వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారతదేశ ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయి.... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ప్రపంచ రేటింగ్ ఏజెన్సీలు భారతదేశ సామర్థ్యాన్ని గుర్తించాయి... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
భారతీయ యువత ప్రపంచ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలలో దేశాన్ని మొదటి మూడు స్థానాల్లో చేర్చారు: స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
15 AUG 2023 5:34PM by PIB Hyderabad
భారతదేశ ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచ రేటింగ్ ఏజెన్సీలు భారతదేశ సామర్థ్యాన్ని గుర్తించాయి అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈరోజు 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రగతి పథంలో సాగుతున్న భారతదేశ ప్రయాణం ఆగదని ప్రపంచం చెబుతోందని అన్నారు. ప్రపంచ రేటింగ్ ఏజెన్సీలు భారతదేశాన్ని ప్రశంసిస్తున్నాయని, కరోనా తర్వాత కొత్త ప్రపంచ క్రమంలో భారతదేశం సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించిందన్నారు. ప్రపంచ సరఫరా వ్యవస్థ కు అంతరాయం ఏర్పడిన సమయంలో మానవ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చని ప్రపంచానికి భారతదేశం తెలియజేసిందన్నారు. . నేడు భారతదేశం గ్లోబల్ సౌత్ వాణిగా భారతదేశం మారిందని పేర్కొన్నారు ప్రధానమంత్రి భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచ సరఫరా గొలుసులో భాగమై దానికి స్థిరత్వాన్ని అందజేస్తుందని అన్నారు.
తన ప్రసంగంలో ప్రధానమంత్రి స్టార్టప్‌ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ శక్తి సామర్థ్యాలతో భారతదేశ యువత ప్రపంచ స్టార్టప్ రంగంలో భారతదేశానికి మొదటి మూడు స్థానాల్లో స్థానం లభించేలా చూసారని అన్నారు. స్టార్టప్ రంగంలో భారతదేశం సాధించిన అభివృద్ధి, భారత యువత సామర్థ్యాన్ని చూసి ప్రపంచ యువత ఆశ్చర్యపోతున్నారని అన్నారు. సాంకేతికతతో నేటి ప్రపంచం నడుస్తోంది అని తెలిపిన ప్రధానమంత్రి సాంకేతిక రంగంలో తనకున్న ప్రతిభతో ప్రపంచంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అత్యంత అభివృద్ధి చెందిన దేశాల ప్రపంచ నాయకులు డిజిటల్ ఇండియా విజయాన్ని గుర్తించారని తెలిపిన ప్రధానమంత్రి భారతదేశంలో అమలు జరుగుతున్న కార్యక్రమాల పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
*******
(रिलीज़ आईडी: 1949296)
आगंतुक पटल : 428