ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జనాభా నియంత్రణకు తీసుకున్న చర్యలు
Posted On:
11 AUG 2023 2:11PM by PIB Hyderabad
ప్రభుత్వం జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. కుటుంబ నియంత్రణకు సంబంధించి సాధించవలసిన లక్ష్యాల వెలుగులో, జాతీయ జనాభా విధానం 2000 , జాతీయ ఆరోగ్య విధానం 2017 సూత్రాలకు
అనుగుణంగా, ఇది అమలవుతోంది.
ప్రభుత్వం తీసుకున్న చర్యలు:
విస్తారిత గర్భనిరోధ ప్రత్యామ్నాయాలు: ప్రస్తుతం గర్భనిరోధ పద్ధతులలో కండోమ్ల వాడకం, నోటీద్వారా మాత్రల వినియోగం, అత్యవసర గర్భ నిరోధమాత్రలు, గర్భాశయలోపల వాడే
గర్భనిరోధ సాధనం(ఐయుసిడి), గర్భనిరోధ ఆపరేషన్ వంటి వాటికి తోడు, కొత్తగా గర్భనిరోధానికి సంబంధించి ఇంజెక్ట్ చేయడానికివీలైన గర్భ నిరోధకం ఎంపిఎ(అంతారా కార్యక్రమం), సెంట్ క్రోమన్ (చాయా)లను కూడా చేపట్టడం జరిగింది.
గర్భనిరోధక సాధనాలను అందుబాటులోకితేవడం, కుటుంబ నియంత్రణ సేవలను అందుబాటులోకి తేవడానికి మిషన్ పరివార్ వికాస్ 13 రాష్ట్రాలలో అమలు జరుగుతోంది
కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకునే వారికి పరిహారం ఇవ్వడం జరుగుతోంది. ఇది వారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న సమయంలో వారు ఉపాధి కోల్పోయిన దానికి పరిహారం గా ఇస్తారు.
గర్భం అనంతరం పోస్ట్ పార్టమ్ ఇంట్రా యుటెరిన్ కాంట్రాసెప్టివ్ డివైస్ (పిపిఐయుసిడి), అబార్షన్ అనంతరం ఇంట్రా యుటిరిన్ కాంట్రాసెప్టివ్ డివైస్ (పిఎఐయుసిడి), పోస్ట్ పార్టమ్ స్టెరిలైజేషన్ (పిపిఎస్) లను లబ్ధిదారులకు కల్పించడం జరుగుతుంది.
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కుటుంబ నియంత్రణ గురించి, కుటుంబ నియంత్రణ సేవల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం, ప్రపంచ జనాభా దినోత్సవం, ప్రపంచ జనాభా పక్షోత్సవం,
వాసెక్టమీ పక్షోత్సవం వంటి వాటిని అమలు చేస్తున్నారు.
ఇంటివద్దకే గర్భనిరోధకాలను సరఫరా చేసే కార్యక్రమం కింద , ఆశా కార్యకర్తలు , ఆయా లబ్ధిదారులకు గర్భనిరోధక సాధనాలను ఇంటివద్దనే అందజేస్తారు.
కుటుంబ నియంత్రణ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ –ఎఫ్.పి. ఎల్.ఎం.ఐ.ఎస్ కింద అన్ని ఆరోగ్యకేంద్రాలలో కుటుంబ నియంత్రణకు అవసరమైన సాధనాలను అందుబాటులో ఉండేలా చూస్తారు.
ప్రభుత్వం జనాభా పెరుగుదలను విజయవంతంగా అరికడుతోంది. ఇందుకు సంబంధించి ఈ కింది ప్రగతిసాధించడం జరిగింది.
మొత్తం జననాల రేటు 2015–16 సంవత్సరం(ఎన్.ఎఫ్.హెచ్.ఎస్ 4)లో 2.2 ఉండగా అది 2019–21లో 2.0 కి పడిపోయింది.(ఎన్.ఎఫ్.హెచ్.ఎస్ 5) ఇది రిప్లేస్మెంట్ స్థాయికంటే తక్కువ.
36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 31 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు రిప్లేస్మెంట్స్థాయి సంతాన సాఫల్యత సాధించాయి(ఎన్ఎఫ్హెచ్ఎస్ 5)
ఆధునిక గర్భినిరోధాల వాడకం 2015–16(ఎన్.ఎఫ్.హెచ్.ఎస్ 4)లో 47.8 శాతం ఉండగా, 2019–21 లో (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్ 5) అది 56.5 శాతానికి పెరిగింది.
కుటుంబనియంత్రణ సాధనాలు వాడవలసిన వారి సంఖ్య 2015–16లో(ఎన్.ఎఫ్.హెచ్.ఎస్ 4) 12. 9 శాతం ఉండగా 2019–21 కి ( ఎన్.ఎఫ్.హెచ్.ఎస్ 5) కి ఇది 9.4 శాతానికి పడిపోయింది.ముడి జనన రేటు 2015 లో 20.8 శాతం ఉండగా 2020 లో ఇది 19.5 శాతానికి పడిపోయింది.కేంద్ర ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి ప్రోఫెసర్ ఎస్.పి.సింగ్ బఘెల్ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1948855)
Visitor Counter : 116