రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే ల నిర్వహణలో భద్రతను మరింత మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వే తీసుకున్న చర్యలు.
Posted On:
09 AUG 2023 4:35PM by PIB Hyderabad
రైల్వే కార్యకలాపాలలొ భద్రతను మరింత పెంచేందుకు భారతీయ రైల్వే కింది చర్యలు చేపట్టింది.
1.రైల్వేలో కీలక భద్రతా ఆస్తుల మార్పు, పునరుద్ధరణ, స్థాయి పెంపునకు సంబంధించి 5 సంవత్సరాల కాలానికి లక్ష కోట్ల రూపాయల నిధితో రాష్ట్రీయ రైల్ సంకర్ష్ కోష్(ఆర్.ఆర్.ఎస్.కె)ని 2017-18 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. 2017-18 నుంచి 2021-22 వరకుఆర్.ఆర్.ఎస్.కె పనులపై స్థూలంగా 1.08 లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేయడం జరిగింది.
2. కేంద్రీక్రుత పాయింట్లతోకూడిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలు,సిగ్నళ్లను 31.05.23 నాటికి 6,427 స్టేషన్లలో ఏర్పాటు చేయడం జరిగింది. మానవ వైఫల్యం కారణంగా ప్రమాదాలు నివారించకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.
3. 31.05.23 నాటికి , 11,093 లెవల్ క్రాసింగ్ ల వద్ద ఇంటర్ లాకింగ్ లెవల్ క్రాసింగ్ గేట్లను ఏర్పాటు చేశారు. లెవల్ క్రాసింగ్ లవద్ద భద్రత పెంపునకు ఇది ఉపకరిస్తుంది.
4.31.05.23 నాటికి 6,377 స్టేషన్ల వద్ద ట్రాక్ పై రైళ్ల రాకపోకలను పరిశీలించేందుకు మొత్తం ట్రాక్ సర్క్యూటింగ్ ఏర్పాటు.
5.సిగ్నలింగ్ భద్రతకు సంబంధించి, సవివరమైన ఆదేశాలు జారీచేయడం జరిగింది. తప్పనిసరి చెకింగ్, ఇతర అంశాలకు సంబంధించి ఆదేశాలు జారీ.
6.ప్రొటోకాల్ ప్రకారం ఎస్ అండ్ టి పరికరాల తొలగింపు, తిరిగి అనుసంధానం వంటి వాటి విషయమై ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది.
7. అన్ని లోకోమోటివ్ లకు విజిలెన్స్ కంట్రోల్ పరికరాలు అమర్చారు. ది లోకోపైలట్ లను అప్రమత్తం చేస్తుంది.
8.మంచు వాతావరణంలో, సరిగా కనిపించని పరిస్థితిలో సిగ్నల్ కు కాస్త ముందుగానే, రెట్రో రిఫ్లక్టెవి సిగ్మా బోర్డులను ఏర్పాటు చేసి , ముందు కొద్ది దూరంలో సిగ్నల్ ఉందన్న విషయం తెలిపేలా చూస్తారు.
9. జిపిఎస్ ఆధారిత ఫాగ్ సేఫ్టీ డివైస్ (ఎఫ్.ఎస్.డి)ను లోకో పైలట్లకు అందజేస్తారు.దీనివల్ల లోకోపైలట్ లు, సిగ్నల్ లు, లెవల్ క్రాసింగ్ లవంటివి ఎంత దూరంలో ఉన్నాయో గుర్తించగలుగుతారు.
10.ఆధునిక ట్రాక్ నిర్మాణాలు 60 కెజిల బరువువి ఏర్పాటు. రెయిల్స్ ,అంతిమంగా టెన్సిల్ పటిష్టత 90 గా ఉండేట్టు చూస్తారు. పిఎస్ సి కాంక్రీట్ స్లీపర్లు, సాధారణ, వెడల్పాటి బేస్ కలిగిన స్లీపర్లు, ఎలాస్టిక్ ఫాస్టింగ్ కలిగినవి, స్టీల్ చానల్, హెచ్ బీమ్ స్లీపర్లు గిర్దర్ బ్రిడ్జ్ లపై ఏర్పాటు చేస్తారు.
11. ట్రాక్ యంత్రాలైన పి.క్యు.ఆర్.ఎస్, టిఆర్‌టి, టి`28 వంటి వాటి ద్వారా , ట్రాక్ వేసే పనిచేపట్టడం. దీనివల్ల మానవ తప్పిదాలకు అవకాశం ఉండదు.
12. 130ఎం, 260ఎం పొడవాటి రెయిల్‌ప్యానల్ల సరఫరాను గరిష్ఠస్థాయికి తీసుకెళ్లడం, జాయింట్ వెల్డింగ్‌లు లేకుండా చూడడం, ఫలితంగా భద్రతకు పెద్ద పీట వేయడం.
13. పొడవాటి, పట్టాలు వేయడం. దీనితో అల్యుమినో థర్మిక్ వెల్డింగ్ , మెరుగైన వెల్డింగ్ సాంకేతికత,ఫ్లాష్ బట్ వెల్డింగ్ అమలు.
14.ఆసిలేషన్ మానిటరింగ్ వ్యవస్థ , ట్రాక్ రికార్డింగ్ కార్ల ద్వారా, ట్రాక్ జామెట్రీ పర్యవేక్షణ.
15.వెల్డ్, రెయిల్ పగుళ్లను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ.
16. థిక్ వెబ్ స్విచ్‌లు, వెల్డింగ్ చేయడానికి అనువైన సిఎంఎస్ క్రాసింగ్ రెన్యువల్ వర్క్‌లు.
17.రైల్వే భద్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు తనిఖీలు జరిపి, సురక్షిత విధానాలు అనుసరించేందుకు సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం.
18.ట్రాక్ ఆస్తులను వెబ్ ఆధారిత పర్యవేక్షక వ్యవస్థద్వారా గమనించడం.
19ట్రాక్ భద్రతకు సంబంధించి సవివరమైన మార్గదర్శకాలు జారీ.ఉదాహరణకు సమీకృత బ్లాక్, కారిడార్ బ్లాక్, వర్క్‌సైట్ భద్రత, వర్షాకాల జాగ్రత్తలు వంటివాటికి సంబంధించి మార్గదర్శకాలు జారీచేశారు.
20. దేశవ్యాప్తంగా రైల్వే ప్రమాదాలను నిరోధించేందుకు ఎప్పటికప్పుడు రైల్వే కోచ్‌లు, వ్యాగన్ల తనిఖీ.
21 సంప్రదాయ ఐసిఎఫ్ డిజైన్ కోచ్‌ల స్థానంలో ఎల్.హెచ్.బి డిజైన్ కొచ్‌లను ఏర్పాటు చేయడం.
22. బ్రాడ్ గేజ్ రూట్ లో, కాపలా లేని అన్ని క్రాసింగ్‌లను 2019 నాటికి తొలగింపు
23. రైల్వే బ్రిడ్జిల భద్రతకు పూచీపడడం, ఎప్పటికప్పుడు వాటి తనిఖీలు చేపట్టడం. తనిఖీ ల సమయంలో గుర్తించిన లోపాలను సరిచేసి, బ్రిడ్జిల పటిష్ఠతకు చర్యలు తీసుకోవడం.
24. భారతీయ రైల్వే అన్ని కోచ్ లలో అగ్ని ప్రమాద నివారణ సూచీలను విస్తృతంగా ఏర్పాటు చేసింది. ప్రతి కోచ్‌లో అగ్నిప్రమాద నివారణ పోస్టర్లను ఏర్పాటు చేశారు. అలాగే అగ్నిప్రమాదాలను నివారించేందుకు తీసుకోవలసిన చర్యలపై సూచనలు. అలాగే మంటలకు , అగ్ని ప్రమాదాలకు, పేలుడుకు కారణమయ్యేవాటిని కోచ్ లలో తీసుకువెళ్లకుండా ఉండేలా ప్రజలను చైతన్యవంతులను చేయడం, కోచ్‌లలో పొగతాగకుండా చూడడం వంటి వాటి విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతోంది.,
25. కొత్తగా తయారైన పవర్ కార్‌లు, ప్యాంట్రీకార్లలో మంటలు,పొగను వెంటనే గుర్తించే ఏర్పాటు చేశారు. ఇందుకు తగిన ఏర్పాట్లను ప్రొడక్షన్ యూనిట్లు చేస్తున్నాయి. ప్రస్తుత కోచ్ లలో కూడా ఈవిధమైన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జోనల్ రైల్వేల వారీగా దశల వారీగా దీనిని చేపడుతున్నారు.
26. సిబ్బందికి క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహణ.
27. రోలింగ్ బ్లాక్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మెయింటినెన్స్, రిపేర్, రిప్లేస్‌మెంట్ ను రోలింగ్ పద్ధతిలో రెండు వారాల ముందే ప్లాన్ చేయడం జరుగుతోంది. దీనిని ప్రణాళిక ప్రకారం అమలు చేస్తారు.
ఎస్‌పిఎడి ని నిరోధించడమే కాక, ఎస్.పిఎ.డిపై భద్రతా చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టడం జరుగుతోంది. లోకో పైలట్‌లు, అసిస్టెంట్ లోకో పైలట్‌లు, వారి కుటుంబాలకు డ్యూటీకి ముందు తగిన విశ్రాంతి అవసరమన్నప్రాధాన్యతను తెలియజేయడం జరుగుతొంది. ఎస్‌పిఎడి కేసులకు సంబంధించి డివిజన్లు, జోనల్ హెడ్‌క్వార్టర్లలో , రైల్వేబోర్డు స్థాయిలో సమీక్ష నిర్వహించడం జరుగుతోంది.
ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (యుఐసి) అనేది వరల్డ్ రైల్వేల అంతర్జాతీయ యూనియన్. ఇది సభ్యుల మధ్య మరింత సహకారాన్ని పెంపొందించే సంస్థ. ప్రస్తుతం, రైల్వే భద్రతకు సంబంధించి న సవాళ్ల విషయంలో యుఐసికి, భారతీయ రైల్వేకి మధ్య సహాయానికి ఎలాంటి ఒప్పందం లేదు.
ఈ సమాచారాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
***
(Release ID: 1947495)
Visitor Counter : 87