ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
14,903 కోట్ల రూపాయల వ్యయంతో డిజిటల్ ఇండియా కార్యక్రమం విస్తరణకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
Posted On:
16 AUG 2023 4:33PM by PIB Hyderabad
ప్రజలకు డిజిటల్ సేవలు అందించడానికి 2015 జూలై 1న డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం విజయవంతంగా అమలు జరుగుతోంది. ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 14,903 కోట్ల రూపాయల వ్యయంతో డిజిటల్ ఇండియా కార్యక్రమం విస్తరణకు ఆమోదం తెలిపింది.
విస్తరణ కార్యక్రమంలో ఈ కింది కార్యక్రమాలు అమలు జరుగుతాయి:
ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్ ప్రోగ్రామ్ కింద 6.25 లక్షల మంది ఐటీ నిపుణుల వృత్తి నైపుణ్యాల మరింత మెరుగుదలకు కార్యక్రమాలు అమలు చేస్తారు.
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ఫేజ్ (ISEA) ప్రోగ్రామ్ కింద 2.65 లక్షల మందికి శిక్షణ అందిస్తారు.
యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్ (UMANG) యాప్/ ప్లాట్‌ఫారమ్ కింద 540 అదనపు సేవలు అందుబాటులోకి వస్తాయి.
* ప్రస్తుతం యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్ లో 1,700 పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి;
* నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ కింద మరో 9 సూపర్ కంప్యూటర్లు ఏర్పాటు అవుతాయి. .ఇప్పటికే నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ కింద 18 సూపర్ కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి.
* ఏఐ కింద ప్రారంభమైన భాషిని బహుళ-భాషా అనువాద సాధనం (ప్రస్తుతం 10 భాషల్లో అందుబాటులో ఉంది) మొత్తం షెడ్యూల్ 22లో పొందుపరిచిన 8 భాషల్లో విడుదల అవుతుంది.
* 1,787 విద్యాసంస్థలను అనుసంధానించి పనిచేస్తున్న నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్ (NKN) ఆధునికీకరణ
* డిజి లాకర్ కింద డిజిటల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సదుపాయం ఇకపై ఎంఎస్ఎంఈ, ఇతర సంస్థలకు అందుబాటులోకి వస్తుంది.
* టైర్ 2/3 నగరాల్లో 1,200 స్టార్టప్‌లకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది.
* ఆరోగ్యం, వ్యవసాయం సుస్థిర నగరాల అభివృద్ధి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 3 అత్యుత్తమ కేంద్రాలు ఏర్పాటు అవుతాయి.
* 12 కోట్ల మంది కళాశాల విద్యార్థులకు సైబర్-అవగాహన కోర్సులు అందిస్తారు.
* నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్‌తో 200 కి మించి సైట్‌ల ఏకీకరణతో టూల్స్ అభివృద్ధి సహా సైబర్ సెక్యూరిటీ రంగంలో కొత్త కార్యక్రమాలు అమలు జరుగుతాయి.
కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. డిజిటల్ సేవలు మరింత ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి భారతదేశం ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి ప్రభుత్వ నిర్ణయం సహకారం అందిస్తుంది.
***
(Release ID: 1949508)
Visitor Counter : 173