పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీ & ముంబై సహా దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు


రాబోయే నెలల్లో భద్రత & ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల వద్ద వేచిచూసే సమయం దాదాపు 10 నిమిషాలు ఉండొచ్చు

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) 3A దశ ప్రాజెక్టు నిర్మాణ (భౌతిక) పురోగతి 31 జూలై 2023 నాటికి 92.83% పూర్తి

Posted On: 10 AUG 2023 2:51PM by PIB Hyderabad

            ఋతు సంబంధ వైవిధ్యం కారణంగా ప్రయాణికుల సంఖ్య పెరిగినందున న్యూఢిల్లీలోని IGI విమానాశ్రయం వివిధ పాయింట్ల వద్ద
ప్రాసెసింగ్‌ కోసం ప్రయాణీకులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది.  అప్పటి నుంచి అనేక చర్యలు తీసుకోవడంతో పాటు  
IGI విమానాశ్రయంలో నిరంతర పర్యవేక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడంతో పరిస్థితి మెరుగుపడింది. ఢిల్లీ మరియు ముంబైతో సహా ప్రధాన విమానాశ్రయాలలో రద్దీని తగ్గించడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అవి ఈ  క్రింది విధంగా ఉన్నాయి:-

i. వాహనాల రద్దీని నివారించడానికి డిపార్చర్ ఫోర్‌కోర్టు వద్ద అదనపు ట్రాఫిక్ మార్షల్స్‌ నియామకం

ii. ప్రయాణీకులకు ముందస్తు సూచన  కోసం ఎక్కువ మంది చూడగలిగే పాయింట్ల వద్ద ఎంట్రీ గేట్ నంబర్‌తో పాటు కనీసం వేచి ఉండే సమయాన్ని ప్రదర్శించే బోర్డు ఏర్పాటు  

iii. వాస్తవ  సమయంలో గేట్ల వద్ద వేచి ఉన్న ప్రయాణీకులకు  తెలియజేయడానికి ప్రవేశ ద్వారాల వద్ద, సెక్యూరిటీ నాకా వద్ద డిస్‌ప్లే బోర్డ్ డిస్‌ప్లే స్క్రీన్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. వెయిటింగ్ టైమ్ వివరాలు  సోషల్ మీడియాలో  కూడా పెడుతున్నారు.  రియల్ టైమ్ వెయిటింగ్ టైమ్ డేటా లింక్  ద్వారా ఎయిర్‌లైన్స్‌ నుంచి సమాచారం షేరింగ్ ఉంటుంది.  

iv.  ఎలాంటి అవాంతరాలు లేకుండా పనిచేసే ముఖం గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం (ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ) ఆధారంగా పనిచేసే డిజియాత్రను ఉపయోగించాల్సిందిగా ప్రయాణికులను ప్రోత్సహించడం జరుగుతోంది.  డిజి యాత్ర ప్లాట్‌ఫారమ్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి విమానంలోపల ప్రకటనలు చేస్తున్నారు.

v. టర్మినల్ 3, టర్మినల్ 2 లలో డిజియాత్ర పూర్తిగా అమలుచేశారు.  ఎంట్రీ పాయింట్ల విషయానికి వస్తే  T3 లో  15 ప్రవేశ దారులు,  T2లో 10ప్రవేశ దారులు ఉన్నాయి.  ఈ  రెండు టర్మినల్స్ కు చెందిన అన్ని జోన్లలో డిజియాత్ర అందుబాటులో ఉంటుంది.

vi. మూడవ టర్మినల్ (T3) వద్ద అదనంగా ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు.  

vii. ప్రయాణీకుల పరిశీలన కోసం అదనంగా 15 X-BIS మెషీన్‌లు చేర్చారు. మొత్తం X-రే యంత్రాల సంఖ్య T-3 డొమెస్టిక్‌లో 25కు మరియు T-3 ఇంటర్నేషనల్‌లో 19కు పెరిగింది.

viii.   జూలై 2023 నుంచి T3- 28 కౌంటర్లలో చెక్ -ఇన్ కు అవసరమైన మౌలిక సదుపాయాలను చేర్చారు.  జూలై, 2023 సెల్ఫ్ బ్యాగేజీ డ్రాప్ సౌకర్యం ప్రారంభించడం జరిగింది.  

ix.  ప్రయాణికులను జాగృతం చేసేందుకు ప్రవేశ ద్వారం వద్ద ఎయిర్ టిక్కెట్/బోర్డింగ్ పాస్ , గుర్తింపు రుజువుతో సిద్ధంగా ఉండాలని పోస్టర్ ఏర్పాటు.   ప్రవేశ ద్వారం వద్ద  ప్రయాణికుల సహాయార్థం ప్రత్యేక సిబ్బంది నియామకం.

x. టెర్మినల్ 3 లోపల కొత్త సెక్యూరిటీ జోన్  -  జోన్ 0 ఏర్పాటు.  

xi. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF)చే అదనపు సిబ్బందిని మోహరించాలని నిర్ధారణ.  

xii. CCTV & కమాండ్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ.  

xiii. విమానాశ్రయానికి వచ్చే జనం పర్యవేక్షణ కోసం లెక్కింపు మీటర్ల వినియోగం.  

xiv. విమానాల రాకపోకలకు అనుగుణంగా ఎక్కువ రద్దీ ఉండే సమయాల్లో స్లాట్లు మార్చి టెర్మినల్స్ మధ్య పీక్ అవర్ ట్రాఫిక్‌
      సంతులత చేయాలని ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌కు సూచించడమైనది.  

xv. అన్ని చెక్-ఇన్/బ్యాగేజీ డ్రాప్ కౌంటర్ల వద్ద తగినంత మంది సిబ్బందిని నియమించాలని  విమానయాన సంస్థలకు సూచించడమైనది.

xvi  విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు దిగేటప్పుడు డిసెంబార్కేషన్ ఫారం  నింపామని ప్రోత్సహిస్తారు.
ఫారమ్‌ను పూరించడంలో ప్రయాణికులకు సహాయం చేయడానికి  ప్రయాణీకులు దిగే ప్రదేశాల వద్ద సిబ్బందిని ఎయిర్‌పోర్ట్
ఆపరేటర్లు నియమిస్తారు.  

xvii. ఆటోమేటెడ్ ఎంట్రీని సులభతరం చేయడానికి అన్ని ఎంట్రీ గేట్ల వద్ద 2D బార్ కోడ్ స్కానర్ ఇన్‌స్టాల్ చేయడం జరిగింది.

xviii.  ప్రయాణీకులకు జారీచేసిన టికెట్లపై బార్‌కోడ్‌ ఉండేలా చూడాలని /పూర్తిగా పాటించాలని, తద్వారా ఎంట్రీ/సెక్యూరిటీ గేట్ల వద్ద ప్రయాణికుల రాకపోకలను సులభం చేయాలని ఎయిర్‌లైన్స్‌కు  సూచించడం జరిగింది.

xix.  ఇవన్నీ అమలుజరిగే విధంగా ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్, ఎయిర్‌లైన్స్ మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖా తమ తమ స్థాయిలో  రోజువారీ పర్యవేక్షణ జరపాలి.  విమానాశ్రయ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వలనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ చర్యలన్నీ అమలు చేయడం జరుగుతుంది.

          తమకు పిలుపు రావడం కోసం జూలై నెలలో వేచి ఉండేందుకు పట్టిన సమయాల ఆధారం రాబోయే నెలల్లో భద్రత మరియు ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్‌ల వద్ద ప్రయాణీకులు వేచిఉండే సమయం దాదాపు 10 నిమిషాలు ఉంటుందని అంచనా.

          ప్రస్తుతం విస్తరణలో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 3A ఫేజ్ లో ఉంది.  
IGIA ప్రస్తుతం దాని విస్తరణలో ఫేజ్ 3A కింద ఉంది. ఫేజ్ 3A పనులలో ప్రస్తుతం ఉన్న టెర్మినల్స్ మరియు ఆప్రాన్‌ల విస్తరణ, పాత రన్‌వే  పునరుద్ధరణ మరియు 4వ రన్‌వే (11L-29R) నిర్మాణం మరియు దానిని కలుపుతూ సమాంతర టాక్సీవేలు, తూర్పు క్రాస్ టాక్సీవే (ECT), ఉత్తర సమాంతర టాక్సీవే , అనేక ఇతర ఎయిర్‌సైడ్ లతో  దాని సంధానం ఉన్నాయి. సర్క్యులేషన్ మరియు కనెక్టివిటీ మెరుగుదల అభివృద్ధి మరియు టెర్మినల్ 3 సవరణ వంటి భూ సంబంధ పనులలో  ఉన్నాయి. తూర్పు క్రాస్ టాక్సీవే మరియు 4వ రన్‌వే పూర్తయ్యి వినియోగంలో  ఉన్నాయి. 3A దశ  ప్రాజెక్టు నిర్మాణ (భౌతిక) పురోగతి 31 జూలై 2023 నాటికి 92.83% పూర్తయ్యింది.

        పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్)  లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా  ఈ సమాచారం అందించారు.


 

***


(Release ID: 1948857) Visitor Counter : 100
Read this release in: English , Urdu , Marathi , Tamil