ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పిల్లలు వారికి ఆసక్తి కల రంగాన్ని ఎంచుకోనివ్వాలి. తల్లిదండ్రులు వారిపై ఒత్తిడిపెట్టకూడదు – ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్


పికాసో తల్లిదండ్రులు ఆయన ఒక సివిల్ సర్వెంట్ కావాలనో,ఇంజనీర్ కావాలనో పట్టుబట్టి ఉంటే మనకు అంతగొప్ప చిత్రకారుడు లభించేవాడు కాదు.: ఉపరాష్ట్రపతి

మానవాళికి మాదకద్రవ్యాలు ఒక సవాలుగా మారాయి. మన మూల సాంస్కృతిక, కుటుంబ విలువలకు దూరం కావడమే మాదకద్రవ్యాలకు బానిసలుకావడానికి కారణం : ఉపరాష్ట్రపతి

మాదకద్రవ్యాల విషయంలో ప్రభుత్వ అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించిన ఉపరాష్ట్రపతి.

మాదకద్రవ్యాల బాధితుల పట్ల ఆరోగ్యకరమైన,సానుకూల దృక్పథంతో వ్వవహరించాలని ఉపరాష్ట్రపతి పిలుపు.
కేరళ లో నెహ్రూయువ కేంద్ర నిర్వహించిన మన్ కీ బాత్ క్విజ్ కార్యక్రమ విజేతలతో ముచ్చటించిన ఉపరాష్ట్రపతి

Posted On: 12 AUG 2023 8:17PM by PIB Hyderabad

పిల్లలు ఫొటోగ్రాఫర్‌ గానో, లేక సంగీతజ్ణుడు గానో కావాలని అనుకుంటుంటే తల్లితండ్రులు మాత్రం తమ పిల్లలను సివిల్‌ సర్వెంట్లుగానో, ఇంజనీర్లుగానో కావాలని ఒత్తిడిచేస్తుండడం పట్ల , ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ కర్  తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేరళ నుంచి వచ్చి తనను ఉపరాష్ట్రపతి నివాస్‌ లో కలసిన విద్యార్ధులనుద్దేశించి, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్  ప్రసంగించారు. తల్లిదండ్రులు తాము ఎలాంటి జీవితం గడపాలనుకున్నారో దానిని పిల్లల ద్వారా సాధించాలని చూస్తున్నారని , ఇది సరైనది కాదని ఆయన అన్నారు. కేరళ నుంచి వచ్చి ఉపరాష్ట్రపతిని కలుసుకున్న విద్యార్థులంతా, తిరువనంతపురం నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌ నిర్వహించిన మన్‌ కీ బాత్‌ క్విజ్‌ పోటీలలో విజేతలుగా నిలిచినవారు.
 ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఉపరాష్ట్రపతి, మాదకద్రవ్యాల దుర్వినియోగం ప్రపంచానికి ముప్పుగా పరిణమించిందని అన్నారు. మానవాళికి , మాదకద్రవ్యాలు ఒక సవాలుగా మారాయని అంటూ, ఇది ప్రపంచాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లగల మేధస్సుగల వారిని ధ్వంసం చేస్తున్నదని చెప్పారు.
మాదకద్రవ్యాల పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడం పట్ల  అభినందనలు తెలిపారు., మాదకద్రవ్యాల కార్యకలాపాలకు పాల్పడే వారిపట్ల అధికార యంత్రాంగం మరింత కఠినంగా ఉండాలని అంటూ,
మాదకద్రవ్యాలనుంచి డబ్బు సంపాదించే వారిగుట్టు బయటపెట్టేందుకు ఏమాత్రం భయపడవద్దని సూచించారు.
మాదక ద్రవ్యాల బారిన పడిన బాధితుల పట్ల సానుకూల,ఆరోగ్య కరమైన వైఖరి అనుసరించాల్సిందిగా ఆయన సూచించారు. మాదక ద్రవ్యాల బాధితులకు , డీ అడిక్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకటి రెండు సార్లు మాదక ద్రవ్యాలు  సేకరించిన వారిని మాదకద్రవ్యాల బానిసలుగా ముద్ర వేయరాదన్నారు.
 అవినీతి అనేది సామాన్యుడిపాలిట అతిపెద్ద శత్రువని అంటూ ఉపరాష్ట్రపతి, ఇది ప్రజలకు సమాన అవకాశాలను కోల్పోయేలా చేస్తుందని, దేశ ప్రగతిని అడ్డుకుంటుందని అన్నారు. అవినీతిపై కఠిన వైఖరి అనుసరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉపరాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. అధికార కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను మధ్యవర్తులనుంచి విముక్తి చేసినట్టు ఉపరాష్ట్రపతి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రజానుకూల చర్యలైన, హర్‌ఘర్‌జల్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, డిజిటల్‌ బదిలీల గురించి ప్రస్తావిస్తూ ఉపరాష్ట్రపతి, సమ్మిళితత్వం అనేది ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉంది. ఇది మన ఆర్థిక వ్యవస్థను సమాజాన్ని పరివర్తన చెందించింది. ప్రతి సామాన్యుడికి సాధికారత కల్పించింది అని ఉపరాష్ట్రపతి అన్నారు.
 విద్యార్థులు దేశమే ముందు అన్న భావన కలిగి ఉండాలని అంటూ, దేశానికి చెందిన సంస్థల పేరు ప్రతిష్ఠలను మసకబార్చే, దెబ్బతీసే వారి చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మురళీధరన్‌కూడా పాల్గొన్నారు.
ఉపరాష్ట్రపతి ప్రసంగం (ముఖ్యాంశాలు)`
 ప్రతిఒక్కరికీ శుభసాయంత్రం.
ఇవాళ నేను ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, నేను కేరళ మానవ వనరుల ద్వారా రూపుదిద్దుకున్న వ్యక్తిని. మా ఉపాధ్యాయురాలు శ్రీమతి రత్నా నాయర్‌, మాగురువు. నేను వారి వూరికి వెళ్లాను. నేను , నాశ్రీమతితో కలిసి వెళ్లి మా ఆమె కు పాదనమస్కారం చేసుకుని వచ్చాను.  ఆమె మా క్లాస్‌ టీచర్‌. మా ఇంటి టీచర్‌. ఎంతో మేథస్సు కలిగిన వ్యక్తి. అంతే కఠినంగానూ ఉండే వారు. నేను తినే డైనింగ్‌ టేబుల్‌ పైనే ఆమెకూడా తినేవారు. నేను ఆమెకు ఎంతో రుణపడిఉన్నాను. కేరళ లో అద్బుతమైన మానవ వనరులు ఉన్నాయి. అవి అంతర్జాతీయంగా ప్రభావాన్ని చూపాయి. ఆరోగ్యం, విద్య, విషయానికి వస్తే కేరళ సూచీలు పై స్థాయిలో ఉన్నాయి.  ప్రత్యేకించి మీ నగరం ఒక శక్తి కేంద్రం. గొప్ప వ్యక్తులు, గొప్పదార్శనికులకు ఇదికేంద్రం.
మనం విజేతలుగా నిలుస్తున్న కాలంలో ఉన్నాం. నేను తొలిసారిగా 1989లో పార్లమెంటులో అడుగుపెట్టాను. అప్పటికి మీలో కొందరు ఇంకా పుట్టిఉండరు కూడా.  నేనుపార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నాను. ఇది నేను అప్పటికి ఊహించనుకూడా లేదు. మనం ఊహించనివి ఇప్పఉడు జరుగుతున్నాయి. మీ చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించండి.  ఇండియా అద్భుతంగా ముందుకు దూసుకువెళుతున్నది.  మనం సాధిస్తున్న విజయాలు తిరుగులేని విధంగా ఉన్నాయి. మన ప్రగతిని చూసి ప్రపంచం నివ్వెరపోతున్నది. మన రోడ్లు, మన జాతీయ రహదారులు, మన రైళ్ళు, మన డిజిటల్‌ అనుసంధానత, మన డిజిటల్‌ లావాదేవీలు, ఇవన్నీ ప్రపంచం నివ్వెరపోయేలా ఉన్నాయి. ప్రధానమంత్రి మ్యూజియం ను తిలకించండి, ఇది మీ మనసుకు హత్తుకునేలా ఉంటుంది.  కర్తవ్యపథ్‌లో యుద్ధ స్మారకానికి వెళితే, అక్కడ మీరు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌విగ్రహాన్ని తిలకిస్తారు. మీరు అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ ను సందర్శించినట్టయితే, అది ప్రపంచంలోనే అద్భుతమైనదిగా గమనించగలరు. ఇక్కడే జి20 సమావేశాలు జరుగుతాయి. ఇండియా అభివృద్ధిపథంలో పయనిస్తోంది. ఆర్థికవృద్ధిలో ఇది ప్రతిఫలిస్తోంది.
 సంవత్సరం క్రితం, మనం అంతర్జాతీయంగా ఐదో పెద్ద అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. ఈ క్రమంలో మనం మనల్ని శతాబ్దాలపాటు పాలించిన వలసపాలకులను అధిగమించాం. వారు మనకింది వరుసలో ఉన్నారు.  రవిఅస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం అని ఒకనాడు చెప్పుకున్నారు. కానీ నేడు, సూర్యకిరణాలు మహోజ్వలంగా భారత్‌పై ప్రసరిస్తున్నాయి. ఇవాళ యుకె మన కంటే కింద ఉంది. మీరు ఐఎంఎఫ్‌ కు వెళితో , ఇండియా గురించి ఏం చెబుతారు? నేను రెండు సార్లు ఐఎంఎఫ్‌ అధిపతిని కలిశాను.  ఒకసారి ఏసియాన్‌ సదస్సులో ఒకసారి, ఖతార్‌లో ఒకసారి.  అక్కడ నేను ఫిఫా ప్రారంభోత్సవ సమావేశంలో పాల్గొన్నాను. అక్కడ వారు ఇండియా అద్భుతమైన దేశమని, పెట్టుబడులకు అత్యం అనుకూల దేశమని, , అవకాశాల గని అని చెప్పారు.  మనకు దశాబ్దాలుగా సలహాలు ఇచ్చినవారు ఇప్పుడు మన సలహాలు తీసుకుంటున్నారు. ఇది భారతదేశం సాధించిన విజయం.బ్యాంకింగ్‌ రంగంలో సాధించిన విజయాన్ని గమనించినట్టయితే, ఇది సమ్మిళిత మైంది. ప్రతిఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉంది.  ఇది మన ఆర్థికసమాజాన్ని పరివర్తన చెందించింది. మానవ వనరులకు సాధికారత కల్పించింది.  అంతర్జాతీయ బెంచ్‌ మార్క్‌నుగమనించినట్టయితే, అంతర్జాతీయ డిజిటల్‌ లావాదేవీలలో మనం 46 శాతం వరకు ఉన్నాం. 2022 లో  మన డిటిటల్‌ లావాదేవీలు, అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీల మొత్తం లావాదేవీల కన్న నాలుగు రెట్లు ఎక్కువ.  మనం ఈ స్థాయికి చేరుకున్నాం. ఇక ఇంటర్నెట్‌  వినియోగం విషయానికి వస్తే, మన తలసరి ఇంటర్నెట్‌ వినియోగం, అమెరికా, చైనాల రెండిరటిని కలిపిన దానికంటే ఎక్కువ.  ప్రతి జీవన రంగంలోనూ,  మన వేలాదిసంవత్సరాల సాంస్కృతిక చరిత్రను సమర్దించుకుంటున్నాం . కోవిడ్‌ మహమ్మారి రోజులను గమనిద్దాం. ఒకవైపు మనం దేశంలో  1.3 బిలియన్ల మంది ప్రజలు ,కోవిడ్‌ పై పోరాటం చేశారు. మరో వైపు మనం పలు ఇతర దేశాలకు వాక్సిన్‌ను సరఫరా చేశాం. విదేశీ అతిథులు నన్ను కలుసుకోవడానికి వచ్చినపుడు, తొలిగా వారు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తూవచ్చారు. అలాగే కోవిడ్‌ మహమ్మారి సంక్షోభ సమయంలో తమకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపేవారు. ఇండియా వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

.భారతదేశంపు గొంతుక ఈ స్థాయిలో మున్నెన్నడూ వినపడలేదు. ఇది ఇప్పటికీ వినిపిస్తోంది. మీరు మన ప్రధానమంత్రి అమెరికా కాంగ్రెస్‌సెనేట్‌లో చేసిన ప్రసంగం చూడండి. మీ అందరినీ నేను ఆ ప్రసగం వినాల్సిందిగా కోరుతున్నాను. అమెరికాలోని అన్ని రాజకీయ పార్టీలు, ఆయనను ప్రపంచంలోని అతి పెద్ద, పురాతన ప్రజాస్వామిక దేశానికి ప్రధానమంత్రిగా గుర్తించి , గౌరవించాయి. ప్రపంచ మానవాళిలో ఆరోవంతు ప్రజలు ఇక్కడ నివశిస్తున్నారు. మనదేశంలో ఇప్పుడు మనకు రకరకాల రైళ్లు, జాతీయ రహదారులు ఉన్నాయి.  ప్రతి ఇంటికీ టాయిలెట్‌ సదుపాయం ఉంటుందని ఊహించారా? ప్రతిగ్రామానికి విద్యుత్‌ సరఫరా ఉంటుందని ఊహించారా? అనుసంధానత అనేది ఇప్పుడు ఒక ముఖ్య విషయం గా మారింది. ఇది ప్రస్తుతం జరుగుతోంది. ఇక హర్‌ ఘర్‌ నాల్‌ అనే పథకం ఒకటి ఉంది. ఇది గణాంకాలకే పరిమితం కాదు. నీటి సరఫరా మాత్రమే కాదు, నాణ్యమైన నీటి సరఫరా జరుగుతోంది. నేను  ప్రత్యేకంగా యువతకు ఒక పిలుపునిస్తున్నాను. మీరంతా భారతీయులు అందుకు గర్వపడండి. మీరు ఈ విషయంలో సర్దుబాటు ధోరణితో వ్యవహరించకూడదు.  మనం చారిత్రకంగా సాధించిన విజయాలను గర్వంగా ఫీల్ కండి.  అన్నింటా దేశ ప్రయోజనాలే ముందు వరుసలో ఉండేట్టు చూడండి.  కొందరు దురుద్దేశంతోనో లేక అజ్ఞానంతోనో, తప్పుడు ఆలోచనతోనో, దేశ ప్రతిష్ఠను మసకబార్చేందుకు ప్రయత్నించేవారిపట్ల అప్రమత్తంగా ఉండండి. అలాంటి వారి గురించి ఆలోచించండి. వారి ప్రయత్నాలను తిప్పికొట్టండి. ఎందుకంటే భారత్ గొప్పగా ఎదుగుతోంది. శాంతి, సహజీవనం వంటి వాటి విషయంలో అంతర్జాతీయంగా అత్యంంత అనుకూల మైన స్థితిలో ఉంది. 

నేనొక చారిత్రక సత్యాన్ని మీతో ప్రస్తావిస్తాను. మనదేశం చరిత్రలో , ఎన్నడూ దురాక్రమణకు పాల్పడలేదు.  దురాక్రమణదారులే ఇక్కడికి వచ్చారు. మనం ఎన్నడూ విస్తరణకు పాల్పడలేదు.  మన దేశం ఎప్పుడు యుద్ధ మార్గాన్ని ఎంచుకోలేదు.  చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి సంకల్పం. ప్రపంచం మన వైపు చూస్తున్న తరుణంలో మీరు భారత్ లో జీవనం సాగిస్తుండడం మీ అదృష్టం. 2047 నాటికి  నా వయసువారు ఉండకపోవచ్చు. కానీ మీరు క్షేత్రస్థాయి సైనికులుగా ఉంటారు. 2047 భారత్ లో మీరే నిజమైన వీరులు. మీరు మీ కలలను సాకారం చేసుకుంటారు.  ఇండియా 2047 లో అత్యున్నతస్థాయిలో , ప్రపంచనాయకత్వ స్థానంలో ఉండేట్టు  చూస్తారు.  చారిత్రకంగా చూసినపుడు గతంలో మనం ప్రపంచ నాయకత్వ స్థానంలో ఉన్నాం. ఇది జరిగితే, మొత్తంగా ప్రపంచం సుస్థిరత పొందుతుంది.  ఒక ఆలోచన చేయండి. సంవత్సరాలుగా జరిగిన మార్పును ఆస్వాదించండి.  గతంలో మీకు కనిపించని విషయాలు మీరు గమనించడం మొదలు  పెడతారు. అవి పిఎం మ్యూజియం, కన్వెన్షన్ సెంటర్, వంటివి. నూతన పార్లమెంటు భవనం ప్రపంచానికే తలమానికం. పట్టుమని 30 నెలల్లో దీని నిర్మాణం జరిగింది. కోవిడ్ మహమ్మారి వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఇది పూర్తి అయింది. ఒకప్పుడు రాజ్ పథ్ గా ఉన్నది ఇప్పుడు కర్తవ్య పథ్ గా జరిగిన మార్పును గమనించండి. ఇది క్షేత్ర స్థాయి వాస్తవం.  ప్రతి ఒక్కటీ మీ భుజస్కంధాలపై ఉంది.  ప్రతి ఒక్కటీ మీరే సాధించాలి.  గౌరవ ప్రధానమంత్రి మీ బాగోగులు చూసుకుంటారు.

యువతకు ఇంకో విషయం, మూడు దశాబ్దాల తర్వాత మన భారతదేశానికి నూతన విద్యావిధానం రూపుదిద్దుకుంది. వందలు, వేల మంది ప్రజల అభిప్రాయాలను తీసుకుని దీనిని రూపొందించారు. నేనే పశ్చిమబెంగాల్ గవర్నర్గా పనిచేశాను. వ్యక్తిగతంగా దీనిగురించి నాకు తెలుసు. ఇప్పుడు మన విద్యావిధానం డిగ్రీల కోసం ఉన్న విధానం కాదు.  ఇది నైపుణ్యాలతో కూడినది.  మీరు ఒకేసారి రెండు డిగ్రీలు పొందవచ్చు.  ఇది మన పూర్తి శక్తి సామర్ధ్యాలను వెలికితీసేందుకు దోహదపడేది. నేను  కొన్ని సూచనలు చేస్తాను.

ఎప్పుడూ టెన్షన్ పెట్టుకోకండి.  ఎప్పుడూ ఒత్తిడికి గురికాకండి. భయపడకండి, మీకు ఒక మంచి ఆలోచన ఉండవచ్చు. కానీ ఓటమి  భయం వల్ల ఆ మంచి ఆలోచనను అమలు చేయలేక పోవచ్చు. దీనివల్ల ప్రపంచం మీ టాలెంట్ను కోల్పోవచ్చు. తొలి ప్రయత్నంలోనే ఎవరూ చంద్రుడిపై దిగలేదు.  ఆర్కిమెడిస్‌ యురేకా అని అన్నప్పుడు కూడా అది ఆయనకు తొలి ప్రయత్నం కాదు. పోటీని దృష్టిలో ఉంచుకోవాలి. మీతో మీరు పోటీపడాలి. అంతే తప్ప ఇతరులతో కాదు.

 నేను చదువులో క్లాస్‌టాపర్‌గా ఉంటూ వచ్చాను. నేను ప్రథమస్థానంలో నిలవకపోతే ఏం జరుగుతుందని ఎప్పుడూ నన్నునేను ప్రశ్నించుకునే వాణ్ణి. నేను క్లాస్‌లో మొదటిస్థానంలో నిలవకపోతే మిన్ను విరిగి మీద పడుతుందన్నంతగా కంగారుపడే వాణ్ణి. గుర్తుంచుకోండి, ఎప్పుడూ మిన్ను విరిగిమీద పడలేదు. అలాగే అవి మీ మీదా పడబోవు. వేల వేల సంవత్సరాలుగా అవి ఎప్పుడు విరిగిపడలేదు. అవి మీ కోసం పడబోవు. ఈ విషయాన్ని నేను జీవితంలో చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఈ విధమైన భావనే లేకుంటే నేను నా స్నేహితులతో మరింత ఎక్కువ సమయం గడిపి ఉండేవాణ్ణి. ఎక్కువగా నా హాబీలకు నా అభిరుచులకు అనుగుణంగా గడిపిఉండే వాణ్ణి.

తల్లిదండ్రులు, పిల్లలపై ఒత్తిడి తెచ్చివారు ఏం కావాలో వారే చెబుతున్నారు. వారు సహేతుకం కాని రీతిలో తమ డిమాండ్లు చెబుతున్నారు. వారు తాము ఎలా జీవించాలనుకున్నారో, దానిని పిల్లల ద్వారా సాధించాలనుకుంటున్నారు. ఇది మంచిది కాదు. జీవితంలో ప్రతిదశలో విజయం ఉంటుంది. మీ దృక్పథాన్ని బట్టిదానిని మీరుఅర్థం చేసుకోవాలి.  ఇక రెండోది, ఇండియాలో మీరు ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ మనసులో ఏదైనా ఆలోచన ఉంటే, ఆ ఆలోచనను మీ మిత్రులతో పంచుకోండి. విఫలమౌతుందని ఆలోచించకండి.

 మీరు ఆ స్థితిలో ఉన్నందువల్ల  మీరు మూడు విషయాలను గుర్తించలేకపోతారు. నేను మంత్రిగా 34 సంవత్సరాలు పనిచేశాను. మేం బంగారాన్ని అమ్మి మా పై విశ్వాసాన్ని నిలబెట్టుకోవలసి వచ్చింది. బయట ఉన్న నిల్వలు తరిగిపోవడంతో మేం ఈ పనిచేయవలసి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి లో మార్పు వచ్చింది.  మనం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధిచెందే దేశంగా ఎదిగాం.  మనం దీనిని  సాధించాం. గతంలో అధికార ప్రాంగణాలలో మధ్యవర్తులు, పవర్‌ బ్రోకర్లు ఉండేవారు. ఇప్పుడు అలా లేదు . అధికార ప్రాంగణాలను మధ్యవర్తుల రహితంగా , అవినీతి రహితంగా తీర్చిదిద్దడం జరిగింది. అవినీతి అనేది సామాన్యుడికి పెద్ద శత్రువు. అవినీతి సమానత్వం, సమాన అవకాశాలను అడ్డుకుంటుంది. అవినీతి మన అభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం లో అవినీతి ఎంతమాత్రం లేదు. పై నుంచి కింది స్థాయివరకు పాలనలో ఎలాంటి అవినీతి లేదు. పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది.
        ఈ దేశ యువ పౌరులుగా మీ పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఒకప్పుడు ప్రజలు విదేశాలకు వెళ్లిన రోజులున్నాయి. వారు అరటిపళ్లుతినేవారు. కానీ అరటితొక్కలు అక్కడ కిటికీలోంచి రోడ్డుపైకి విసిరేసేవాళ్లు కాదు. వారు క్రమశిక్షణ పాటించేవారు. అక్కడ మర్యాదలు పాటించేవారు. అదే వ్యక్తులు  తిరిగి మనదేశానికి రాగానే, అరటి తొక్కలు  రోడ్డుపైకి విసిరివేయడం తమ హక్కు అన్నట్టు వ్యవహరించేవారు.  ఇప్పుడు ఈ పరిస్థితి మారిపోయింది. ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించడంతో పరిస్థితి మారింది. మనం రోడ్లపై ఇంకా క్రమశిక్షణతో మెలగాల్సి ఉంది.  మనం ఎన్నో జాతీయ రహదారులను నిర్మించుకున్నాం. నాలుగు లేన్ల రహదారులు నిర్మించుకున్నాం. అయినా క్రమశిక్షణ పాటించం.  కొంతమంది ప్రజలు సంపన్నులు.. వారికి డబ్బు ఉంది. అయితే  వారికి డబ్బు ఉంది కనుక పెట్రోలియం పై ఎక్కువ ఖర్చుపెడతామంటే కుదరదు. సహజవనరుల వినియోగం సరైనవిధంగా ఉండాలి. ఖర్చుపెట్ట గల శక్తి నాకు ఉంది  కనుక నేను పెట్రోలుపై ఎక్కువ ఖర్చుపెడతాననే ధోరణి సరికాదు.  సహజ వనరులను సరిగా వినియోగించాలి. మనం దాని గురించి నొక్కి చెప్పాలి. మనం ఇంధనాన్ని పొదుపు చేస్తే, మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్లం అవుతాం. మనం పేపర్ని పొదుపుచేస్తే, మనం పర్యావరణాన్ని కాపాడినట్టే. మనం నీటిని పొదుపు చేస్తే, మనం సమాజానికి సేవ చేస్తున్నట్టే.

 

         

****


(Release ID: 1948854) Visitor Counter : 105