమతి దీప్తి ఉమాశంకర్, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. 

****


(Release ID: 1949722) Visitor Counter : 197


Read this release in: English , Urdu , Tamil