ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వాతావరణ మార్పులతో ముడిపడిన ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చర్యలు

Posted On: 11 AUG 2023 2:12PM by PIB Hyderabad

వాతావరణ మార్పులు మానవ ఆరోగ్యంపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది. ప్రత్యేకించి ఇది వడగాడ్పులు పెరగడానికి , తుపాన్లు, వరదలు, కరవు తదితరాలు సంభవించడానికి వీలు కల్పిస్తుంది.
జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వారి జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక 2019 (ఎన్.డి.ఎం.పి 2019) ప్రకారం, వివిధ నోడల్, మద్దతు నిచ్చే మంత్రిత్వశాఖలు, విభాగాలను వివిధ విపత్తులను ఎదుర్కొవడంతోపాటు,
ఇలాంటి వాటికి అనుబంధంగా వచ్చే ఆరోగ్యసమస్యల విషయంలో తగిన సన్నద్ధతతో వ్యవహరించేందుకు తగిన బాధ్యత అప్పగించడం జరిగింది.

ఇందుకు అనుగుణంగా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇలాంటి విపత్తులకు అనుబంధంగా వచ్చే ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఎన్.డి.ఎం.పి 2019 కింద పలు కార్యక్రమాలను చేపట్టింది. వీటిని వాతావరణ మార్పులు,
మానవ ఆరోగ్యం పై జాతీయ కార్యక్రమం (ఎన్పిసిసిహెచ్హెచ్ ) కింద దీనిని చేపట్టారు. దీని లక్ష్యం ఈ సమస్యలపై  ప్రజలలో అవగాహన కల్పించడం,సామర్ధ్యాల నిర్మాణం, ఆరోగ్య రంగం సన్నద్ధత,
సమష్టి భాగస్వామ్యం ఏర్పాటు వంటి వి ఉన్నాయి.
దీనికింద చేపట్టిన కీలక కార్యక్రమాలు , విపత్తుల కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవడానికి ఉపకరిస్తాయి. అవి,

–– వాతావరణ మార్పులు, మావన ఆరోగ్యంపై జాతీయ స్థాయిలో కార్యాచరణకు రూపకల్పన చేయడం జరిగింది.  ఇది  ఆరోగ్య రంగంలో ,జాతీయ, రాష్ట్ర స్థాయిలో కీలక ప్రాధాన్యతా ,
 కార్యాచరణకు  తీసుకోవలసిన చర్యలను సూచిస్తుంది. వీటి అమలుకు ఇతర కీలక స్టేక్ హోల్డర్లను గుర్తిస్తుంది.
‌‌‌‌–– పర్యావరణ పరంగా ఆందోళన కలిగించే  అంశాల విషయంలో ముందస్తు హెచ్చరికలను జారీచేసి వాటిని, ఆరోగ్య రంగంతో సమన్వయం చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మార్చి –జూలై మధ్య వడగాడ్పులకు సంబంధించి , డిసెంబర్ – జనవరి మధ్య చలిగాలలు విషయంలో, అలాగే ఎప్పటప్పుడు వరదలకు సంబంధించి వాతావరణ శాఖ అందించే హెచ్చరికలు రాష్ట్రాలకు తెలియజేయడం,
వాతావరణ విభాగం అందించే గాలి నాణ్యతా వివరాలను తెలియజేయడం ఇందులో ఉన్నాయి. గాలి నాణ్యతా వివరాలు సిపిసిబి రాష్ట్రాలకు అందిస్తుంది.
––వాతావరణ మార్పులకు సంబంధించి కీలక ఆరోగ్య అంశాలపై ఆయా రుతువులవారీగా ఆరోగ్య సూచనలు జారీ. ఉదాహరణకు వాయుకాలుష్యం, వడగాడ్పులు , చలి గాలులు, వరదలు వంటి వి.
–– ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (ఏప్రిల్), ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్), అంతర్జాతీయ పరిశుభ్ర గాలులు, నీలి ఆకాశ దినోత్సవం (సెప్టెంబర్), అంతర్జాతీయ విపత్తు ముప్పు తగ్గింపు దినోత్సవం (అక్టోబర్)
వంటి రోజులను ఏటా నిర్వహించి , దేశవ్యాప్తంగా ప్రజలలో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం.

– జాతీయ స్థాయి వర్క్షాపుల నిర్వహణ, రాష్ట్రస్థాయిలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ, జిల్లాస్థాయిలో వాయు కాలుష్యం, తదితర అనారోగ్యాలకు సంబంధించి శిక్షణ, నిఘా  , విపరీత వాతావరణ  పరిస్థితులు, ఆరోగ్య సంబంధిత సమస్యల అంచనా,
హరిత వాతావరణ మౌలిక సదుపాయాల అవసరాల అసెస్మెంట్,హరిత వాతావరణ మౌలికసదుపాయాలు, డబ్ల్యు.ఎ.ఎస్.హెచ్, వాతావరణ మార్పులు, నీటి వల్ల  వచ్చే వ్యాధులు, పౌష్టికాహార లోపం, అలర్జీలు, ఇతర ఆరోగ్య సమస్యలపై అవగాహనకల్పించడం.
– పర్యావరణ పరంగా ఆరోగ్య అంశాలపై ఎప్పటికప్పుడు  నిఘా ఉంచడం. వాయుకాలుష్యం, వేడి సంబంధిత అనారోగ్యాలుపై కేంద్ర,  రాష్ట్ర స్థాయిలలో కనిపెట్టి ఉండడం.
– జాతీయ ఆరోగ్య మిషన్ కింద, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు సమకూర్చడం, హరిత, తక్కువ కార్బన్ ఉద్గారాలకు చర్యలు తీసుకోవడం.
– దీనికి తోడు, హరిత, వాతావరణ మార్పులకు తట్టుకునే ఆస్పత్రుల ఏర్పాటు, వీటిని భారత ప్రజా ఆరోగ్య ప్రమాణాలు 2022 (ఐపిహెచ్ఎస్) కు  అనుగుణంగా ఏర్పాటుచేయడం.

కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, వరదలు, వరదల సందర్భంగా తలెత్తే ఆరోగ్య సమస్యలు, వీటి సత్వర అంచనా, వ్యాధులకు సంబంధించి నిఘా, వరదల సమయంలో, వరదల అనంతరం నీటి కాలుష్యం,
తద్వారా వ్యాపించే వ్యాధులు, పారిశుద్య సమస్య వంటి వాటిపై సమగ్ర, ప్రజారోగ్య మార్గదర్శకాలను ప్రభుత్వం జారీచేసింది.
28 రాష్ట్రాలు,వాతావరణ మార్పులు, మానవ ఆరోగ్యం వంటి అంశాల కు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి.  ఆయా రాష్ట్రాలలో ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుంది.
 ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి ప్రోఫెసర్ ఎస్.పి.సింగ్ బఘెల్ లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం లో తెలిపారు.

 

***



(Release ID: 1948860) Visitor Counter : 97


Read this release in: English , Urdu , Tamil