సహకార మంత్రిత్వ శాఖ

గుజరాత్‌లోని గాంధీధామ్‌లో ఈరోజు ఇఫ్కో నానో డిఎపి (లిక్విడ్) ప్లాంట్‌కు భూమి పూజ చేసి శంకుస్థాపన చేసిన కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా


సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ‘సహకార్ సే సమృద్ధి’ దార్శనికతతో దేశంలోని కోట్లాది మంది రైతులను సుభిక్షంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

నానో డిఎపి (ద్రవ) పిచికారీ భూమిని కలుషితం చేయదు. ఇది సహజ వ్యవసాయాన్ని మరింత సులభతరం చేస్తుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తితో పాటు భూసారాన్ని పెంచుతుంది మరియు భూ పరిరక్షణను ప్రోత్సహిస్తుంది.

ఇఫ్కో నానో ఎరువులను ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే మొదటిది. ఎరువుల రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాధించడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుంది.

ఎరువులు సరైన పరిమాణంలో మరియు తగిన ధరకు లభించినప్పుడు రైతుల శ్రేయస్సు పెరుగుతుంది

ప్రధాన మంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో ఈ దేశానికి మరోసారి హరిత విప్లవం అవసరం. ఈ హరిత విప్లవం భిన్నమైన రకంగా ఉంటుంది మరియు దాని లక్ష్యం కేవలం ఉత్పత్తి మాత్రమే కాదు.

భారతదేశంలోని కొత్త హరిత విప్లవం ప్రపంచానికి సహజ వ్యవసాయ మార్గాన్ని చూపుతుంది. రైతులు తమ ఉత్పత్తులకు ఎక్కువ విలువను మరియు ఎకరాకు గరిష్ట దిగుబడిని పొందేందుకు ఇటువంటి హరిత విప్లవం తీసుకురావా

Posted On: 12 AUG 2023 6:05PM by PIB Hyderabad

కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు గుజరాత్‌లోని గాంధీధామ్‌లో ఇఫ్కో నానో డిఎపి (లిక్విడ్) ప్లాంట్‌కు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇఫ్కో చైర్మన్ శ్రీ దిలీప్ సంఘానితోపాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ‘సహకార్ సే సమృద్ధి’ దృక్పథంతో దేశంలోని 15 కోట్ల మంది రైతులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. 3 మిలియన్ టన్నుల డిఎపిని ఉత్పత్తి చేసే ఇఫ్కో ప్లాంట్ కంటే ఎక్కువగా గాంధీధామ్‌లో రానున్న ప్లాంట్ ఉత్పత్తి చేస్తుందని ఆయన అన్నారు. ద్రవ ఎరువులు దేశ ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయ రంగానికి బహుముఖ ప్రయోజనాలను అందించబోతున్నాయని కేంద్ర సహకార మంత్రి అన్నారు. నానో డిఎపి (ద్రవ) పిచికారీ భూమిని కలుషితం చేయదు. ఇది సహజ వ్యవసాయాన్ని మరింత సులభతరం చేస్తుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తితో పాటు భూసారాన్ని పెంచుతుంది మరియు భూ పరిరక్షణను ప్రోత్సహిస్తుంది అని చెప్పారు.

 

image.png


ఇఫ్కో డిఏపి (లిక్విడ్‌) భూమి లోపలికి వెళ్లదు. కానీ పంట పైభాగంలో ఉంటుంది. అందులోవల్ల డిఏపి ప్రయోజనాలు పంటకు అందుబాటులోకి రావడమే కాకుండా భూమి కూడా సంరక్షించబడుతుందని కేంద్ర సహకార మంత్రి అన్నారు. డిఎపి (ద్రవ) నీటిని కలుషితం చేయదు. అలాగే ఉత్పత్తిని పెంచడంతో పాటు సరసమైన ధరలో అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ సబ్సిడీ భారాన్ని తగ్గిస్తుంది.యూరియా మరియు డిఎపి రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి దిగుమతులను తగ్గిస్తుంది. ఈ ముఖ్యమైన చొరవ కోసం ఇఫ్కోను అభినందిస్తూ ఇఫ్కో ప్రపంచంలోనే తొలిసారిగా నానో ఎరువులను ప్రవేశపెట్టడమే కాకుండా ఎరువుల విషయంలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.

ఎరువులు సరైన పరిమాణంలో సరైన ధరకు లభించినప్పుడే రైతులు మరింత సుభిక్షంగా ఉంటారని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో ఈ దేశానికి మరోసారి హరిత విప్లవం అవసరమని అయితే ఈ హరిత విప్లవం మరో రకంగా ఉంటుందని దీని లక్ష్యం కేవలం ఉత్పత్తి మాత్రమే కాదని ఆయన అన్నారు. ఇతర దేశాల నుంచి గోధుమలు, బియ్యాన్ని దిగుమతి చేసుకునే రోజులు పోయాయని శ్రీ షా అన్నారు. నేడు మన శాస్త్రవేత్తల కృషి అనేక ప్రభుత్వాల నిరంతర కృషి మరియు గత తొమ్మిదేళ్లలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శాస్త్రీయ ప్రణాళికల కారణంగా భారతదేశం ఆహార రంగంలో స్వావలంబన సాధించింది అని తెలిపారు. నూతన హరిత విప్లవంలో భారతదేశం ప్రపంచానికి సహజ వ్యవసాయ మార్గాన్ని చూపవలసి ఉంటుందని, ఈ హరిత విప్లవానికి సహజ వ్యవసాయం అవసరమని కేంద్ర సహకార మంత్రి అన్నారు. ఇలాంటి హరిత విప్లవం తీసుకురావాల్సిన అవసరం ఉందని, తద్వారా రైతులు పండించిన పంటకు ఎక్కువ విలువ లభిస్తుందని, ఎకరాకు అత్యధిక దిగుబడి వచ్చేలా ఉందన్నారు. దీనితో పాటు హరిత విప్లవం భారతదేశ రైతుల సేంద్రీయ ఉత్పత్తులను ప్రపంచమంతటా ఎగుమతి చేయడంలో సహాయపడుతుంది మరియు భారతదేశాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని చెప్పారు.

 

image.png


ప్రధాని మోదీ దార్శనికత అయిన “సహకార్ సే సమృద్ధి”  సాకారం చేసేందుకు సహకార మంత్రిత్వ శాఖ మూడు బహుళ రాష్ట్ర సహకార సంఘాలను ఏర్పాటు చేసిందని ఆ మూడు సంఘాలు ఈ మూడు లక్ష్యాలను నెరవేరుస్తాయని కేంద్ర హోం మరియు సహకార మంత్రి తెలిపారు. ముందుగా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా విత్తనాలను ప్రోత్సహించి, సవరించి, పాత విత్తనాలను భద్రపరిచి, రైతుకు ఎకరాకు దిగుబడి వచ్చేలా కృషి చేస్తుందన్నారు. రెండవ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ రైతుల నుండి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తుంది. భూమి తల్లిని కాపాడేందుకు చాలా మంది రైతులు సహజ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారని అయితే వారికి రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయని శ్రీ షా చెప్పారు. మొదటి సమస్య ఏంటంటే ధృవీకరణ లేకపోవడం వల్ల ప్రజలు వారి ఉత్పత్తిని ఆర్గానిక్‌గా పరిగణించరు మరియు రెండవది వారు చేసినా ఎవరూ దానికి మంచి ధర చెల్లించాలని అనుకోరు. నేడు దేశంలో చాలా మంది ప్రజలు సేంద్రీయ ఆహారం, కూరగాయలు, గోధుమలు, బియ్యం, పప్పులు మరియు నూనెను మంచి ధరకు కొనాలని కోరుకుంటారు, కానీ దాని ధృవీకరణ మరియు మార్కెటింగ్ వ్యవస్థ లేదు. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రభుత్వం బహుళ రాష్ట్ర సహకార సంఘాన్ని ఏర్పాటు చేసిందని, దీని ద్వారా భూమిని ధృవీకరించి రైతుల నుంచి సేంద్రియ ఉత్పత్తులను ఉత్పత్తి చేసి కొనుగోలు చేస్తుందన్నారు. ఈ ఉత్పత్తులను దేశవ్యాప్త మార్కెట్‌లో మంచి బ్రాండ్‌తో, ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో విక్రయించి లాభం నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. ఎగుమతుల కోసం మూడో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసినట్లు శ్రీ షా తెలిపారు. ఈ బహుళ-రాష్ట్ర సహకార సంఘం చిన్న రైతు ఉత్పత్తులను కూడా ప్రపంచ మార్కెట్‌కు తీసుకెళ్లడానికి ఎగుమతి వేదికగా మారుతుంది మరియు దీని నుండి వచ్చే లాభం సొసైటీకి ఉండకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి వెళ్తుంది అని వివరించారు.

 

image.png


దాదాపు రూ.కోటి వ్యయంతో గాంధీధామ్‌లో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌ కోసం ఇఫ్కో బ్యాంకు నుంచి ఒక్క రూపాయి కూడా రుణం తీసుకోలేదని కేంద్ర సహకార శాఖ మంత్రి తెలిపారు. 70 ఎకరాల్లో 350 కోట్లు, ఇఫ్కోకు 100 శాతం ఈక్విటీ ఉంది. ఇఫ్కో యొక్క ఈక్విటీ అంటే 4 కోట్ల రైతుల ఈక్విటీ అని ఆయన అన్నారు. ఇఫ్కో యొక్క డబ్బు పిఏసిల ద్వారా రైతుకు తిరిగి వెళ్తుంది. ఈ ప్లాంట్ నుంచి 500 ఎంఎల్‌ల 2 లక్షల నానో యూరియా బాటిళ్లను దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా పంపుతామని దీంతో 60 మిలియన్ బ్యాగుల యూరియా దిగుమతులు తగ్గుతాయని, ఎరువుల రంగంలో భారత్‌ స్వయం ప్రతిపత్తిని సాధిస్తుందని చెప్పారు. దీనివల్ల సుమారు రూ.10 వేల కోట్ల ఎరువుల సబ్సిడీ కూడా ఆదా అవుతుందని తద్వారా రైతులకు తిరిగి వస్తుందని, విదేశీ మారకద్రవ్యం కూడా దాదాపు రూ. 3,500 కోట్లు ఆదా అవుతుందని చెప్పారు. ఈ కర్మాగారంలో ద్రవ డిఎపి ఉత్పత్తి ఏడాదిలోపు ప్రారంభమవుతుందని శ్రీ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్లాంట్ సున్నా ద్రవ ఉత్సర్గ ఆధారంగా నిర్మించబడిందని ఇది పర్యావరణాన్ని కాపాడుతుంది మరియు ఎరువుల ధరను తగ్గిస్తుందని చెప్పారు.

ఎరువుల ఉత్పత్తి మరియు విక్రయాలలో సహకార రంగం దేశ వ్యవసాయ విప్లవానికి బలమైన మూలస్తంభంగా మారిందని నేడు ఈ స్తంభం మరింత బలపడిందని శ్రీ అమిత్ షా అన్నారు. “సహకార్ సే సమృద్ధి” అనే మంత్రాన్ని సాకారం చేసేందుకు ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ (పిఎసిఎస్‌) నుంచి అపెక్స్ వరకు ప్రతి రంగంలోనూ ప్రధాని మోదీ మార్పులు తీసుకొచ్చారని, పిఎసిఎస్‌ను బహుమితీయంగా మార్చడమే అతిపెద్ద మార్పు అని ఆయన అన్నారు. ఇప్పుడు పిఎసిఎస్‌ ఎరువుల దుకాణం, చౌక ధరల మందుల దుకాణం, సరసమైన ధర ధాన్యం దుకాణం మరియు పెట్రోల్ పంపులను తెరవగలదు. ఇప్పుడు పిఎసిఎస్‌ కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్‌సి) మరియు బ్యాంక్ మిత్రగా కూడా మారవచ్చు. దీనితో పాటు, ఇప్పుడు పిఎసిఎస్‌ డెయిరీ మరియు మత్స్యకారుల కమిటీని కూడా ఏర్పాటు చేయవచ్చు. మోడీ ప్రభుత్వం పిఎసిఎస్‌ ద్వారా వ్యవసాయ ఫైనాన్స్ మరియు వ్యవసాయ పంపిణీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తోందని, ఇది దేశంలో కొత్త హరిత విప్లవానికి సహకార రంగాన్ని కేంద్రంగా మారుస్తుందని శ్రీ షా అన్నారు.

 

image.png


ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ పథకాన్ని కూడా పిఎసిఎస్‌ కింద ప్రభుత్వం తీసుకొచ్చిందని కేంద్ర హోం మరియు సహకార మంత్రి తెలిపారు. దీంతో తహసీల్‌లోని న్యాయమైన ధరల ధాన్యం దుకాణంలో కావాల్సిన గోధుమలన్నీ తహసీల్‌లో కొనుగోలు చేసి తహసీల్‌లో నిల్వ చేసుకుని అక్కడి నుంచి గోధుమలు గ్రామానికి వెళ్తాయన్నారు. దీంతో రవాణాపై వేల కోట్ల రూపాయలు ఆదా అవడంతో పాటు ఫుడ్‌ స్టోరేజీకి సంబంధించిన అద్దెను కూడా ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పీఏసీఎస్‌కు చెల్లించనుంది. ప్రస్తుతం పీఏసీఎస్‌లో యువతకు అనేక అవకాశాలున్నాయని, ఈ కార్యక్రమాలన్నింటికి సంబంధించిన సమాచారం సహకార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందన్నారు. రైతులందరూ పిఎసిఎస్‌లను సజీవంగా ఉంచి ముందుకు తీసుకెళ్లాలని శ్రీ షా విజ్ఞప్తి చేశారు. వచ్చే 5 ఏళ్లలో 3 లక్షల కొత్త పిఎసిఎస్‌లను రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని దీని వల్ల వ్యవసాయ ఆర్థిక, వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని శ్రీషా తెలిపారు.
 

***



(Release ID: 1948316) Visitor Counter : 122


Read this release in: English , Urdu , Gujarati , Tamil