మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పూరీలోని పెంతకట గ్రామాన్ని సందర్శించిన డాక్టర్ అభిలాక్ష్ లిఖి


-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఆక్వా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు అవసరమైన పరిశోధనలను చేపట్టాలి మరియు పరిశ్రమలు ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో చేపల పంటను కోల్పోతున్న వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: డాక్టర్ లిఖి

- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మరియు ఫ్రెష్ వాటర్ ఫిష్ బ్రూడ్ బ్యాంక్ కార్యకలాపాలను సమీక్షించిన డా. లిఖి

Posted On: 16 AUG 2023 5:22PM by PIB Hyderabad

కోస్తా ప్రాంతంలోని మత్స్యకారులు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడానికి ఒడిశాలోని పూరీ జిల్లా తీరప్రాంత గ్రామమైన పెంటకటాను కేంద్ర ప్రభుత్వ మత్స్య శాఖ కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖి సందర్శించారు. పెంటకటా వద్ద, డాక్టర్ లిఖి ప్రాథమిక మత్స్యకారుల సహకార సంఘం సభ్యులు (పీఎఫ్సీఎస్), మత్స్యకార జానపద మరియు మత్స్యకార మహిళలతో సంభాషించారు. వారి సామాజిక-ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, మత్స్యకారులు వలలు, పడవలు మరియు డీజిల్ సబ్సిడీ తదితరాల కొనుగోలు కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ పథకాల కింద అందుతున్న సహాయాన్ని గురించి తెలియజేశారు. పెంటకాటలోని మత్స్యకారులు ఫిష్ ల్యాండింగ్ సెంటర్/ జెట్టీ, హైజీనిక్ డ్రై ఫిష్ మార్కెట్, యు టవల్ ఛార్జీలకు సంబంధించిన కార్యకలాపాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల డిమాండ్‌ను పరిశీలించి కేంద్ర, రాష్ట్ర పథకాల కింద ప్రభుత్వ సాయం అందించాలని ఒడిశా మత్స్యశాఖ డైరెక్టర్‌కు సూచించారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పి.ఎం.ఎం.ఎస్.వై) కింద లబ్ది పొందిన పూరీ జిల్లాలోని చేపల రైతులతో కూడా ఆయన సంభాషించారు. ఐసీఏఆర్- సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిష్వాటర్ ఆక్వాకల్చర్ (సీఐఎఫ్ఏ) కౌసల్యగంగలో ఐసీఏఆర్ - సీఐఎఫ్ఏ మరియు ఎన్.ఎఫ్.డి.బి- నేషనల్ ఫ్రెష్ వాటర్ ఫిష్ బ్రూడ్ బ్యాంక్ (ఎన్.ఎఫ్.ఎఫ్.బి.బి) భువనేశ్వర్ నిర్వహిస్తున్న కార్యకలాపాలను సమీక్షించారు. కార్యక్రమానికి డాక్టర్ అభిలాక్ష్ లిఖి అధ్యక్షత వహించారు. ఒడిశా రాష్ట్రంలోని పీఎంఎంఎస్‌వై ప్రాజెక్టుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. ఐసీఏఆర్ - సీఐఎఫ్ఏ డైరెక్టర్ డాక్టర్ ప్రమోద కుమార్ సాహూ ఐసీఏఆర్ - సీఐఎఫ్ఏలో జరిగిన పరిశోధన కార్యకలాపాలపై వివరణాత్మక ప్రదర్శనను అందించారు. జన్యుపరంగా మెరుగైన రోహు మరియు కాట్లా, జీఐI-స్కాంపి, జాతులు మరియు వ్యవస్థ వైవిధ్యం, ఆక్వాకల్చర్ రంగంలో కొత్త మరియు వినూత్న సాంకేతికతలు, వివిధ మంచినీటి చేప జాతులకు ఫీడ్ ఫార్ములేషన్‌లు, వ్యాధి నిర్ధారణలు మరియు చికిత్సా విధానాలు వంటి ఇన్‌స్టిట్యూట్‌ల విజయాలను డాక్టర్. సాహూ హైలైట్ చేశారు. రైతులు మరియు అనేక ఇతర వాటాదారుల నైపుణ్యాలను పెంపొందించడానికి పరిశోధన మరియు శిక్షణ కార్యక్రమాలను గురించి తెలియజేశారు.  ఆక్వా రైతుల ప్రయోజనం కోసం సీఐఎఫ్ఏ అవసరాల ఆధారిత పరిశోధనలను నిర్వహించాలని మరియు పరిశ్రమ ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో చేపల పంటను నష్టపోయే వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డాక్టర్ లిఖి ఈ సందర్భంగానొక్కి చెప్పారు. ఎన్.ఎఫ్.డి.బి-నేషనల్ ఫ్రెష్ వాటర్ ఫిష్ బ్రూడ్ బ్యాంక్ (ఎన్.ఎఫ్.ఎఫ్.బి.బి) అధికారులు తమ కార్యకలాపాలను గురించి వివరణసమర్పించారు. బ్రూడ్ బ్యాంక్ యొక్క లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన విజయాలు మరియు ప్రస్తుత కార్యకలాపాల గురించి వివరంగా వివరించారు. జీఐ ఫిష్ స్ట్రెయిన్స్ (కార్ప్స్) యొక్క బ్రీడర్ సీడ్ యొక్క బ్రీడింగ్ మరియు ఉత్పత్తి కోసం ఎన్.ఎఫ్.డి.బి-ఎన్.ఎఫ్.ఎఫ్.బి.బి మల్టిప్లికేషన్ సెంటర్ మరియు జీఐ స్కాంపి కోసం సిమెంట్ నర్సరీ సౌకర్యాలను కలిగి ఉందని ఆయన తెలియజేశారు. చేపల పెంపకం మరియు విత్తనోత్పత్తి సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా చేపల పెంపకందారుల నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా అవకాశం ఉందని ఈ దిశగా చర్యలు చేపట్టడాన్ని ఆయన ప్రధానంగా తెలియజేశారు.. బయోఫ్లోక్ మరియు ఆర్ఏఎస్ వ్యవస్థలలో డిమాండ్ ఉన్న కొన్ని వాణిజ్యపరంగా ముఖ్యమైన చేపల రకాలను అభివృద్ధి చేయాలని డాక్టర్ లిఖి ఎన్.ఎఫ్.డి.బి-ఎన్.ఎఫ్.ఎఫ్.బి.బికి సలహా ఇచ్చారు. ఫిషరీస్ డెరైక్టర్, ఒడిశా ప్రభుత్వం, ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ రంగంలో ఒడిశా సాధించిన విజయాలపై సంక్షిప్త ప్రదర్శనను అందించారు. చేపల ఉత్పత్తి, ఎగుమతి, దేశీయ వినియోగం మొదలైనవి పెరుగుతున్న ట్రెండ్‌లో ఉన్నాయని ఆయన హైలైట్ చేశారు. డా. లిఖి సీఐఎఫ్ఏ మరియు ఎన్.ఎఫ్.ఎఫ్.బి.బికి కార్యకలాపాలను సమీక్షిస్తూ, ఎగుమతిదారులు, ప్రగతిశీల రైతులు, మహిళా స్వయం సహాయక బృందం (డబ్ల్యుఎస్హెచ్జీలు) సభ్యులు, ఫిష్ ఫ్రేమర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్. ఎఫ్.పి.ఒ) సభ్యులతో కూడా సంభాషించారు. ప్రభుత్వం మరియు పరిశోధనా సంస్థల నుంచి ఈ రంగం ప్రాధాన్యతలు మరియు అకాంక్షలను గురించి తెలియజేశారు.  ఎలక్ట్రానిక్ /ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, అలాగే కిసాన్ మేళాలు, పబ్లికేషన్‌లు, సెమినార్‌లు, అడ్వైజరీల ద్వారా ఈ రంగంలోని వాటాదారులందరి ప్రమేయంతో రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు సీఐఎఫ్ఏ మరియు ఎన్.ఎఫ్.ఎఫ్.బి.బికి చర్యలు చేపట్టాలని కార్యదర్శి కోరారు. తద్వారా అభివృద్ధి చెందిన సాంకేతికత మరియు బెస్ట్ మేనేజ్‌మెంట్ పద్ధతులు (బీఎంపీలు) రైతులకు వీలైనంత త్వరగా చేరతాయి, తద్వారా రైతులు పథకాలు మరియు కొత్త సాంకేతికత యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు.  డాక్టర్ లిఖి ఐసీఏఆర్ - సీఐఎఫ్ఏలోని బయోఫ్లోక్ యూనిట్, జీఐ-స్కాంపి కాంప్లెక్స్, అలంకార చేపల సముదాయం మరియు గాలి పీల్చే ఫిష్ యూనిట్ వంటి సౌకర్యాలను సందర్శించారు. ఎన్.ఎఫ్.ఎఫ్.బి.బి. యొక్క మల్టిప్లికేషన్ ఫెసిలిటీ, స్కాంపి నర్సరీ పెంపకం సౌకర్యాన్ని కూడా సందర్శించారు. ఒడిశాలోని కౌసల్యగంగలోని ఎన్.ఎఫ్.ఎఫ్.బి.బి లో అభివృద్ధి చేసినజ జీఐచేప జాతులను వీక్షించారు.

 

***


(Release ID: 1949719) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Hindi , Odia , Tamil